Nidhan
Duleep Trophy 2024, Harshit Rana, IND D vs IND C: దులీప్ ట్రోఫీ-2024లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తప్పక రాణిస్తారనుకున్న స్టార్లు విఫలమవుతుండగా.. అనూహ్యంగా కొత్త కుర్రాళ్లు అదరగొడుతున్నారు.
Duleep Trophy 2024, Harshit Rana, IND D vs IND C: దులీప్ ట్రోఫీ-2024లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తప్పక రాణిస్తారనుకున్న స్టార్లు విఫలమవుతుండగా.. అనూహ్యంగా కొత్త కుర్రాళ్లు అదరగొడుతున్నారు.
Nidhan
దులీప్ ట్రోఫీ-2024లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తప్పక రాణిస్తారనుకున్న స్టార్లు విఫలమవుతుండగా.. అనూహ్యంగా కొత్త కుర్రాళ్లు అదరగొడుతున్నారు. టోర్నమెంట్ స్టార్టింగ్ డేనే సంచలన ప్రదర్శనలు నమోదవుతున్నాయి. కొందరు యంగ్‌స్టర్స్ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్నారు. యువ పేసర్ హర్షిత్ రానా కూడా సత్తా చాటాడు. ఇండియా సీతో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఐపీఎల్ సెన్సేషనల్ క్వాలిటీ పేస్ బౌలింగ్‌తో నిప్పులు చెరిగాడు. ప్రత్యర్థి ఆటగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. వేగానికి వేగం, మంచి లైన్ అండ్ లెంగ్త్, వేరియేషన్స్ కూడా జోడించడంతో అతడ్ని ఎదుర్కోవడానికి బ్యాటర్లు వణికిపోయారు. స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (5)తో పాటు టాలెంటెడ్ బ్యాటర్ సాయి సుదర్శన్(7)ను తక్కువ స్కోర్లకే అతడు పెవిలియన్‌కు పంపించాడు.
కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వచ్చిన హర్షిత్ రానా ఐదో ఓవర్లోనే ఇండియా డీకి బ్రేక్ త్రూ అందించాడు. మంచి బాల్‌తో ఇండియా సీ ఓపెనర్ సాయి సుదర్శన్‌ను ఔట్ చేశాడు. అతడి బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు సుదర్శన్. ఆ మరుసటి ఓవర్లో మరో వికెట్ తీశాడు హర్షిత్ రానా. ఈసారి ఇండియా సీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పని పట్టాడతను. అతడి బౌలింగ్‌లో అధర్వ టైడేకు క్యాచ్ ఇచ్చి క్రీజును వీడాడు రుతురాజ్. వరుసగా రెండు ఓవర్లలో రెండు కీలక వికెట్లు తీసి ఇంగ్లండ్ సీని చావుదెబ్బ తీశాడు. లైన్ అండ్ లెంగ్త్‌ను పట్టుకొని బౌలింగ్ వేస్తూ పోయిన హర్షిత్ రానా.. బ్యాటర్లకు రూమ్ ఇవ్వకుండా, బిగ్ షాట్స్ ఆడకుండా కంట్రోల్ చేశాడు. మధ్యలో ఊరించే బంతులు వేస్తూ కవ్వించాడు. అతడి వలలో రుతురాజ్, సాయి సుదర్శన్ చిక్కారు. అతడి బౌలింగ్ చూసిన నెటిజన్స్.. త్వరలో భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం పక్కా అని అంటున్నారు.
ఇక, ఓపెనర్లు తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో ఇండియా సీ కష్టాల్లో పడింది. దీంతో తర్వాతి బ్యాటర్లు రాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ విధ్వంసక ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లోనూ అదరగొట్టాడు. బాల్ చేతికి తీసుకొని వన్ డౌన్లో వచ్చిన ఆర్యన్ జుయల్ (5)తో పాటు సెకండ్ డౌన్లో దిగిన స్టార్ ప్లేయర్ రజత్ పాటిదార్ (13)ను ఔట్ చేశాడు బాపూ. ఆర్యన్‌ను కాట్ అండ్ బౌల్డ్‌గా వెనక్కి పంపించిన అక్షర్.. రజత్‌ను చక్కటి బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం బాబా అపరాజిత్ (8 నాటౌట్), అభిషేక్ పోరెల్ (12 నాటౌట్) క్రీజులో ఉన్నారు. పస మీద ఉన్న హర్షిత్ రానా, అక్షర్ పటేల్‌ను తట్టుకొని వీళ్లు క్రీజులో నిలబడితే ఇండియా సీ మంచి స్కోరు సాధించగలదు. ప్రత్యర్థి జట్టులో మరో స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా ఉన్నాడు. కాబట్టి ఇండియా సీ బిగ్ స్కోరు చేయడం కష్టంగానే ఉంది. పిచ్ కూడా బౌలింగ్‌కు సహకరిస్తుండటంతో ఆ టీమ్ ఏం చేస్తుందో చూడాలి. మరి.. హర్షిత్ రానా త్వరలో టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
HARSHIT RANA ON FIRE. 🔥
– Harshit gets Ruturaj & Sudharsan in the space of 5 balls, What a spell. pic.twitter.com/divvWv1fca
— Johns. (@CricCrazyJohns) September 5, 2024