SNP
Heinrich Klaasen, Rashid Khan: ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ జీటీ మ్యాచ్‌లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ స్టార్ బ్యాటర్ క్లాసెన్ కాకా.. చాలా ఆవేశంగా కనిపించాడు. అంత కోపం ఎందుకొచ్చిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Heinrich Klaasen, Rashid Khan: ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ జీటీ మ్యాచ్‌లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ స్టార్ బ్యాటర్ క్లాసెన్ కాకా.. చాలా ఆవేశంగా కనిపించాడు. అంత కోపం ఎందుకొచ్చిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఎలాంటి విధ్వంస సృష్టిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచి నీళ్లు తాగినంత సులువుగా సిక్సర్లు బాదుతూ.. ప్రత్యర్థి బౌలర్లను భయపెడుతున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే క్లాసెన్ ఊచకోత కోశాడు. కానీ, ఆ వెంటనే గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి పాలైంది. ఐపీఎల్ చరిత్రలోనే అతిభారీ స్కోర్ నమోదు చేసిన జట్టు.. నెక్ట్స్ మ్యాచ్‌లో ఓ సాధారణ టీమ్‌లా ఆడి ఓటమి పాలైంది. ఈ క్రమంలోనే క్లాసెన్ కాకా తీవ్ర కోపంతో ఊగిపోయాడు. తన బ్యాటింగ్‌పై తనకే కోపం వచ్చిందో ఏమో కానీ, బ్యాటన్‌ను పంచ్ చేస్తూ గ్రౌండ్ వీడాడు. అప్పటికే 13 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్సుతో 24 పరుగులు చేసి.. మరో విధ్వంసానికి రెడీ అవుతున్న టైమ్‌లో అవుట్ అవ్వడం క్లాసెన్‌కు నచ్చలేదు. అంతే బ్యాట్‌ను చేత్తో కొడుతూ కోపంగా కనిపించాడు.
ఈ ఘటన ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్‌లో చోటు చేసుకుంది. 74 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన క్లాసెన్.. తనకు అలవాటైన అగ్రెసివ్ ఇంటెంట్‌తోనే ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాడు. 13 బంతుల్లో 24 పరుగులు వద్ద ఆడుతున్న సమయంలో గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్.. అద్భుతమైన బంతితో క్లాసెన్‌ను బౌల్డ్ చేశాడు. అతను వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్ నాలుగో బంతికి క్లాసెన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. భారీ పుల్ షాట్‌కు ప్రయత్నించి.. క్లీన్ బౌల్డ్ అవ్వడంతో క్లాసెన్ కాస్త అసహనానికి గురయ్యాడు. తన బ్యాట్‌ను చేతితో పంచ్ చేస్తూ.. చాలా కోపంగా గ్రౌండ్‌ను బయటికి వెళ్లాడు. అయితే.. క్లాసెన్ చూపిస్తున్న కసి మొత్తం ఎస్‌ఆర్‌హెచ్ కోసమే అవ్వడంతో సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇలాంటి కసే కావాల్సిందంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనప్‌కు ఇది చాలా చిన్న స్కోర్. కానీ, ఎవ్వరూ 30 పరుగులు మార్క్‌ను కూడా అందుకోకపోవడంతో పెద్ద స్కోర్ రాలేదు. అభిషేక్ శర్మ 29, క్లాసెన్ 24, అబ్దుల్ సమద్ 14 బంత్లులో 29 పరుగులతో రాణించడంతో ఆ మాత్రం స్కోర్ దక్కింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 3 వికెట్లతో రాణించాడు. ఇక 163 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది విజయం సాధించింది. సాహా 25, శుబ్‌మన్ గిల్ 36, సాయి సుదర్శన్ 45, డేవిడ్ మిల్లర్ 44 పరుగులతో రాణించారు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో షాబాజ్ అహ్మద్, మయాంక్ మార్కండె, ప్యాట్ కమిన్స్ తలో వికెట్ పడగొట్టారు. మరి ఈ మ్యాచ్‌లో క్లాసెన్ కోపంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
I. C. Y. M. I
A big wicket ✅
A stunning catch ✅Rashid Khan is in the thick of things 👏 👏
Head to @JioCinema & @StarSportsIndia to watch the match LIVE 💻📱
Follow the match ▶️ https://t.co/hdUWPFsHP8 #TATAIPL | #GTvSRH | @gujarat_titans | @rashidkhan_19 pic.twitter.com/YAYQ2bk1hd
— IndianPremierLeague (@IPL) March 31, 2024