ఆస్ట్రేలియా అహంకారం.. వరల్డ్ కప్​ను ఇలాగేనా గౌరవించేది?

  • Author singhj Updated - 11:45 AM, Mon - 20 November 23

భారత్​పై విజయంతో ఆరోసారి వరల్డ్ కప్ నెగ్గి సంబురాల్లో మునిగిపోయింది ఆసీస్. అయితే ఆ టీమ్ కప్పు విషయంలో వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది.

భారత్​పై విజయంతో ఆరోసారి వరల్డ్ కప్ నెగ్గి సంబురాల్లో మునిగిపోయింది ఆసీస్. అయితే ఆ టీమ్ కప్పు విషయంలో వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది.

  • Author singhj Updated - 11:45 AM, Mon - 20 November 23

టీమిండియాకు మళ్లీ నిరాశే మిగిలింది. 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతారేమో అనుకుంటే మరోమారు ఆస్ట్రేలియా ముందు మనోళ్లు తలవంచారు. 2003 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి రివేంజ్ తీర్చుకుంటారని భావిస్తే.. ఇంకోసారి వాళ్ల చేతుల్లోనే ఓడారు. మొన్నే దీపావళి పోయింది.. కప్పు గెలిస్తే మరోమారు పండుగను సెలబ్రేట్ చేద్దామనుకుంటే పీడకలనే మిగిల్చారు. 140 కోట్ల మంది ప్రజలు అన్ని పనులు మానుకొని టీవీ సెట్లు, ఫోన్లకు అతుక్కుపోయి ఎన్నో ఆశలతో, ఎంతో ఆసక్తితో చూసిన మ్యాచ్​లో భారత్ ఓడిపోయింది. ప్రతిష్టాత్మక మెగా టోర్నీ ఫైనల్లో ఆసీస్​ చేతిలో రోహిత్ సేనకు పరాభవమే మిగిలింది.

మెగా ఫైనల్లో ముందుగా టాస్ నెగ్గిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ట్రిక్కీ పిచ్​పై బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత్​కు కెప్టెన్ రోహిత్ శర్మ (47) ఎప్పటిలాగే మెరుపు ఆరంభాన్ని అందించాడు. కానీ శుబ్​మన్ గిల్ (4) మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ (4) కూడా ఏదో తొందరలో ఉన్నట్టు వెంటనే పెవిలియన్​కు చేరుకున్నాడు. అయితే విరాట్ కోహ్లీ (54), కేఎల్ రాహుల్ (66) టీమ్​ను ఆదుకున్నారు. కోహ్లీ తనదైన శైలిలో స్ట్రైక్ రొటేట్ చేస్తూ పోయాడు. కానీ రాహుల్ మాత్రం నిదానంగా బ్యాటింగ్ చేశాడు. దీంతో రన్​రేట్ బాగా పడిపోయింది. ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్ (18) ఆకట్టుకున్నా టీమ్​కు భారీ స్కోరును అందించలేకపోయాడు.

ఒక మాదిరి టార్గెట్​ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన ఆసీస్​కు బుమ్రా, షమి షాకిచ్చారు. వీళ్లిద్దరూ చెలరేగడంతో అపోజిషన్ టీమ్ 47 రన్స్​కే 3 వికెట్లు కోల్పోయింది. ఈ టైమ్​లో క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్ (58) అండతో ట్రావిస్ హెడ్ (137) ఇన్నింగ్స్​ను నిలబెట్టాడు. క్రీజులో కుదురుకున్నాక వరుస బౌండరీలు, సిక్సులు కొడుతూ జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు. సెంచరీ పూర్తయిన తర్వాత కూడా అదే జోరును కంటిన్యూ చేసిన హెడ్ ఆఖర్లో ఔటైనా.. మ్యాక్స్​వెల్ (2)తో కలసి మిగిలిన పనిని ఫినిష్ చేశాడు లబుషేన్. బౌలర్లు ఫెయిలవ్వడం, ఫీల్డింగ్ ప్లేస్​మెంట్స్ విషయంలో రోహిత్ సరైన డెసిజన్స్ తీసుకోకపోవడం, అటాకింగ్ మైండ్​సెట్ లేకపోవడం భారత్​కు నెగెటివ్​గా మారింది. రోహిత్ సేనపై గెలుపుతో ఆరోసారి వరల్డ్ కప్ నెగ్గిన ఆనందంలో ఆస్ట్రేలియా ప్లేయర్లు మస్త్ సెలబ్రేట్ చేసుకున్నారు.

ప్రతిష్టాత్మక ఫైనల్లో ఓటమితో టీమిండియా ఆటగాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. కోహ్లీ, రోహిత్, సిరాజ్ ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. ఒకవైపు భారత క్రికెటర్లు ఏడస్తుంటే.. మరోవైపు ఆసీస్ క్రికెటర్లు సెలబ్రేషన్స్​లో మునిగిపోయారు. అయితే కప్పు నెగ్గిన తర్వాత ఆ జట్టు ప్లేయర్లు ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. క్రికెట్​లో ఎంతో గొప్పగా భావించే వరల్డ్ కప్​పై ఆసీస్ ఆల్​రౌండర్ మిచెల్ మార్ష్ తన రెండు కాళ్లు పెట్టి పోజు ఇచ్చాడు. కప్పుపై మార్ష్​ కాళ్లు పెట్టిన ఫొటో వైరల్ అవుతుండటంతో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. ఆస్ట్రేలియా అహంకారానికి ఇది నిదర్శనమని.. కప్పును గౌరవించే పద్ధతి ఇదేనా అని ఫైర్ అవుతున్నారు. మరి.. వరల్డ్ కప్​ను ఆసీస్ అవమానించడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్‌ కప్‌ ఫైనల్లో టీమిండియా ఓటమికి 5 ప్రధాన కారణాలు!

Show comments