సెమీస్‌లో ఓడి బాధలో ఉన్న ఆఫ్ఘానిస్థాన్‌కు షాకిచ్చిన ICC

Rashid Khan, BAN vs AFG, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో ఓడి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌కు ఐసీసీ మరో భారీ షాకిచ్చింది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Rashid Khan, BAN vs AFG, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో ఓడి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌కు ఐసీసీ మరో భారీ షాకిచ్చింది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో సౌతాఫ్రికా చేతిలో ఘోర ఓటమి పాలైంది ఆఫ్ఘనిస్థాన్‌. క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఆఫ్ఘనిస్థాన్‌ ఓ వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్‌కు చేరుకుంది. లీగ్‌ దశలో న్యూజిలాండ్‌ను, సూపర్‌ 8 స్టేజ్‌లో ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్లను ఓడించిన ఆఫ్ఘనిస్థాన్‌.. భారీ సంచలనాలు నమోదు చేసి.. సెమీస్‌లోకి అడుగుపెట్టింది. పైగా సెమీ ఫైనల్‌లో సౌతాఫ్రికాతో తలపడాల్సి రావడంతో.. ఆఫ్ఘనిస్థాన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే.. అంతకు ముందు ఎప్పుడూ కూడా సౌతాఫ్రికాకు సెమీ ఫైనల్‌లో గెలిచిన చరిత్ర లేదు. వన్డే, టీ20 వరల్డ్‌ కప్‌ ఏదైనా.. సెమీ ఫైనల్‌ గండాన్ని సౌతాఫ్రికా దాటేలేదు. అందుకే వారిని ఛోకర్స్‌ అంటారు. అలాంటి టీమ్‌తో సెమీస్‌ కావడంతో ఆఫ్ఘాన్‌ విజయం సాధిస్తుందని చాలా మంది నమ్మారు.

కానీ, భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘాన్‌ చిత్తుగా ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్‌ చేసి కేవలం 56 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత సౌతాఫ్రికా ఆ స్వల్ప టార్గెట్‌ను ఒక్క వికెట్‌ కోల్పోయి ఛేదించి.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇలా దారుణ ఓటమితో తీవ్ర బాధలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌కు ఐసీసీ మరో షాకిచ్చింది. ఆ జట్టు కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌కు ఓ డీ మెరిట్‌ పాయింట్‌ను ఫైన్‌గా విధించింది. బ్యాట్‌ను నేలకేసి కొట్టినందుకు గాను ఐసీసీ రషీద్‌ను మందలించి.. డీ మెరిట్‌ పాయింట్‌తో సరిపెట్టింది. గత 24 నెలలల్లో రషీద్‌ చేసిన మొదటి తప్పిదం కావడంతో పెద్దగా చర్యలు తీసుకోలేదు. బ్యాట్‌ను నేలకేసి కొట్టడం ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్‌ 2.9ని ఉల్లంఘన కిందికి వస్తుందని, దీన్ని లెవెల్‌ 1 తప్పిదంగా పరిగణిస్తారు.

అయితే.. రషీద్‌ ఖాన్‌ బ్యాట్‌ నేలకేసి కొట్టింది మాత్రం ఈ మ్యాచ్‌లో కాదు. సూపర్‌ 8లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ కెప్టెన్‌ బ్యాట్‌ నేలకేసి కొట్టాడు. బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో రషీద్‌ తన బ్యాట్‌ను నేలకేసి కొట్టాడు. తనతో పాటు క్రీజ్‌లో ఉన్న కరీం జనత్‌ రెండో రన్‌ కోసం రానందుకు రసీద్‌ ఖాన్‌కు కోపం వచ్చింది. ఆ కోపంలోనే బ్యాట్‌ను నేలకేసి కొట్టాడు. ఈ ఘటనపై ఐసీసీ సీరియస్‌ అయి.. రషీద్‌ ఖాన్‌ను మందలించింది. అసలే సెమీస్‌లో ఓడిపోయింది బాధలో ఉన్న రషీద్‌ ఖాన్‌కు ఇది మరో దెబ్బలా మారింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments