iDreamPost
android-app
ios-app

రేపే భారత్‌ వర్సెస్‌ పాక్‌ ఆసియా కప్‌ ఫైనల్‌! లైవ్‌ ఎలా చూడాలంటే?

  • Published Jul 22, 2023 | 3:08 PMUpdated Jul 22, 2023 | 3:08 PM
  • Published Jul 22, 2023 | 3:08 PMUpdated Jul 22, 2023 | 3:08 PM
రేపే భారత్‌ వర్సెస్‌ పాక్‌ ఆసియా కప్‌ ఫైనల్‌! లైవ్‌ ఎలా చూడాలంటే?

ఇండియా-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ఎంతటి క్రేజ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇరుదేశాల క్రికెట్‌ అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ ఫ్యాన్స్‌ సైతం ఆసక్తి చూపిస్తారు. అది క్రికెట్‌ మ్యాచ్‌ అనే కంటే.. ఓ మినీ యుద్ధం అనాలి. భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు అంత డిమాండ్‌ ఉంటుంది. పొరపాటును ఇండియా పాకిస్థాన్‌పై ఓడినా పాకిస్థాన్‌ ఇండియాపై ఓడినా.. ఆయా దేశాల క్రికెట్‌ అభిమానులు అస్సలు జీర్ణించుకోలేరు. ప్రస్తుతం సీనియర్‌ క్రికెటర్ల టీమ్స్‌ కాకుండా.. ఇండియా-ఏ వర్సెస్‌ పాకిస్థాన్‌-ఏ జట్లు తలపడుతున్నాయి.

ఏసీసీ మెన్స్‌ ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ 2023 టోర్నీలో భారత్‌-పాక్‌ జట్లు ఫైనల్‌ చేరాయి. యశ్‌ ధుల్‌ కెప్టెన్సీలోని యంగ్‌ టీమిండియా సెమీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్‌ చేరింది. ఆదివారం జరగనున్న ఫైనల్‌లో భారత్‌-ఏ జట్టు పాకిస్థాన్‌-ఏ టీమ్‌తో తలపడనుంది. అయితే.. ఇప్పటికే లీగ్‌లో ఒక సారి ఇండియా-పాకిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కుర్రాళ్లు దుమ్మురేపారు. పాక్‌ను చిత్తుగా ఓడించాడు.

ఇప్పుడు అదే సీన్‌ను రిపీట్‌ చేసి ఫైనల్లోనూ పాక్‌ను చిత్తు చేయాలని యువ టీమిండియా భావిస్తోంది. అయితే ఈ ఆసక్తికర పోరును వీక్షించేందుకు క్రికెట్‌ అభిమానులు ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారు. ఈ మ్యాచ్‌ లైవ్‌ స్టార్‌ స్పోర్ట్స్‌లో చూడొచ్చు అలాగే మొబైల్‌లో చూడాలంటే.. ఫ్యాన్‌ కోడ్‌ యాప్‌లో సైతం చూడొచ్చు. మరి ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందని మీరు భావిస్తున్నారు? అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీళ్ల కోసమేనా తెలుగు క్రికెటర్లను వద్దన్నారు? సెలెక్టర్లపై ఫ్యాన్స్‌ ఫైర్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి