iDreamPost
android-app
ios-app

SA20: సన్ రైజర్స్ బ్యాటర్ విధ్వంసం.. 35 బంతుల్లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు!

  • Published Jan 12, 2024 | 4:07 PM Updated Updated Jan 12, 2024 | 4:07 PM

తాజాగా ప్రారంభమైన సౌతాఫ్రికా టీ20 టోర్నమెంట్ లో తుఫాన్ ఇన్నింగ్స్ తో చెలరేగాడు సన్ రైజర్స్ బ్యాటర్. 35 బంతుల్లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. కానీ..

తాజాగా ప్రారంభమైన సౌతాఫ్రికా టీ20 టోర్నమెంట్ లో తుఫాన్ ఇన్నింగ్స్ తో చెలరేగాడు సన్ రైజర్స్ బ్యాటర్. 35 బంతుల్లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. కానీ..

SA20: సన్ రైజర్స్ బ్యాటర్ విధ్వంసం.. 35 బంతుల్లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు!

సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ ప్రస్తుతం తెగ సంతోషంలో మునిగిపోయింది. ఇటీల ముగిసిన వేలంలో పక్కా ప్లాన్ ప్రకారం ఆటగాళ్లను కొనుగోలు చేసింది ఈ బ్యూటి. ఇక ఆమె అనుకున్నట్లుగానే అద్భుతమైన ఆటతో అదరగొడుతున్నారు సన్ రైజర్స్ ఆటగాళ్లు. నిన్న శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ వనిందు హసరంగ 7 వికెట్లతో చెలరేగితే.. నేడు మరో ఆటగాడు బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. తాజాగా ప్రారంభమైన సౌతాఫ్రికా టీ20 టోర్నమెంట్ లో తుఫాన్ ఇన్నింగ్స్ తో చెలరేగాడు సఫారీ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్. ఇటీవలే టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఈ బ్యాటర్ ఈ మ్యాచ్ లో దుమ్మురేపాడు.

SA20 టోర్నీలో భాగంగా గురువారం ముంబై కేప్ టౌన్ వర్సెస్ డర్బన్ సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. భారీ స్కోర్లు నమోదు అయిన ఈ పోరులో డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 11 పరుగులతో ముంబై కేప్ టైన్ విజయం సాధించింది. ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో వికెట్ కీపర్ రికెల్టన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 51 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 87 పరుగులు చేశాడు. అతడికి తోడుగా డస్సెన్ (24), లివింగ్ స్టన్(25) పరుగులు చేయగా.. చివర్లో విండీస్ విధ్వంసకర వీరుడు పొలార్డ్(31) వేగంగా రన్స్ చేశాడు. దీంతో ముంబై టీమ్ భారీ స్కోర్ సాధించింది.

అనంతరం 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన డర్బన్ టీమ్ 11 పరుగుల దూరంలో ఆగిపోయింది. వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో.. డర్బన్ టీమ్ చిత్తుగా ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా చెలరేగాడు హెన్రిచ్ క్లాసెన్. ప్రత్యర్థి బౌలర్లపై యుద్ధాన్ని ప్రకటించి.. ఎడాపెడా బౌండరీలతో బెంబేలెత్తించాడు. కేవలం 35 బంతుల్లోనే 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 85 పరుగులు చేశాడు. కానీ జట్టుకు మాత్రం విజయాన్ని అందించడంలో విఫలం అయ్యాడు. మ్యాచ్ వర్షం అంతరాయం కలిగించడంతో.. క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్ బూడిదలో పోసిన పన్నీరులా అయిపోయింది. సంచలన బ్యాటింగ్ తో జట్టును విజయానికి చేరువగా తీసుకొచ్చినా.. మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో.. ఓటమి తప్పలేదు. మరి థండర్ ఇన్నింగ్స్ తో చెలరేగిన ఈ సన్ రైజర్స్ ప్లేయర్ బ్యాటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.