వరల్డ్ పాపులర్ స్పోర్ట్స్‌లో క్రికెట్ ఒకటనేది తెలిసిందే. ఈ గేమ్‌ను కొన్ని దేశాల్లో ఎంటర్టైన్మెంట్, సరదా కోసం చూస్తారు. కానీ భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి ఆసియా దేశాల్లో క్రికెట్‌ను ఒక మతంగా భావిస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఇండియాలో అయితే జెంటిల్మన్ గేమ్‌కు ఓ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక, క్రికెటర్లను అయితే ఇక్కడ హీరోల్లా చూస్తుంటారు. వారికి ఉండే ఫ్యాన్ బేస్ వేరే లెవల్ అనే చెప్పాలి. మన దేశంలో ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగినా స్టేడియాలు ఫ్యాన్స్‌తో ఫుల్‌గా నిండిపోతాయి. తమ అభిమాన క్రికెటర్ల ఆటతీరును చూసేందుకు అభిమానులు వేలాదిగా మైదానాలకు పోటెత్తుతారు.
స్టేడియంలో మ్యాచ్‌లను ఎంత మంది చూస్తారో అంతకు ఎన్నో రెట్ల సంఖ్యలో టీవీలు, ఫోన్లలో ఫ్యాన్స్ తిలకిస్తారు. భారత్ ఆడే మ్యాచ్‌లకు వీక్షకాదరణ ఎక్కువగా ఉంటుంది. టీమిండియా ఆడే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లతో పాటు భారత స్టార్ క్రికెటర్లు ఆడే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు వ్యూయర్షిప్ కోట్లలో ఉంటుంది. ఇక, వరల్డ్ కప్ లాంటి టోర్నీలో భారత్ ఆడుతోందంటే ప్రేక్షకులకు స్టేడియాలు సరిపోవు. అందునా దాయాది పాకిస్థాన్‌తో టీమిండియా తలపడుతోందంటే ఉత్కంఠత తారస్థాయికి చేరుకుంటుంది. క్రికెట్లో ఎన్నో భీకరమైన మ్యాచ్‌లు ఈ రెండు జట్ల మధ్య జరిగాయి. ఈ ఇరు జట్లు గ్రౌండ్లో తలపడితే కొదమసింహాలు కొట్లాడుకున్నట్లే ఉంటుంది.
భారత్ వేదికగా త్వరలో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌లో ఇండియా-పాకిస్థాన్ మరోమారు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద మైదానమైన నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుంది. దీంతో ఈ మ్యాచ్ టికెట్లకు ఫుల్ గిరాకీ ఏర్పడింది. టికెట్లతో పాటు అహ్మదాబాద్‌లో హోటల్ రూమ్స్‌కు కూడా డిమాండ్ ఎక్కువైంది. ఎంతగా అంటే.. రూ.వేలు పలికే రూమ్ రేట్ కాస్తా రూ.లక్షల్లో పలుకుతోందట. దీంతో హోటల్ రూమ్స్ దొరకనివాళ్లు, అంత ధర పెట్టి రూమ్స్‌లో ఉండలేని వాళ్లు స్థానిక ఆస్పత్రుల్లో బెడ్స్‌ను బుక్ చేసుకుంటున్నారని సమాచారం. ఒక మ్యాచ్ కోసం ఇలా హాస్పిటల్ బెడ్స్ బుక్ చేయడం బహుశా క్రికెట్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్ కావొచ్చు. మరి.. మ్యాచ్ కోసం ఇలా బెడ్స్‌ను బుక్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Fans are booking hospital beds in Ahmedabad as hotel rooms hit record breaking rates for India Vs Pakistan match. (Ahmedabad Mirror). pic.twitter.com/RZnfIZOURz
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 21, 2023