iDreamPost
android-app
ios-app

Sania Mirza: ప్రేమించే వ్యక్తి కావాలి.. వైరల్ అవుతున్న సానియా మీర్జా వ్యాఖ్యలు!

  • Published Jun 04, 2024 | 6:25 PM Updated Updated Jun 04, 2024 | 6:25 PM

'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'లో పాల్గొన్న సానియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'లో పాల్గొన్న సానియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jun 04, 2024 | 6:25 PMUpdated Jun 04, 2024 | 6:25 PM
Sania Mirza: ప్రేమించే వ్యక్తి కావాలి.. వైరల్ అవుతున్న సానియా మీర్జా వ్యాఖ్యలు!

భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన ఆటతో అందంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన టెన్నిస్ రారాణి. కానీ ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకున్న ఆమె.. ఎక్కువగా దుబాయ్ లోనే తన కొడుకుతో సమయాన్ని గడుపుతూ ఉంది. ఈ క్రమంలో ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొన్న సానియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సానియా మీర్జా.. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకున్న తర్వాత బయట ఎక్కువగా కనిపించడం లేదు. విడాకుల తర్వాత తన కొడుకు ఇజహాన్ తో కలిసి ఎక్కువగా దుబాయ్ లోనే గడుపుతోంది. ఈ క్రమంలోనే ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో పాల్గొన్న సానియా.. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇక్కడ  షారుఖ్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఓసారి గుర్తుచేసుకుందాం. షారుఖ్ గతంలో ఎన్డీటీవీతో మాట్లాడుతూ..”సానియా మీర్జా బయోపిక్ తీస్తే అద్బుతంగా ఉంటుంది. ఆ సినిమాను నేనే ప్రొడ్యూస్ చేస్తాను కూడా. అదీకాక ఒకవేళ ఆమె ఒప్పుకుంటే ఆమెకు జంటగా కూడా నటిస్తాను” అని చెప్పుకొచ్చాడు షారుఖ్.

కాగా.. ఈ వ్యాఖ్యలను తాజాగా కపిల్ శర్మ తన షోలో ప్రస్తావించాడు. దానికి సానియా మీర్జా సమాధానం ఇస్తూ..”ముందుగా నేను నా ప్రేమను(నన్ను ప్రేమించే వ్యక్తిని)కనుగొనాలి కదా” అంటూ ఆసక్తికర ఆన్సర్ ఇచ్చింది. ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ కావడంతో.. సానియా తన లైఫ్ లో రెండో ప్రేమను ఆహ్వానించేందుకు రెడీగా ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన ఆమె ఫ్యాన్స్ కూడా ఇది నిజమైతే సంతోషమే అని అంటున్నారు. ఇక మరికొందరు ప్రతి స్త్రీకి తమకు నచ్చినట్లు జీవించే హక్కు ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరి సానియా మీర్జా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom