iDreamPost

బంగ్లాదేశ్‌ ఓడినా.. ఈ బౌలర్‌ గట్స్‌కి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే!

  • Published Oct 20, 2023 | 1:52 PMUpdated Oct 20, 2023 | 1:52 PM

టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఓటమి పాలైనా.. ఆ జట్లులోని ఓ బౌలర్‌ను మాత్రం కచ్చితంగా మెచ్చకుని తీరాల్సిందే. ముఖ్యంగా అతని గట్స్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందేనని క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. ఇంతకీ ఎవరా బౌలర్‌? అతను ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఓటమి పాలైనా.. ఆ జట్లులోని ఓ బౌలర్‌ను మాత్రం కచ్చితంగా మెచ్చకుని తీరాల్సిందే. ముఖ్యంగా అతని గట్స్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందేనని క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. ఇంతకీ ఎవరా బౌలర్‌? అతను ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Oct 20, 2023 | 1:52 PMUpdated Oct 20, 2023 | 1:52 PM
బంగ్లాదేశ్‌ ఓడినా.. ఈ బౌలర్‌ గట్స్‌కి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే!

వన్డే వరల​్‌ కప్‌ 2023లో భాగంగా గురువారం పూణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. 257 పరుగుల టార్గెట్‌ను కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రోహిత్‌ శర్మ-గిల్‌.. టీమిండియాకు మంచి స్టార్ట్‌ అందించారు. గిల్‌(53) హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా.. రోహిత్‌ శర్మ 48 రన్స్‌ చేసి అవుట్‌ అయ్యాడు. ఇక రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ ఏకంగా సెంచరీతో చెలరేగి.. మరోసారి ఛేజ్‌ మాస్టర్‌ అనిపించుకున్నాడు. మ్యాచ్‌ చివరి వరకు క్రీజ్‌లో నిలబడి.. టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఓటమి పాలైనా.. ఆ జట్లులోని ఓ బౌలర్‌ను మాత్రం కచ్చితంగా మెచ్చకుని తీరాల్సిందే. ముఖ్యంగా అతని గట్స్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందేనని క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. ఇంతకీ ఎవరా బౌలర్‌? అతను ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

హసన్‌ మహముద్‌.. బంగ్లాదేశ్‌ స్పీడ్‌ బౌలర్‌. 24 ఏళ్ల ఈ కుర్రాడు ఇప్పటి వరకు కేవలం 19 వన్డేలు, 17 టీ20లు మాత్రమే ఆడాడు. కానీ, ఇతనికి ఉన్న ధైర్యం మాత్రం.. వంద మ్యాచ్‌లు ఆడేసిన బౌలర్‌కు ఉన్నంత ఉంది. అయితే.. ఈ కుర్రాడు అంత డేంజర్‌గా మారేందుకు కారణం కూడా ఉంది. టీమిండియాపై మ్యాచ్‌ ఓడిపోయినా.. ఈ బంగ్లా బౌలర్‌పై ఇంతలా ప్రశంసలు కురవడానికి ఓ వ్యక్తి కారణం. అతనే బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ కోచ్‌ అలన్ డోనాల్డ్. సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ అయిన అలన్‌ డోనాల్డ్‌ గురించి ఇప్పటి తరం క్రికెట్‌ అభిమానులకు తెలియకపోవచ్చు. కానీ, పాతతరం క్రికెట్‌ ఫ్యాన్స్‌ అతనో బౌలింగ్‌ గన్‌.

చాలా మందికి సౌతాఫ్రికా స్పీడ్‌ గన్‌ డెల్‌ స్టెయిన్‌ గురించి తెలిసే ఉంటుంది. నిప్పులు చిమ్మే బంతులతో బౌలర్లను గడగడలాడించే బౌలర్‌. అలాంటి స్టెయిన్‌కే గురువు లాంటి వాడు అలెన్‌ డోనాల్డ్‌. ప్రపంచంలోనే గొప్ప గొప్ప బ్యాటర్లను తన స్పీడ్‌ అండ్‌ బౌన్సర్లతో వణికించేవాడు డోనాల్డ్‌. ఒక్క సచిన్‌ తప్ప.. మిగతా బ్యాటర్లందరికీ అతనో నైట్‌మేర్‌ బౌలర్‌. అలాంటి వ్యక్తి బౌలింగ్‌ కోచ్‌గా ఉండటం బంగ్లాదేశ్‌ అదృష్టమనే చెప్పాలి. అతని కోచింగ్‌లోనే బంగ్లాదేశ్‌ టీమ్‌లోని యువ బౌలర్లు సైతం.. ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మనే భయపెట్టేలా.. అతని ఈగోని టచ్‌ చేసేలా బౌలింగ్‌ చేస్తున్నారు. తాజాగా ఇండియా-బంగ్లాదేశ్‌ మధ్య గురువారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లా బౌలర్‌ హసన్‌ మహముద్‌.. రోహిత్‌ శర్మ బలంపైనే కొట్టాడు. రోహిత్‌ ఈగోని హర్ట్‌ చేసి.. సక్సెస్ అయ్యాడు.

రోహిత్‌ శర్మకు షార్ట్‌ పిచ్‌ బాల్స్‌ వేయకూడదనే విషయం ప్రపంచంలోని అన్ని క్రికెట్‌ టీమ్స్‌కు బండగుర్తు. అదో అన్‌ అఫీషియల్‌ రూల్‌ అనుకోవాలి. ఎందుకంటే.. రోహిత్‌ ఫామ్‌లో ఉన్నా లేకపోయినా.. షార్ట్‌ పిచ్‌ బాల్‌ వేస్తే.. అది సిక్స్‌కు వెళ్తుంది. షార్ట్‌ పిచ్‌ బాల్స్‌ను పుల్‌షాట్‌ ఆడి సిక్స్‌ కొట్టడం.. రోహిత్‌ శర్మకు వెన్నెతో పెట్టిన విద్య. నిద్రలో లేపి షార్ట్‌ పిచ్‌ బాల్‌ను పుల్‌షాట్‌ కొట్టమన్నా కొడతాడు రోహిత్‌. అలాంటి బ్యాటర్‌కు హసన్‌.. పదే పదే బౌన్సర్లు, షాట్‌ పిచ్‌ బాల్స్‌ వేస్తూ.. పులి నోటికి జింకను అందించినట్లు అందిచాడు. అంతా ఎందుకు హసన్‌ అలా చేస్తున్నాడు అని షాక్‌ అయ్యారు. హసన్‌ బౌలింగ్‌లో అప్పటికే రోహిత్‌ అద్భుతమైన పుల్‌ షాట్లతో ఫోర్లు, సిక్సులు బాదాడు అయినా కూడా హసన్‌ అదే ఫార్ములా కొనసాగించాడు. పాపం కొత్త కుర్రాడికి రోహిత్‌ గురించి తెలియదా? అనే మాటలు కూడా వినిపించాయి.

కానీ, దాని వెనుక వాళ్ల బౌలింగ్‌ కోచ్‌ అలెన్‌ డోనాల్డ్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఉన్న విషయం చాలా మందికి తెలియదు. అదే పనిగా రోహిత్‌ శర్మ షోల్డర్‌ను టార్గెట్‌గా చేసుకుని.. షార్ట్‌ పిచ్‌ బాల్స్‌, బౌన్సర్లు వేస్తున్న హసన్‌.. ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో ఫలితం రాబట్టాడు. ఆ ఓవర్‌లో మూడో బాల్‌ను హసన్‌ షార్ట్‌ పిచ్‌ బాల్‌ వేశాడు రోహిత్‌ సిక్స్‌ బాదాడు. అయినా భయపడకుండా నాలుగో బాల్‌ కూడా షార్ట్‌ పిచ్‌ బాల్‌ వేశాడు.. మళ్లీ రోహిత్‌ పుల్‌ షాట్‌ ఆడాడు కానీ, ఈ సారి అవుట్‌. రోహిత్‌ బలాన్నే టార్గెట్‌ చేసి దాన్ని బలహీతనగా మార్చి బంగ్లా బౌలర్‌ హసన్‌.. డేంజర్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ వికెట్‌ సాధించాడు. మరి రోహిత్‌ శర్మకు ఎంతో ఇష్టమైన షార్ట్‌ పిచ్‌ బంతులను వేస్తూ.. ధైర్యంగా వికెట్‌ సాధించిన హసన్‌ను ఎంత మెచ్చుకున్న తక్కువే అంటున్నారు క్రికెట్‌ అభిమానులు మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

ఇదీ చదవండి: రోహిత్ శర్మ క్రేజీ రికార్డు.. పాకిస్థాన్ పరువు తీసేశాడుగా!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి