Nidhan
రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూపులో విన్నర్‌గా నిలవాలనేది హైదరాబాద్‌కు తీరని కలగా మారింది. ఒకప్పుడు డొమెస్టిక్ క్రికెట్లో ఫుల్ డామినేషన్ నడిపిన టీమ్.. ఇప్పుడు ఆ స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోతోంది.
రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూపులో విన్నర్‌గా నిలవాలనేది హైదరాబాద్‌కు తీరని కలగా మారింది. ఒకప్పుడు డొమెస్టిక్ క్రికెట్లో ఫుల్ డామినేషన్ నడిపిన టీమ్.. ఇప్పుడు ఆ స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోతోంది.
Nidhan
హైదరాబాద్.. డొమెస్టిక్ క్రికెట్లో ఒకప్పుడు ఈ టీమ్ పేరు చెబితేనే ప్రత్యర్థి జట్లు గజగజలాడేవి. మహ్మద్ అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి ఎందరో గ్రేట్ ప్లేయర్స్‌ను క్రికెట్‌కు అందించింది హైదరాబాద్. ప్రస్తుతం భారత జట్టు తరఫున అదరగొడుతున్న మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ కూడా హైదరాబాదీలే కావడం విశేషం. రంజీ ట్రోఫీలోనూ భాగ్యనగరానికి మర్చిపోలేని చరిత్ర ఉంది. రెండు సార్లు రంజీల్లో ఛాంపియన్‌గా నిలిచిన హైదరాబాద్.. మూడు మార్లు రన్నరప్‌గా నిలిచింది. ఇంత ఘనమైన చరిత్ర ఉన్న జట్టు గత కొన్నేళ్లుగా దారుణమైన ఆటతీరుతో ప్లేట్ డివిజన్‌కు పడిపోయింది. అయితే ఈ ఏడాది మాత్రం ప్లేట్ డివిజన్లో ఫైనల్లో గెలిచి కప్‌ను ఒడిసిపట్టింది. ఈ నేపథ్యంలో టీమ్ ప్లేయర్లకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏ జగన్మోహన్ రావు బంపర్ ఆఫర్ ఇచ్చారు.
ప్లేట్ ఫైనల్లో విన్నర్‌గా నిలిచిన హైదరాబాద్ టీమ్‌కు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు రూ.10 లక్షల ప్రైజ్‌మనీ ప్రకటించారు. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన నితేష్ రెడ్డి, 10 వికెట్లు పడగొట్టిన తనయ్, సెంచరీ బాదిన ప్రజ్ఞయ్ రెడ్డి, కెప్టెన్ తిలక్ వర్మకు తలో రూ.50 వేల ప్రైజ్‌మనీని ఇస్తున్నామని తెలిపారు. అయితే ఇదే వేదిక మీద ఆయన మరో ఆసక్తికర ప్రకటన చేశారు. వచ్చే మూడేళ్లలో హైదరాబాద్ గనుక రంజీ ఎలైట్ ట్రోఫీ నెగ్గితే జట్టుకు రూ.కోటితో పాటు ప్రతి ఆటగాడికి బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్‌గా ఇస్తామని ప్రకటించారు. దీంతో ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. వరల్డ్ కప్ గెలిచినా ఇంత నజరానా ఇవ్వరని.. ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపడం కోసం, గెలవాలనే కసిని పెంచడం కోసం హెచ్‌సీఏ ప్రకటన చేయడం మంచి విషయమని అంటున్నారు.
కారు, డబ్బుల కోసం కాదు.. హైదరాబాద్ ప్రతిష్ట కోసం కప్పు నెగ్గాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎలైట్ గ్రూపులో విజేతగా నిలిచి సత్తా చాటాలని కోరుతున్నారు. హైదరాబాద్ పవర్ ఏంటో చూపించాల్సిన టైమ్ వచ్చేసిందని అంటున్నారు. ఇక, ఉప్పల్ స్టేడియంలో మేఘాలయతో మంగళవారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. ప్రత్యర్థి ఇచ్చిన టార్గెట్‌ను 5 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసేసింది. కెప్టెన్ తిలక్ వర్మ 50 బంతుల్లో 64 పరుగులు చేశాడు. అతడితో పాటు రాహుల్ సింగ్ 40 బంతుల్లో 62 రాణించాడు. రోహిత్ రాయుడు (34) కూడా మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మేఘాలయ బౌలర్లలో చెంగ్కం సంగ్మా 3 వికెట్లు తీశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదిన నితేష్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఫైనల్ చేరడంతో హైదరాబాద్, మేఘాలయ రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్‌నకు క్వాలిఫై అయ్యాయి. మరి.. హైదరాబాద్ జట్టు ఎలైట్ గ్రూపులో కప్ కొడుతుందని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: 6 బంతుల్లో 6 సిక్సులు.. టీ20లో కాదు భయ్యా.. టెస్టుల్లో!
HCA Chief has promised a BMW car to every player and 1cr cash to the team if Hyderabad wins the Ranji Trophy in the coming 3 years. (News18). pic.twitter.com/gnfuvUr5Od
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 21, 2024