iDreamPost
android-app
ios-app

Yuvraj Singh: అప్పట్లో ఓ నటితో డేటింగ్ చేశా.. వద్దన్నా నా దగ్గరికి వచ్చేది: యువరాజ్ సింగ్

  • Published Sep 26, 2024 | 3:15 PM Updated Updated Sep 26, 2024 | 4:59 PM

Yuvraj Singh was dating an actress: తాజాగా యువీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగతానికి సంబంధించిన షాకింగ్ విషయాలను వెల్లడించాడు. గతంలో తాను ఓ నటితో డేటింగ్ చేశానని, ఆమె వద్దన్నా తన వద్దకు వచ్చేదని చెప్పుకొచ్చాడు.

Yuvraj Singh was dating an actress: తాజాగా యువీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగతానికి సంబంధించిన షాకింగ్ విషయాలను వెల్లడించాడు. గతంలో తాను ఓ నటితో డేటింగ్ చేశానని, ఆమె వద్దన్నా తన వద్దకు వచ్చేదని చెప్పుకొచ్చాడు.

  • Published Sep 26, 2024 | 3:15 PMUpdated Sep 26, 2024 | 4:59 PM
Yuvraj Singh: అప్పట్లో ఓ నటితో డేటింగ్ చేశా.. వద్దన్నా నా దగ్గరికి వచ్చేది: యువరాజ్ సింగ్

యువరాజ్ సింగ్.. టీమిండియా క్రికెట్ లో ఓ సంచలనం. భారత్ టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర యువీది. క్యాన్సర్ భయపెడుతున్నా.. క్రికెట్ లో తన పోరాటాన్ని మాత్రం ఆపలేదు. ఇక ఆ మహమ్మారి నుంచి కోలుకుని ఎంతో మందికి ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. ఓ ఆటగాడిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో.. వ్యక్తిగత విషయాల్లో కూడా అంతే సంచలనంగా మారి వార్తల్లో నిలిచాడు. ఇదిలా ఉండగా.. తాజాగా యువీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగతానికి సంబంధించిన షాకింగ్ విషయాలను వెల్లడించాడు. గతంలో తాను ఓ నటితో డేటింగ్ చేశానని, ఆమె వద్దన్నా తన వద్దకు వచ్చేదని చెప్పుకొచ్చాడు.

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ మాట్లాడుతూ..”అప్పట్లో నేను ఒక సినీ నటితో డేటింగ్ చేశాను. ఆమె కూడా అప్పుడు ఉన్నత స్థాయిలోనే ఉంది. 2007-2008 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నేను ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాను. అదే టైమ్ కు షూటింగ్ కోసం తను కూడా ఆడిలైడ్ వచ్చింది. అయితే మేం కాన్ బెర్రాలో ఉన్నామని అక్కడు రావొద్దని, నేను గేమ్ పై దృష్టి పెట్టాలని ఆమెకు చెప్పాను. కానీ.. ఆమె నా మాట వినకుండా మా వెనకాలే కాన్ బెర్రాకు వచ్చింది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్? అని అడిగా.. నీతో టైమ్ స్పెండ్ చేయడానికి అంటూ బదులిచ్చింది. దాంతో ఆ రోజు ఆమెతోనే ఉన్నా. ఆ తర్వాత.. నువ్వు నీ కెరీర్ పై దృష్టి పెట్టు.. నేను నా ఆటపై దృష్టిపెడతా అన్నా. ఇక కాన్ బెర్రా నుంచి ఆడిలైడ్ కు వెళ్లేందుకు సిద్ధం అయితే.. తనే నా సూట్ కేసు ప్యాక్ చేసింది” అంటూ తన జీవితంలో జరిగిన ఆసక్తికర విషయాలను వెల్లడించాడు సిక్సర్ల కింగ్.

అయితే తర్వాత రోజు ప్రయాణం చేయాల్సి ఉండగా.. యువీ తన షూ ఎక్కడ అని ఆమెను అడిగాడు. దాన్ని కూడా లగేజీలో ప్యాక్ చేశానని చెప్పడంతో.. ఇప్పుడు నేనేం వేసుకెళ్లాలని అడిగాడు. నా షూ వేసుకెళ్లని ఆమె సమాధానం ఇవ్వగా.. యువీ నిజంగానే ఆమె పింక్ స్లిప్పర్లు వేసుకుని బస్సు దగ్గరకు వచ్చాడు. చెప్పులు కనపడకుండా లగేజీని అడ్డుపెట్టుకున్నాడు. కానీ.. అప్పటికే కొంత మంద సహచర ప్లేయర్లు చూసి.. చప్పట్లు కొట్టి మరీ ఆటపట్టించారు. వేరేవి కొనే వరకు ఆ స్లిప్పర్లలనే వాడుకున్నా.. అని యువరాజ్ చెప్పుకొచ్చాడు. అయితే ఆ నటి పేరు మాత్రం బయటకి వెల్లడించలేదు యువీ. కాగా.. బ్రిటన్ కు చెందిన హేజిల్ కిచ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈ స్టార్ మాజీ ఆల్ రౌండర్.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş