SNP
SNP
ఆసియా కప్ 2023లో కీలకమైన మ్యాచ్ ముగిసింది. ఫైనల్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన డూ ఆర్ డై మ్యాచ్‌లో శ్రీలంక జట్టు పాకిస్థాన్‌పై విజయం సాధించి.. ఫైనల్ చేరింది. కీలకమైన ఈ మ్యాచ్‌కు సైతం వర్షం రెండు సార్లు అంతరాయం కలిగించింది. తొలుత మ్యాచ్‌ను 45 ఓవర్లుకు కుదించి ప్రారంభించగా.. మళ్లీ మధ్య వర్షం వచ్చి ఆగడంతో.. 42 ఓవర్లకు కుదించారు. అయితే.. ఈ మ్యాచ్ ముగింపుపై క్రికెట్ అభిమానులు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. రెండు జట్లు సేమ్ స్కోర్లు చేసినా.. శ్రీలంక ఎలా గెలిచిదంటూ డౌట్ పడుతున్నారు. స్కోర్లు ఈక్వల్ అయితే.. సూపర్ ఓవర్ నిర్వహించాలి కానీ, లంక ఎలా గెలుస్తుందంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి స్కోర్లు సమం అయినా లంక ఎలా గెలిచిందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. మ్యాచ్ ఆరంభానికి ముందు వర్షం రావడంతో.. మ్యాచ్‌ను 45 ఓవర్లకు ఆ తర్వాత 42 ఓవర్లకు కుదించారు. పాకిస్థాన్ ఆరంభంలో వికెట్లు కోల్పోయినా.. మహమ్మద్ రిజ్వాన్(82 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్ (47) మంచి ప్రదర్శనతో పాక్‌కు మంచి స్కోర్ అందించారు. రిజ్వాన్, ఇఫ్తికర్ అద్భుతమైన భాగస్వామ్యంతో మొత్తంగా పాకిస్థాన్ 252/7 పరుగుల స్కోరు చేసింది. టార్గెట్‌ను ఛేదించే క్రమంలో శ్రీలంక సైతం ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్లు కుశాల్ పెరీరా (17), పాథుమ్ నిస్సంక (29) పెద్దగా పరుగులు చేయకుండా నిరాశపర్చారు. కుశాల్ మెండిస్(91) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో లంకను విజయం వైపు నడిపించాడు. సదీర్ సమరవిక్రమ(48), చరిత్ అసలంక (49 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ముఖ్యంగా చరిత్ అసలంక జట్టును విజయతీరాలకు చేర్చాడు. 42 ఓవర్లలో శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి సరిగ్గా 252 పరుగులే చేసింది. అయినా మ్యాచ్ గెలిచింది. ఇది ఎలా సాధ్యమైందంటే..?
252 పరుగులు డీఎల్ఎస్(డక్‌వర్త్ లూయిస్) విధానం ద్వారా లంకకు నిర్దేశించిన లక్ష్యం కావడం గమనార్హం. ఈ మ్యాచ్ ఆరంభం వర్షం వల్ల ఆలస్యమైన సంగతి తెలిసిందే. దీంతో మ్యాచ్‌ను 45 ఓవర్లకు కుదించారు. పాకిస్థాన్ బ్యాటింగ్ సమయంలో మరోసారి వర్షం పడింది. ఈ క్రమంలో మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించాల్సి వచ్చింది. దీంతో శ్రీలంక లక్ష్యాన్ని డీఎల్ఎస్ విధానంలో 252గా నిర్దేశించారు. నిజానికి పాక్ స్కోరు కూడా అదే కాబట్టి.. లంక 253 పరుగులు చేయాలి. కానీ డీఎల్ఎస్ విధానం వల్ల 252 రన్స్ చేసినా మ్యాచ్ శ్రీలంక గెలిచింది. ఈ విజయంతో లంక ఆసియా కప్ ఫైనల్ చేరింది. ఆసియా కప్ టోర్నీ చరిత్రలో శ్రీలంక ఏకంగా 11వ సారి ఫైనల్ చేరడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో లంకకు విజయ లక్ష్యం 252 పరుగులు నిర్దేశించినా.. చివరి బాల్‌కు 2 పరుగులు చేయాల్సి ఉండగా.. 3 పరుగులు చేసి విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్ ఫలితం మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆసీస్ సిరీస్ కూడా ఫ్రీగానే! ఎందులో అంటే..?