Henry Hunt: ఊహించని ఘటన! రక్తం కక్కుకుంటూ కుప్పకూలిన క్రికెటర్‌!

క్రికెట్ మ్యాచుల్లో అప్పుడప్పుడూ కొన్ని ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. ఇది కూడా అలాంటిదే. ఓ ప్లేయర్ రక్తం కక్కుకుంటూ కుప్పకూలాడు.

క్రికెట్ మ్యాచుల్లో అప్పుడప్పుడూ కొన్ని ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. ఇది కూడా అలాంటిదే. ఓ ప్లేయర్ రక్తం కక్కుకుంటూ కుప్పకూలాడు.

క్రికెట్​ చూడటానికి సులువైన ఆటలా కనిపిస్తుంది. కానీ అనుకున్నంత ఈజీ కాదు. ప్రొఫెషనల్ లెవల్​లో బ్యాటింగ్, ఫీల్డింగ్ చేయడం చాలా కష్టం. రాకాసి బౌన్సర్లకు ఎంతో మంది బ్యాటర్లు గాయపడ్డారు. ఫిలిప్ హ్యూస్ అనే యంగ్ ఆస్ట్రేలియా బ్యాటర్ ఇలాగే గాయపడి గ్రౌండ్​లోనే ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే. నేటికి 9 ఏళ్లు అయినా ఆ ఘటనను ఎవరూ మర్చిపోలేదు. బ్యాటర్స్​కే కాదు బంతులు అందుకునే ప్రయత్నంలో ఫీల్డర్లు గాయాలపాలైన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. అలాంటిదే ఇది కూడా. ఓ బాల్​ను పట్టే క్రమంలో గాయపడిన ఫీల్డర్ రక్తం కక్కుకుంటూ మైదానంలోనే కుప్పకూలాడు. ఈ ఘటన కూడా ఆస్ట్రేలియానే జరగడం గమనార్హం. మార్ష్​ కప్-2024లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్​లో హెన్రీ హంట్ అనే ఆటగాడు నెత్తురు కక్కుకుంటూ గ్రౌండ్​లో కుప్పకూలాడు.

ఆస్ట్రేలియాలో నిర్వహించే టోర్నీల్లో మంచి పాపులారిటీ తెచ్చుకున్నదిగా మార్ష్​ కప్​ను చెప్పుకోవచ్చు. అయితే ఈసారి టోర్నమెంట్​లో ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. విక్టోరియా, సౌత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో హెన్రీ హంట్ అనే ఫీల్డర్ తీవ్రంగా గాయపడ్డాడు. విక్టోరియా ఇన్నింగ్స్​ 25వ ఓవర్​లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్పిన్నర్ పోప్ బౌలింగ్​లో రోడ్రిగ్స్ (63) కొట్టిన బాల్​ మిడాఫ్​ దిశగా దూసుకెళ్లింది. దీంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్ హంట్ దాన్ని అందుకునేందుకు ప్రయత్నించాడు. కానీ బాల్ అతడి చేతుల్లో నుంచి జారి ముఖానికి గట్టిగా తాకింది. రోజర్స్ వేగంగా కొట్టిన బాల్ దెబ్బకు హంట్ తల్లడిల్లిపోయాడు. ఆ బాల్ బలంగా తాకడంతో అతడి ముక్కులో నుంచి తీవ్రంగా రక్తస్రావం అయింది. దీంతో అతడు అక్కడే కుప్పకూలాడు.

హెన్రీ హంట్ మైదానంలోనే కుప్పకూలడంతో ఫిజియో, సపోర్ట్ స్టాఫ్​ అక్కడికి వెంటనే చేరుకున్నారు. గాయం తీవ్రతరం కావడంతో అతడ్ని డ్రెస్సింగ్ రూమ్​కు తరలించారు. అయితే అతడు ఫీల్డింగ్ చేసిన ప్లేసులో రక్తం కారడంతో గ్రౌండ్ స్టాఫ్​ అక్కడికి వచ్చి క్లీనింగ్ చేశారు. హంట్​కు గాయం, కుప్పకూలిన ఘటనతో అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న సౌత్ ఆస్ట్రేలియా జట్టుతో పాటు ప్రత్యర్థి జట్టు విక్టోరియా క్రికెటర్లు కూడా షాకయ్యారు. అయితే అతడు లేచి డ్రెస్సింగ్ రూమ్​కు నడుచుకుంటూ వెళ్లడంతో ఊపిరి పీల్చుకున్నారు. హంట్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ షాకవుతున్నారు. హంట్ త్వరగా రికవర్ అవ్వాలని.. స్ట్రాంగ్​గా కమ్​బ్యాక్ ఇవ్వాలని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. మార్ష్​ కప్​లో జరిగిన ఊహించని ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Ishan Kishan: టీమిండియాకు దూరమై.. పాండ్యా బ్రదర్స్‌కు దగ్గరైన ఇషాన్‌ కిషన్‌! ఎందుకిలా?

Show comments