iDreamPost
android-app
ios-app

అతను నా గురించి ద్రవిడ్‌కు పచ్చి అబద్ధాలు చెప్పాడు! నిజం ఏంటంటే..: శాంసన్‌

  • Published May 06, 2024 | 1:33 PM Updated Updated May 06, 2024 | 1:33 PM

Sreesanth, Sanju Samson, Rahul Dravid: టీమిండియా క్రికెటర్‌ సంజు శాంసన్‌ గురించి ఓ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు పచ్చి అబద్ధాలు చెప్పినట్లు స్వయంగా శాంసనే వెల్లడించాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Sreesanth, Sanju Samson, Rahul Dravid: టీమిండియా క్రికెటర్‌ సంజు శాంసన్‌ గురించి ఓ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు పచ్చి అబద్ధాలు చెప్పినట్లు స్వయంగా శాంసనే వెల్లడించాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published May 06, 2024 | 1:33 PMUpdated May 06, 2024 | 1:33 PM
అతను నా గురించి ద్రవిడ్‌కు పచ్చి అబద్ధాలు చెప్పాడు! నిజం ఏంటంటే..: శాంసన్‌

ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌గా ఉన్న సంజు శాంసన్‌ ఫుల్‌ ఖుషీగా ఉన్నాడు. అతని కెప్టెన్సీలోని రాజస్థాన్‌ రాయల్స్‌ టీమ్‌ ఈ సీజన్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్‌ 2గా ఉంది ఆర్‌ఆర్‌ టీమ్‌. దీనికి తోడు.. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం ప్రకటించిన టీమ్‌లో సంజు శాంసన్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. ఇలా రెండు విధాలుగా సంజు సూపర్‌ హ్యాపీగా ఉన్నాడు. అయితే.. ఈ క్రమంలో తన గురించి టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు ఓ క్రికెటర్‌ కావాలనే పచ్చి అబద్ధాలు చెప్పాడని సంజు శాంసన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే.. ఈ విషయం ఇప్పుడి కాదు.. శాంసన్‌ కెరీర్‌ స్టార్టింగ్‌లోది. కానీ, ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఇంతకీ సంజు శాంసన్‌ గురించి రాహుల్‌ ద్రవిడ్‌కు అబద్ధం చెప్పిన క్రికెటర్‌ ఎవరనుకుంటున్నారు. ఇంకెవరూ.. టీమిండియా మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌. ఈ అగ్రెసివ్‌ బౌలర్‌ టీమిండియా తరఫున అలాగే ఐపీఎల్‌లోనూ మంచి ప్రదర్శన కనబర్చాడు. కానీ, ఫిక్సింగ్‌ ఆరోపణలతో క్రికెట్‌కు దూరం అయ్యాడు. అయితే.. శ్రీశాంత్‌ కెరీర్‌ పీక్స్‌లో ఉన్న సమయంలో.. రాహుల్‌ ద్రవిడ్‌తో మాట్లాడుతూ.. సంజు శాంసన్‌ గురించి చెప్పాడు. ఈ కుర్రాడు అద్భుతంగా ఆడుతాడు, కేరళకు చెందిన ప్లేయర్‌, ఓ మ్యాచ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టాడు. మీరు ఒక సారి టెస్ట్‌ చేయండి అంటూ కోరాతాడు. దానికి రాహుల్‌ ద్రవిడ్‌ సైతం పాజిటివ్‌గా రెస్పాండ్‌ అవుతూ.. అవునా.. అయితే ఒకసారి ట్రైయల్‌ కోసం తీసుకుని రండీ అని అంటాడు.

sanju samson sensational comments

ఆ టైమ్‌లో సంజు శాంసన్‌ ఇంకా బచ్చా క్రికెటరే. రాహుల్‌ ద్రవిడ్‌ అప్పుడు రాజస్థాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. సంజును ఐపీఎల్‌లోకి తీసుకోవాలని ద్రవిడ్‌కు శ్రీశాంత్‌ విజ్ఞప్తి చేశాడు. అయితే.. శ్రీశాంత్‌ ద్రవిడ్‌కు చెప్పిన దాంట్లో పచ్చి అబద్ధం ఏంటంటే.. ఆరు బంతులు ఆరు సిక్సులు. అసలు సంజు శాంసన్‌ ఎప్పుడూ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టలేదు. ఆ విషయాన్ని సంజునే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆ వీడియోనే ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే.. శ్రీశాంత్‌ చెప్పిన ఆ అబద్ధమే సంజు శాంసన్‌ జీవితాన్ని మార్చేసింది. ఆ తర్వాత సంజు శాంసన్‌ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వడం, టీమిండియా తరఫున అరంగేట్రం చేయడం.. ఇప్పుడు టీ20 వరల్డ్‌ కప్‌ కోసం ఎంపిక కావడం అంతా ఆ అబద్ధంతోనే జరిగాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.