iDreamPost

క్రికెట్ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్.. ఆసీస్ సిరీస్ కూడా ఫ్రీగానే! ఎందులో అంటే..?

  • Author singhj Published - 03:40 PM, Thu - 14 September 23
  • Author singhj Published - 03:40 PM, Thu - 14 September 23
క్రికెట్ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్.. ఆసీస్ సిరీస్ కూడా ఫ్రీగానే! ఎందులో అంటే..?

ఇప్పుడు అంతా క్రికెట్ ఫీవర్ నడుస్తోంది. వరుసగా ఇంట్రెస్టింగ్ టోర్నమెంట్లు ఉండటంతో అభిమానులు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఆసియా కప్-2023 నుంచి వన్డే వరల్డ్ కప్-2023 వరకు ఎన్నో ఆసక్తికరమైన మ్యాచ్​లు ఉన్నాయి. మధ్యలో భారత జట్టు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కూడా ఆడనుంది. అయితే ఈ రోజుల్లో చాలా మంది మ్యాచ్​లను ఫోన్లలోనే తిలకిస్తున్నారు. స్మార్ట్​ఫోన్ల వినియోగం బాగా పెరడగం, ఓటీటీ యాప్స్​లో క్రికెట్ లైవ్ టెలికాస్ట్ వస్తుండటంతో అందరూ మొబైల్స్​లోనే మ్యాచ్​లు చూస్తున్నారు. అయితే ఓటీటీకి సబ్​స్క్రిప్షన్ లేనిదే మ్యాచ్​లు చూసేందుకు వీలుండదు.

ఓటీటీ సబ్​స్క్రిప్షన్ కోసం అందరూ డబ్బులు చెల్లించలేని పరిస్థితి. దీంతో జియో సినిమా అప్పట్లో క్రికెట్​ ఫ్యాన్స్​కు బంపరాఫర్ ప్రకటించింది. ఐపీఎల్​-2023ని జియో సినిమా యాప్​లో ఫ్రీగా లైవ్ స్ట్రీమింగ్ చేసింది. దీంతో వ్యూస్ రికార్డు స్థాయిలో వచ్చాయి. అలాంటి జియో సినిమా యాప్ క్రికెట్ ఫ్యాన్స్​కు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్ ప్రీమియర్​ లీగ్​ను అందరికీ ఉచితంగా చూపించిన జియో సినిమా.. ఇప్పుడు ఆసియా కప్ అనంతరం జరిగే భారత్-ఆస్ట్రేలియా సిరీస్​ను కూడా ఫ్రీగా చూపించనుందట. రీసెంట్​గా బీసీసీఐ బ్రాడ్​కాస్ట్​ హక్కులను వయాకామ్ 18 సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

వయాకామ్ 18 కంపెనీకి చెందినదే జియో సినిమా యాప్. ఈ నేపథ్యంలో కొత్త సైకిల్​లో భాగంగా ఆసీస్​తో జరిగే సిరీస్​ ఈ కంపెనీకి తొలి కవరేజ్ కానుంది. దీంతో అందరికీ మ్యాచులను ఉచితంగా చూపించాలని జియో సినిమా భావిస్తోందని తెలిసింది. ఈ సిరీస్​ను ఏకంగా 11 భాషల్లో వీక్షించేందుకు అవకాశం కల్పిస్తుందట. ఇంగ్లీష్​, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు మరాఠీ, గుజరాతీ, భోజ్​పురి, పంజాబీ భాషల్లో ఈ మ్యాచ్ కామెంట్రీ ఉంటుందట. దేశంలో స్పోర్ట్స్​ను చూసే ఎక్స్​పీరియెన్స్​ను పూర్తిగా మార్చేయడమే తమ టార్గెట్ అని వయాకామ్ 18 కంపెనీ సీఈవో అనిల్ జయరామ్ తెలిపారు.

ఇదీ చదవండి: పృథ్వీ షాను వెంటాడుతున్న శని!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి