Nidhan
అండర్-19 వరల్డ్ కప్‌లో జూనియర్ ధోని అదరగొడుతున్నాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో మాహీని గుర్తుచేస్తున్నాడు.
అండర్-19 వరల్డ్ కప్‌లో జూనియర్ ధోని అదరగొడుతున్నాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో మాహీని గుర్తుచేస్తున్నాడు.
Nidhan
క్రికెట్లో ఇద్దరు అన్నాదమ్ములు కలసి ఆడితే చూడాలని చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటారు. అలా ఆడిన స్టార్లు కూడా ఉన్నారు. టీమిండియాలోనే ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ కలసి ఆడి అభిమానులను థ్రిల్‌కు గురిచేశారు. ఈ మధ్య కాలంలో హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ద్వయం కూడా భారత జట్టుకు కలసి ఆడారు. ఇప్పుడు మరో ద్వయం టీమిండియాకు ఆడాలని ఉవ్విళ్లూరుతోంది. అందులో ఒకరు సర్ఫరాజ్ ఖాన్ అయితే మరొకరు అతడి తమ్ముడు ముషీర్ ఖాన్. డొమెస్టిక్ క్రికెట్లో పరుగుల వరద పారించిన సర్ఫరాజ్‌కు ఎట్టకేలకు సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. అయితే అతడి తమ్ముడు కూడా త్వరలో నేషనల్ టీమ్‌లో ఎంట్రీ ఇచ్చేలాగే ఉన్నాడు. అండర్ 19 వరల్డ్ కప్‌లో దుమ్మురేపుతూ జూనియర్ ధోనీగా పేరు తెచ్చుకున్నాడు ముషీర్. తాజాగా అతడు మరో సెంచరీతో అదరగొట్టాడు.
సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ ప్రస్తుతం టీమిండియా అండర్-19 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ టోర్నీలో భాగంగా ఇటీవలే ఐర్లాండ్‌పై సెంచరీతో ఒక్కసారిగా అందరి అటెన్షన్‌ను తన వైపునకు తిప్పుకున్నాడీ బ్యాటర్. ఇప్పుడు మరో సెంచరీతో హాట్ టాపిక్‌గా మారాడు. ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 126 బంతుల్లో 131 పరుగులు చేశాడు ముషీర్. టీమిండియా లెజెండ్ ఎంఎస్ ధోనీలా హెలికాప్టర్ షాట్లు కొడుతూ ఆకట్టుకున్నాడు. పవర్ హిట్టింగ్తో కివీస్ బౌలర్లపై అటాక్‌కు దిగాడు. ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌లో ముషీర్ బ్యాటింగే హైలైట్ అని చెప్పాలి. అతడు ఇన్నింగ్స్‌ను బిల్డ్ చేసిన విధానం ఆకట్టుకుంది. ఈ సెంచరీ ద్వారా అతడు అరుదైన ఘనతను అందుకున్నాడు. అండర్ 19 వరల్డ్ కప్ హిస్టరీలో రెండు సెంచరీలు కొట్టిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు. కప్ చరిత్రలో శిఖర్ ధవన్ మాత్రమే రెండు శతకాలు కొట్టాడు.
ఇక, ముషీర్‌తో పాటు అతడి అన్నయ్య సర్ఫరాజ్ ఇటీవల ఒకే రోజు సెంచరీలతో చెలరేగారు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన టెస్ట్‌లో 161 పరుగులతో ఆకట్టుకున్నాడు సర్ఫరాజ్. అదే రోజు ఐర్లాండ్‌పై ముషీర్ శతకం బాదాడు. సూపర్బ్ ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్‌ను సెలక్టర్లు కరుణించారు. ఇంగ్లండ్‌తో జరగనున్న రెండో టెస్టుకు అతడ్ని సెలక్ట్ చేశారు. స్టార్ ప్లేయర్లు జడేజా, రాహుల్ గాయం కారణంగా దూరమవడంతో అతడికి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు. ఈ తరుణంలో మరో సెంచరీతో అతడి సోదరుడు ముషీర్ మళ్లీ అందరి చూపులను తన వైపునకు తిప్పుకున్నాడు. అతడు ఇదే జోరును కొనసాగించి అటు డొమెస్టిక్ క్రికెట్‌తో పాటు ఇటు ఐపీఎల్ లాంటి లీగ్స్‌లో కూడా బాగా ఆడితే త్వరలో టీమిండియాలో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. మరి.. సర్ఫరాజ్‌తో కలసి ముషీర్ కూడా భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
Musheer Khan recreated MS Dhoni’s iconic helicopter shot during the U19 World Cup match against New Zealand!🤩🔥 pic.twitter.com/tqR0HXmMwV
— CricketGully (@thecricketgully) January 30, 2024