క్రికెట్ గ్రౌండ్ లో సై అంటే సై అనే సంఘటనలే కాదు.. కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలు సైతం జరుగుతూ ఉంటాయి. చిత్ర విచిత్రమైన ఔట్ లు, ఫన్నీ మూమెంట్స్ లకు, గొడవలకు క్రికెట్ లో కొదవలేదు. కానీ క్రికెట్ గ్రౌండ్ లో ఈత కొట్టడం మీరెప్పుడైనా చూశారా? బహుశా క్రికెట్ చరిత్రలో మీరు ఇలాంటి ఫన్నీ మూమెంట్ ను చూసి ఉండరు. ఈ సరదా సన్నివేశం శ్రీలంక-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో చోటు చేసుకుంది. పాకిస్థాన్ ఆటగాడు చేసిన ఈ పని చూస్తే.. మీరు నవ్వకుండా ఉండలేరు.
ప్రస్తుతం పాక్ టీమ్ శ్రీలంకలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా.. తొలి టెస్ట్ నెగ్గిన పాక్.. రెండో టెస్ట్ లో కూడా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంకను కేవలం 166 పరుగులకే కుప్పకూల్చిన పాక్.. భారీ ఆధిక్యం దిశంగా దూసుకెళ్తోంది. పాక్ ప్రస్తుతం 4 వికెట్లు కోల్పోయి 373 పరుగులు చేసింది. దాంతో 211 పరుగుల ఆధిక్యం సంపాదించింది. మూడో రోజు ఆటను వరుణుడు అడ్డుకోవడంతో.. మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపనుంది. రెండో రోజు కూడా వరుణుడు మ్యాచ్ కు అంతరాయం కలిగించాడు. దాంతో రెండో రోజు కొద్దిసేపు ఆట మాత్రమే సాగింది.
ఇదంతా కొద్దిసేపు పక్కన పెడితే.. వర్షం పడిన సమయంలో గ్రౌండ్ మెుత్తాన్ని కవర్లతో కప్పి ఉంచారు సిబ్బంది. ఈ సమయంలో పాక్ క్రికెటర్ హసన్ అలీ చేసిన పని అందరికి నవ్వు తెప్పించింది. గ్రౌండ్ లో ఉన్న కవర్ పై నీళ్లపై హసన్ అలీ పరిగెత్తుకెళ్లి జారాడు. ఆ నీటిలో ఈత కొడుతూ.. ఎంజాయ్ చేశాడు పాక్ ఆటగాడు. గ్రౌండ్ మెుత్తం అలాగే కలియతిరుగుతూ.. వర్షాన్ని ఆస్వాదించాడు. ఇక అలీ పిల్ల చేష్టలు చూసిన పాక్ ఆటగాళ్లు తెగ నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి.
Making the most of the rain delay in Colombo, with @RealHa55an leading the charge 🏊♀️😅#SLvPAK pic.twitter.com/Xi3w8lDrZp
— Pakistan Cricket (@TheRealPCB) July 25, 2023
ఇదికూడా చదవండి: వీడియో: సిక్స్ కొట్టాడు.. అదే బంతికి ఔట్ అయ్యాడు! ఎలాగో తెలుసా?