యువరాజ్ మాత్రమే అన్ని కప్స్ ఎలా గెలిచాడు? ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ!

Yuvraj Singh, WCL 2024: యువ క్రికెటర్‌గా దేశవాళి క్రికెట్‌లో ఉన్న కప్పులు, అంతర్జాతీయ క్రికెట్లో ఉన్న మూడు ఐసీసీ ట్రోఫీలు, ఐపీఎల్‌తో పాటు రిటైర్మెంట్‌ తర్వాత జరిగే కప్పులు కూడా గెలిచాడు యువీ. అతనికే ఇన్ని కప్పులు గెలవడం ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Yuvraj Singh, WCL 2024: యువ క్రికెటర్‌గా దేశవాళి క్రికెట్‌లో ఉన్న కప్పులు, అంతర్జాతీయ క్రికెట్లో ఉన్న మూడు ఐసీసీ ట్రోఫీలు, ఐపీఎల్‌తో పాటు రిటైర్మెంట్‌ తర్వాత జరిగే కప్పులు కూడా గెలిచాడు యువీ. అతనికే ఇన్ని కప్పులు గెలవడం ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ గురించి భారత క్రికెట్‌ అభిమానులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దేశానికి రెండు వరల్డ్‌ కప్‌లు అందించిన హీరో అతను. దాదాపు 28 ఏళ్లుగా టీమిండియా ఎక్కడైతే ఇబ్బంది పడుతుందో అక్కడే అతను నిలబడి.. బలమైన ప్రత్యర్థిని ఓడించి చూపించాడు. 2007 టీ20 వరల్డ్‌ కప్‌, 2011 వన్డే వరల్డ్‌ కప్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడంటేనే అర్థం చేసుకోవచ్చు.. యువీ విజయ ప్రస్థానం ఎలా సాగిందో. ఈ రెండు కప్పులనే కాదు.. దేశవాళి క్రికెట్‌ నుంచి మొదలుపెడితే.. అంతర్జాతీయ క్రికెట్‌, రిటైర్మెంట్‌ తర్వాత ఆటలో కూడా అతను గెలవని కప్పు లేదు. అన్ని ప్రధాన కప్పులను కైవసం చేసుకున్న ఏకైక క్రికెటర​ యువరాజ్‌ సింగ్‌.

ఏకంగా 12 ప్రతిష్టాత్మక కప్పులు గెలిచి.. తన జెర్సీ నంబర్‌ 12ను సార్థకం చేసుకున్నాడు యువీ. ఆ 12లో.. అండర్‌ 19 వరల్డ్‌ కప్‌, టీ20 వరల్డ్‌ కప్‌, వన్డే వరల్డ్‌ కప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ, ఐపీఎల్‌ ట్రోఫీ, దులీప్‌ ట్రోఫీ, ఆసియా కప్‌, ఇరానీ కప్‌, సాల్వే ట్రోఫీ, టీ10 లీగ్‌ ట్రోఫీ, రోడ్‌ సెఫ్టీ ట్రోఫీతో పాటు.. తాజాగా పాకిస్థాన్‌పై ఫైనల్‌ ఆడి వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌(డబ్ల్యూసీఎల్‌) ట్రోఫీని గెలిచాడు. ఇందులో ఆటగాడిగా, కెప్టెన్‌గా గెలిచినవి కూడా ఉన్నాయి. అయితే.. ఒక్క క్రికెటర్‌కి ఇన్ని కప్పులు గెలవడం ఎలా సాధ్యం అవుతోంది అన్న ప్రశ్న.. చాలా మంది క్రికెట్‌ అభిమానుల్లో ఉంది. అలా గెలవడానికి కారణాలు ఏంటంటే..

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇండియాకు ప్రధాన పోటీ ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ జట్లతో ఉంటుంది. ముఖ్యంగా నాకౌట్‌ మ్యాచ్‌ల్లోనే టీమిండియా ఎక్కువ ఇబ్బంది పడేది. ఈ రెండు సమస్యలను యువీ అధిగమించాడు. నాకౌట్‌ మ్యాచ్‌లంటే చాలా అద్భుతంగా ఆడతాడు. అలాగే ఆస్ట్రేలియాతో నాకౌట్‌ మ్యాచ్‌ అంటే అది యువీ డే అనుకోవాలి. 2007 టీ20 వరల్డ్‌ కప్‌, 2011 వన్డే వరల్డ్‌ కప్‌లో అది ప్రూ చేశాడు. అలాగే ఓటమిని ఒప్పుకోని తనం, చివరి వరకు పోరాడే గుణం యువీ సొంతం. ఇది ఎక్కువ ఆస్ట్రేలియా టీమ్‌లో ఉండే లక్షణం. యువీలో అదే కసి కనిపిస్తూ ఉంటుంది.

దాంతో పాటు యువీ అద్భుతమైన టీమ్‌లో భాగం అవుతుంటాడు. గొప్ప టాలెంట్‌తో పాటు మంచి టీమ్‌ సపోర్ట్‌ అతనికి దక్కుతూ ఉంటుంది. అలాగే యువీ ఎక్కడుంటే అక్కడ ఒక పాజిటివ్‌ వైబ్రేషన్‌ ఉంటుంది. తాను విఫలమైనా.. తను ఇచ్చే ఎనర్జీతో మిగతా ఆటగాళ్లు కూడా చెలరేగిపోయి ఆడుతుంటారు. ఇలా అన్ని పాజిటివ్‌ ఎనర్జీలు కలిపి యువరాజ్‌ సింగ్‌ 12 కప్పులు గెలిచేందుకు దోహదం చేశాయి. మరి యువి ఇన్ని కప్పులు గెలవడానికి కారణం ఏంటని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments