iDreamPost

వీళ్ల కోసమేనా తెలుగు క్రికెటర్లను వద్దన్నారు? సెలెక్టర్లపై ఫ్యాన్స్‌ ఫైర్‌

  • Author Soma Sekhar Published - 01:38 PM, Sat - 22 July 23
  • Author Soma Sekhar Published - 01:38 PM, Sat - 22 July 23
వీళ్ల కోసమేనా తెలుగు క్రికెటర్లను వద్దన్నారు? సెలెక్టర్లపై ఫ్యాన్స్‌ ఫైర్‌

వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా అదరగొడుతోంది. తొలి టెస్ట్ లో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. రెండో టెస్ట్ లో సైతం అదరగొడుతోంది. ఈ క్రమంలోనే తొలి ఇన్నింగస్ లో 438 పరుగులకు ఆలౌట్ అయ్యింది టీమిండియా. జట్టులో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ రికార్డు శతకంతో మెరిశాడు. అతడికి తోడు రోహిత్ శర్మ(80), జైస్వాల్(57), జడేజా(61), అశ్విన్(56) పరుగులతో రాణించారు. ఇక ఈ టెస్ట్ లో అజింక్య రహానే(8), ఇషాన్ కిషన్(25) మరోసారి తమ పూర్ ఫామ్ ను కొనసాగించారు. దాంతో సెలక్టర్లపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వీరికోసమా తెలుగు క్రికెటర్లు అయిన హనుమ విహారి, కేఎస్ భరత్ లను పక్కకు పెట్టింది అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు.

వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు తెలుగు క్రికెటర్ల అయిన హనుమ విహారి, వికెట్ కీపర్ కేఎస్ భరత్ లను సెలక్టర్లు పక్కన పెట్టారు. వారి స్థానంలో సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే, ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకున్నారు. పూర్ ఫామ్ లో ఉన్నారన్న నెపంతో వారిని ఈ సిరీస్ కు సెలక్ట్ చేయలేదు సెలక్టర్లు. అయితే వారి స్థానంలో టీమ్ లోకి వచ్చిన అజింక్య రహానే, ఇషాన్ కిషన్ లు ఘోరంగా విఫలం అవుతున్నారు. రెండు టెస్టుల్లో కూడా చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయారు ఈ ఇద్దరూ. ఇషాన్ కిషన్ తన తొలి టెస్ట్ లో ఒక్క పరుగు చేయడానికి 19 బంతులు ఎదుర్కొన్నాడు అంటేనే అర్ధం అవుతోంది అతడు ఎంత బాగా ఆడుతున్నాడో.

ఇక సీనియర్ బ్యాటర్ గా, నిలకడైన ఆటగాడిగా ముద్ర పడ్డ అజింక్య రహానే సైతం రెండంకెల స్కోర్ చేయడంలో విఫలం అయ్యాడు. ఇక రెండో టెస్ట్ మ్యాచ్ లో ఇషాన్ కు అద్భుతమైన అవకాశం వచ్చింది. కోహ్లీ ఔట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చాడు ఇషాన్. దాంతో అతడికి మంచి ఇన్నింగ్స్ ఆడటానికి ఛాన్స్ దొరికిందని అందరు అనుకున్నారు. అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అయ్యాడు. కేవలం 25 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దాంతో క్రికెట్ ఫ్యాన్స్ సెలక్టర్లపై ఫైర్ అవుతున్నారు. కేఎస్ భరత్ కు, హనుమ విహారికి ద్రోహం జరుగుతోందని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే భరత్ ర్యాక్ టర్న్ పిచ్ లపై అరంగేట్రం చేశాడని, అలాగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కొన్నాడని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇచ్చిన అవకాశాలే తక్కువ కాబట్టి అతడిని పక్కన పెట్టడం కరెక్ట్ కాదని సోషల్ మీడియా వేదికగా రాసుకొస్తున్నారు. విహారి సైతం అద్భుతమైన ఆటగాడని, అతడికి మరిన్ని అవకాశాలు ఇస్తే.. తన టాలెంట్ ను ఫ్రూ చేసుకుంటాడని వారు చెప్పుకొస్తున్నారు. మరి విహారి, భరత్ లను తీసుకోకుండా రహానే, ఇషాన్ కిషన్ లను జట్టులోకి తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి