Nidhan
Arshdeep Singh, Riyan Parag, Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ-2024లో ఓ ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకుంది. రియాన్ పరాగ్ ఔట్ అయ్యాక అర్ష్‌దీప్ చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతోంది.
Arshdeep Singh, Riyan Parag, Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ-2024లో ఓ ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకుంది. రియాన్ పరాగ్ ఔట్ అయ్యాక అర్ష్‌దీప్ చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతోంది.
Nidhan
టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ గురించి తెలిసిందే. బౌలింగ్ టైమ్‌లో అతడు మిక్స్డ్ ఎమోషన్స్ చూపిస్తుంటాడు. ఒక్కోసారి ఎంత ప్రెజర్ ఉన్నా కూల్‌గా, కామ్‌గా తన పని తాను చేసుకుపోతాడు. కానీ కొన్నిసార్లు మాత్రం కాస్త దూకుడుగా వ్యవహరిస్తాడు. అయితే ప్రత్యర్థుల మీద చూపిస్తే ఓకే గానీ.. ఒకే టీమ్ తరఫున ఆడే ప్లేయర్, అందునా ఏళ్లుగా తెలిసిన వాడు, మంచి ఫ్రెండ్ కూడా అయిన క్రికెటర్‌పై అగ్రెషన్ చూపించడం చర్చనీయాంశంగా మారింది. దులీప్ ట్రోఫీ-2024లో ఇండియా డీ తరఫున బరిలోకి దిగిన అర్ష్‌దీప్ చేసిన ఒక పని ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండియ ఏ బ్యాటర్ రియాన్ పరాగ్‌ను ఔట్ చేశాక ఈ పొడగరి బౌలర్ ఓవరాక్షన్ చేశాడు. అవసరం లేకపోయినా కాస్త అతిగా రియాక్ట్ అయ్యాడు.
పరాగ్‌ను మంచి డెలివరీతో ఔట్ చేశాడు అర్ష్‌దీప్. ఆఫ్ స్టంప్‌కు కాస్త బయట ఊరించే బంతిని వేశాడీ పేసర్. అయితే అప్పటికే ఆ ఓవర్లో ఒక బౌండరీ కొట్టిన పరాగ్.. అదే ఊపులో మరో భారీ షాట్‌కు ప్రయత్నించాడు. ఆఫ్ సైడ్ బిగ్ షాట్ కొడదామని అనుకున్నాడు. కానీ షాట్ సరిగ్గా కనెక్ట్ కాలేదు. అతడి బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి కాస్తా వెళ్లి స్లిప్స్‌లో కాచుకొని ఉన్న దేవ్‌దత్ పడిక్కల్ దగ్గరకు వెళ్లింది. పడిక్కల్ దాన్ని చక్కగా అందుకున్నాడు. దీంతో పరాగ్ నిరాశతో క్రీజును వీడాడు. అయితే అతడు సైలెంట్‌గా వెళ్లిపోతున్న బ్యాటర్ వైపు చూస్తూ అర్ష్‌దీప్ ఓవరాక్షన్ చేశాడు. గుడ్లు ఉరిమేలా చూస్తూ గట్టిగా అరిచాడు. అయినా పరాగ్ పట్టించుకోకుండా పెవిలియన్ వైపు నడక సాగించాడు.
అర్ష్‌దీప్ ఓవరాక్షన్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతమాత్రానికే అంత అతి చేయడం అవసరమా అని నెటిజన్స్ అతడిపై సీరియస్ అవుతున్నారు. టీమిండియాకు కలిసే ఆడతారు కదా.. ఇలాంటి పనులతో ఫ్రెండ్షిప్ దెబ్బతినదా అని ప్రశ్నిస్తున్నారు. అండర్-19లో కూడా కలసి ఆడారు, చాన్నాళ్లుగా ఒకరికొకరు తెలుసు.. అయినా ఏదో వేరే దేశం ప్లేయర్లా బిహేవ్ చేయడం, గట్టిగా అరవడం అవసరమా అని నిలదీస్తున్నారు. సహచర ఆటగాళ్లతో రిలేషన్స్ బాగుంటే కెరీర్‌కు మంచిదని, ఇలాంటి పనుల్ని బీసీసీఐ ఓ కంట కనిపెడుతూ ఉంటుందని, జాగ్రత్తగా ఉండకపోతే కష్టమని అర్ష్‌దీప్‌ను హెచ్చరిస్తున్నారు. ఇక, ఈ ఇన్నింగ్స్‌లో 29 బంతులు ఎదుర్కొన్న పరాగ్.. 5 బౌండరీలు, సిక్స్ సాయంతో 37 పరుగులు చేశాడు. ఉన్నంత సేపు భారీ షాట్లతో ఆకట్టుకున్నాడు. అతడి టీమ్ ఇప్పుడు 7 వికెట్లకు 238 పరుగులతో ఉంది. షమ్స్ ములానీ (62 నాటౌట్) పోరాడుతున్నాడు. మరి.. పరాగ్‌తో అర్ష్‌దీప్ వ్యవహరించిన తీరుపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
— Gill Bill (@bill_gill76078) September 12, 2024