Somesekhar
ఇంగ్లండ్ తో జరిగిన 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో సత్తాచాటాడు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. దీంతో ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. అయితే అశ్విన్ ఈ ఘనత సాధించడం ఎన్నిసార్లో తెలుసా?
ఇంగ్లండ్ తో జరిగిన 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో సత్తాచాటాడు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. దీంతో ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. అయితే అశ్విన్ ఈ ఘనత సాధించడం ఎన్నిసార్లో తెలుసా?
Somesekhar
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇంగ్లండ్ తో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో 26 వికెట్లు పడగొట్టి.. లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు. దీంతో టెస్టు క్రికెట్ లో వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ గా అవతరించాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. అయితే అశ్విన్ ఈ ఘనత సాధించడం ఎన్నోసారో తెలుసా?
ఐసీసీ తాజాగా టెస్టు క్రికెట్ బౌలింగ్ ర్యాంకులను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్ లో సత్తాచాటాడు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఇంగ్లండ్ తో ముగిసిన ఐదు టెస్టుల్లో 26 వికెట్లు పడగొట్టి దుమ్మురేపాడు. దీంతో టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్ లో టాప్ ర్యాంక్ ను కైవసం చేసుకున్నాడు. కాగా.. ఓవరాల్ గా అశ్విన్ కెరీర్ లో అగ్రస్థానాన్ని పొందడం ఇది ఆరోసారి కావడం విశేషం. 2015లో తొలిసారి ఫస్ట్ ర్యాంక్ ను సాధించాడు. టీమిండియా స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రాను వెనక్కి నెట్టి అశ్విన్ ఈ ఘనత సాధించాడు.
ఇక చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఐసీసీ ర్యాంకింగ్స్ లో దూసుకొచ్చాడు. సంచలన ప్రదర్శన చేసిన అతడు ఏకంగా 15 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ ర్యాంక్ 16వ ప్లేస్ కు వచ్చాడు. అయితే ఇప్పటి వరకు టాప్ లో ఉన్న బుమ్రా మూడో ప్లేస్ కు పడిపోయాడు. కివీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో సత్తాచాటిన హెజిల్ వుడ్ రెండో స్థానానికి వచ్చాడు. ఆల్ రౌండర్స్ ర్యాంకింగ్స్ లో సైతం అశ్విన్ దుమ్మురేపాడు. ఈ జాబితాలో రవీంద్ర జడేజా టాప్ లో ఉండగా.. అశ్విన్ రెండో ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే.. రోహిత్ శర్మ ఐదు స్థానాలు ఎగబాకి 6వ ర్యాంక్ లో నిలిచాడు. మరోవైపు యువ సంచలనం యశస్వీ జైస్వాల్ 8వ ప్లేస్ లో నిలిచాడు. టీమిండియా రన్ మెషిన్ 9వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. మరి అశ్విన్ ఏకంగా ఆరోసారి టాప్ ర్యాంక్ సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
R Ashwin is back to No. 1 in the ICC Test bowling rankings 🔝 pic.twitter.com/EOqpjwitbd
— ESPNcricinfo (@ESPNcricinfo) March 13, 2024
ఇదికూడా చదవండి: కాళ్ళు తీసేసే స్థితి నుండి.. రీ-ఎంట్రీ వరకు! పంత్ గ్రేటెస్ట్ కమ్ బ్యాక్ స్టోరీ!