అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం క్రీడా ప్రపంచంలో పెను సంచలనాన్ని సృష్టించింది. మరి ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం క్రీడా ప్రపంచంలో పెను సంచలనాన్ని సృష్టించింది. మరి ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం క్రీడా ప్రపంచంలో పెను సంచలనాన్ని సృష్టించింది. ఐసీసీ చేసిన ఈ కీలక ప్రకటన క్రికెట్లో చర్చనీయాంశంగా మారింది. ఐసీసీ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం.. అంతర్జాతీయ క్రికెట్ లోకి వారు రావడంపై నిషేధం విధించింది. సెక్సువల్ క్వాలిఫికేషన్ నిబంధనల్లో ఈ మార్పులు తీసుకొచ్చింది. మరి ఐసీసీ తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఏంటి? ఎవరిపై నిషేధం విధించింది? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలక ప్రకటన చేసింది. ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి ట్రాన్స్ జెండర్లు రావడాన్ని నిషేధించింది. మంగళవారం ఐసీసీ ఆమోదించిన కొత్త నిబంధనల ప్రకారం.. మగ నుంచి ఆడగా మారిన యుక్త వయస్సు వచ్చిన ఏ ప్లేయర్ అయినా.. వుమెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో పాల్గొనడానికి అనుమతించమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఐసీసీ సెక్సువల్ క్వాలిఫికేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఈ నిర్ణయం ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది స్టార్టింగ్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి ప్రవేశించిన తొలి లింగ మార్పిడి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది డేనియల్ మేక్ గాహే. అయితే డేనియల్ ను వుమెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడొద్దని నిషేధం విధించింది.
కాగా.. ఆసీస్ కు చెందిన 29 ఏళ్ల మెక్ గేహె 2021లో లింగమార్పిడి చేయించుకుని మగ నుంచి ఆడగా మారాడు. ఈ చికిత్స తర్వాత 2023లో కెనడా తపపున 6 టీ20 మ్యాచ్ లు కూడా ఆడింది. ఇదంతా గత ఐసీసీ నిబంధనల ప్రకారం జరిగింది. కానీ ఇప్పుడు మార్చిన నిబంధనల ప్రకారం ట్రాన్స్ జెండర్స్ వుమెన్స్ టీమ్ లో ఆడటానికి అనర్హులుగా ప్రకటించింది. ఇదిలా ఉండగా.. దేశీయంగా లింగ అర్హత అనేది ఆయా దేశాలకు సంబంధించిన బోర్డు పరిధిలోనిదని, అది వారి ఇష్టం అని ఐసీసీ తెలిపింది. వుమెన్స్ ఆట, సమగ్రత, భద్రత లాంటి కారణాలను పరిగణలోకి తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. మరి ఐసీసీ తీసుకున్న ఈ డెసిషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Trans cricketer Danielle McGahey pens a heartfelt message following ICC’s ban on transgender players in international women’s cricket.https://t.co/iiHr24M8Ks
— CricTracker (@Cricketracker) November 22, 2023