ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య యాషెస్ సమరం ప్రారంభం అయ్యింది. ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. ఇక ఈ మ్యాచ్ అసలైన టెస్ట్ మ్యాచ్ ను తలపించిందని మాజీలు అభిప్రాయా పడుతున్నారు. ఈ క్రమంలోనే విజయంతో సంబరాలు జరుపుకుంటున్న ఆసీస్ కు, ఓటమితో బాధపడుతున్న ఇంగ్లాండ్ కు షాకిచ్చింది ఐసీసీ.
ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఉత్కంఠ విజయాన్ని సాధించింది. ఇంగ్లాండ్ పై 2 వికెట్ల తేడాతో.. గెలిచి ఐదు టెస్ట్ ల సిరీస్ లో 1-0తో ముందంజలో ఉంది. అయితే మ్యాచ్ గెలిచిన ఆసీస్ కు, ఓడిపోయిన ఇంగ్లాండ్ జట్టుకు షాకిచ్చింది ఐసీసీ. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇరు జట్లకు 2 పాయింట్లు కోత విధించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఖాతా నుంచి ఈ పాయింట్లు తొలగించబడతాయి. అలాగే ఇరు జట్లలోని ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానా విధించింది.
కాగా.. రెండు జట్లు కూడా తమకు కేటాయించిన సమయంలో రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో.. ఐసీసీ ఎలైట్ ప్యానల్ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.22 ప్రకారం.. నిర్ణీత టైమ్ లోగా ఒక ఓవర్ తక్కువగా వేస్తే.. ప్లేయర్ల మ్యాచ్ ఫీజ్ లో 20 శాతం కోత విధిస్తారు. ఇక ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ నిబంధనల్లో ఆర్టికల్ 16.11.2 ప్రకారం ఒక ఓవర్ తక్కువగా వేస్తే.. ఒక పాయింట్ కోత విధిస్తారు. ఈ మ్యాచ్ లో రెండు జట్లు రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో.. చెరో రెండు పాయింట్లు కోత విధించారు.
England and Australia have been fined 40% of their match fees and docked 2 points each from the WTC table. pic.twitter.com/2SFSrbWDAN
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2023