iDreamPost
android-app
ios-app

భారత మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌ని విచారించిన ED.. కేసు పూర్తి వివరాలు!

  • Published Oct 09, 2024 | 3:49 PM Updated Updated Oct 09, 2024 | 3:49 PM

HCA, Mohammad Azharuddin, ED Case: మాజీ క్రికెటర్‌ మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ను ఈడీ విచారించింది. హెచ్‌సీఏలో జరిగిన ఆర్థిక అవకతవలపై విచారణ సాగింది. ఈ కేసు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

HCA, Mohammad Azharuddin, ED Case: మాజీ క్రికెటర్‌ మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ను ఈడీ విచారించింది. హెచ్‌సీఏలో జరిగిన ఆర్థిక అవకతవలపై విచారణ సాగింది. ఈ కేసు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published Oct 09, 2024 | 3:49 PMUpdated Oct 09, 2024 | 3:49 PM
భారత మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌ని విచారించిన ED.. కేసు పూర్తి వివరాలు!

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ.. గతంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా పనిచేసిన టీమిండియా మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ అజహరుద్దీన్‌పై ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ కేసును ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) విచారిస్తోంది. తాజాగా ఈ కేసు విషయమై.. ఈడీ అజహర్‌ను దాదాపు 10 గంటలకు పైగా విచారించింది. విచారణ అనంతరం బయటికి వచ్చిన అజహరుద్దీన్‌ మాట్లాడుతూ.. నాపై తప్పుడు కేసులు పెట్టి, ఇరికించాలని చూస్తున్నారని, వీటి నుంచి నేను నిర్దోషిగా బయటికి వస్తానని చెప్పారు. అసలు ఇంతకీ హెచ్‌సీఏలో ఏం జరిగింది? ఎందుకు ఈడీ అజహరుద్దీన్‌ను ఇ‍న్ని గంటలు విచారించింది? ఈ కేసు గురించి ఇలాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మాజీ క్రికెటర్‌గా, కెప్టెన్‌గా భారత క్రికెట్‌కు ఎంతో సేవ చేసిన మొహమ్మద్‌ అజహరుద్దీన్‌.. ఫిక్సింగ్‌ ఆరోపణలతో నిషేధానికి గురైయ్యారు. ఆ తర్వాత.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎంపీగా కూడా పనిచేశారు. అయితే.. ఆయన హెచ్‌సీఏ ఛైర్మన్‌గా ఉన్న కాలంలో అంటే 2020-2023 మధ్య బోర్డులో అనేక ఆర్థిక అవకతవకలు అంటే.. ఉప్పల్‌ స్టేడియంలో ఫైర్‌ ఎక్విప్‌మెంట్‌, డిజిల్‌ జనరేటర్లు, క్రికెట్‌ బాల్స్‌, జిమ్‌ పరికరాలు ఇలా పలు వస్తువులు కొనుగోలు చేసే క్రమంలో దాదాపు రూ.3.8 కోట్ల వరకు ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిపై ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌కు పలు ఫిర్యాదులు వచ్చాయి. గతేడాది ఈ విషయంపై క్రికెట్‌ వర్గాలతో పాటు, రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేగింది.

ఈ ఆర్థిక అవకతవకల కేసులో ఈడీ రంగంలోకి దిగి.. కొన్ని రోజుల క్రితమే అజహరుద్దీన్‌కు నోటీసులు జారీ చేసింది. ఆయన హెచ్‌సీఏ ఛైర్మన్‌గా ఉన్న సమయంలోనే ఈ ఆర్థిక్‌ అవకతవకలు జరగడంతో.. ఆయనపై మనీల్యాండరింగ్‌ కేసు నమోదు చేసి.. విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో.. మంగళవారం ఆయన ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. 10 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించింది ఈడీ. ఈ విచారణలో అజహరుద్దీన్‌ కాస్త తడబడినట్లు సమాచారం. కానీ, బయటికి వచ్చిన తర్వాత.. ఈ కేసుల్లో నిజం లేదు. నేను నిర్దోషిగా బయటికి వస్తా అంటూ ప్రకటించారు. కాగా, హెచ్‌సీఏలో డబ్బులు మాయం అవుతున్నాయనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే.. అజహరుద్దీన్‌ కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేత కావడం, ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో ఈ కేసు ఎంత వరకు ముందు వెళ్తుందో అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.