వాళ్ల కాళ్లు మొక్కలేదని సెలెక్ట్‌ చేయలేదు! గంభీర సంచలన స్టేట్‌మెంట్‌!

Gautam Gambhir, IPL 2024: కేకేఆర్‌ సూపర్‌ ప్రదర్శనతో ఫుల్‌ ఖుషీగా ఉన్న గంభీర్‌.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. వాళ్ల కాళ్లు మొక్కనందుకే తనను ఎంపిక చేయలేదని అని తెలిపాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Gautam Gambhir, IPL 2024: కేకేఆర్‌ సూపర్‌ ప్రదర్శనతో ఫుల్‌ ఖుషీగా ఉన్న గంభీర్‌.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. వాళ్ల కాళ్లు మొక్కనందుకే తనను ఎంపిక చేయలేదని అని తెలిపాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్నాడు. అతను మెంటర్‌గా ఉన్న కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ జట్టు టేబుల్‌ టాపర్‌గా నిలిచి.. ప్లే ఆఫ్స్‌కు వెళ్లింది. 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 3 పరాజయాలు, 2 ఫలితం తేలని మ్యాచ్‌లతో మొత్తం 20 పాయింట్లు సాధించి.. అగ్రస్థానంలో నిలిచింది. ఈ రోజు(మే 21) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో జరగబోయే తొలి క్వాలిఫైయర్‌లో తలపపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. కేకేఆర్‌ నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్తుంది. ఇంత కీలక దశలో ఉన్న సమయంలో గంభీర్‌.. మరింత సంచలనం సృష్టించే విషయం బయటపెట్టాడు. నిజానికి ఏం మాట్లాడినా అది సంచలనమే అవుతోంది.

తాజాగా తన కెరీర్‌ స్టార్టింగ్‌ రోజులను గుర్తు చేసుకుంటూ.. ఓ షాకింగ్‌ విషయం వెల్లడించాడు. తనకు 12, 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అండర్‌-14 టోర్నమెంట్‌కు తనను సెలెక్టర్లు ఎంపిక చేయలేదని, అందుకు కారణం తను వాళ్ల కాళ్లు మొక్కకపోవడమే అని గంభీర్‌ వెల్లడించాడు. అండర్‌ 14 టీమ్‌లో చోటు కోసం వాళ్ల కాళ్లు మొక్కాల్సి వచ్చినప్పుడు గంభీర్‌ మొక్కలేదు. దాంతో గంభీర్‌ను వాళ్లు సెలెక్ట్‌ చేయలేదు. అయినా కూడా గంభీర్‌లో ఎలాంటి మార్పు రాలేదు. అప్పటి నుంచి తాను ఎవరి కాళ్లు మొక్కొద్దని గంభీర్‌ ఫిక్స్‌ అయిపోయాడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా గంభీర్‌ ఏ సెలెక్టర్ల కాళ్లకు దండం పెట్టలేదు. ఇదే విషయాన్ని గంభీర్‌ స్వయంగా వెల్లడించాడు.

గంభీర్‌ మాట్లాడుతూ.. ‘నేను 12 లేదా 13 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, నా మొదటి అండర్‌-14 టోర్నమెంట్ నాకు గుర్తుంది. నేను సెలెక్టర్‌ కాళ్లు మొక్కనందుకు నన్ను ఎంపిక చేయలేదు. అక్కడి నుంచి, నేను ఎప్పటికీ ఎవరి పాదాలను తాకనని నాకు నేను వాగ్దానం చేసుకున్నాను. అలాగే నేను కూడా ఎవర్ని నా కాళ్లు మొక్కనివ్వను’ అని గంభీర్‌ వెల్లడించాడు. అండర్‌ 14కి గంభీర్‌ సెలెక్ట్‌ కాకపోయినా.. తన టాలెంట్‌తో గంభీర్‌ టీమిండియా వరల్డ్‌ కప్‌ అందించే ఓ హీరోలా ఎదిగాడు. ఇండియన్‌ క్రికెట్‌ చరిత్రలో గంభీర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. 2007 టీ20 వరల్డ్‌ కప్‌, 2011 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచి.. ఆ రెండు కప్పులు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే గంభీర్‌ని బిగ్‌ మ్యాచ్‌ ప్లేయర్‌ అని కూడా అంటారు. మరి గంభీర్‌ చెప్పిన విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments