వరల్డ్ వైడ్ గా ఎన్నో క్రికెట్ టోర్నీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ది హండ్రెడ్ లీగ్, యూఎస్ మాస్టర్ లీగ్, కరేబియన్ లీగులతో పాటుగా మరెన్నో లీగ్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇక ఈ లీగుల్లో రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాటర్లతో పాటుగా.. ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లు రెచ్చిపోతున్నారు. సిక్సర్లు, ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా సన్ రైజర్స్ ఆటగాడు అయిన ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సంచలన సెంచరీతో ది హడ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ లీగ్ లో దుమ్మురేపాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అయితే అతడి అజేయ శతకం జట్టును మాత్రం గెలిపించలేకపోయింది.
ది హండ్రెడ్ లీగ్ లో భాగంగా.. నార్తెర్న్ సూపర్ ఛార్జర్స్ వర్సెస్ వేల్స్ ఫైర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో వేల్స్ ఫైర్ టీమ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ ఛార్జర్స్ టీమ్ 100 బంతుల్లో 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. జట్టులో విధ్వంసకర ఆటగాడు హ్యారి బ్యూక్ అజేయ సెంచరీతో చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో కేవలం 41 బంతుల్లోనే శతకం బాది ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ లో 42 బంతులు ఎదుర్కొన్న బ్రూక్ 11 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో ఏ ఒక్కరూ కూడా రాణించలేదు.
కాగా.. ఐపీఎల్ వేలంలో రూ. 13 కోట్ల భారీ ధరకు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్రూక్ ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్ లో అతడు ఓ సెంచరీని కూడా నమోదు చేశాడు. కానీ టోర్నీ మెుత్తం రాణించలేకపోయాడు. ఇక ప్రత్యర్థి జట్టు అయిన వేల్స్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 10 బంతులు ఉండగానే విజయం సాధించింది. జట్టులో స్టీఫెన్ ఎస్కినాజీ (58), బెయిర్ స్టో (44), జో క్లార్క్ (42*) పరుగులతో జట్టును గెలిపించారు. భారీ శతకం చేసినప్పటికీ తన జట్టును గెలిపించుకోలేకపోయాడు బ్రూక్. కాగా.. టెస్ట్ ల్లో, పాకిస్థాన్ లీగ్ లో, ఐపీఎల్ లో ఇప్పుడు హండ్రెడ్ లీగ్ లో సెంచరీ బాదిన ఆటగాడిగా ఘనతకెక్కాడు బ్రూక్. వరల్డ్ కప్ ముంగిట డిఫెండింగ్ ఛాంపియన్ కు తురుపుముక్కలా మారాడు హ్యారీ బ్రూక్.
Harry Brook smashed a sublime 💯 for the Northern Superchargers against Welsh Fire in The Hundred 2023 🔥
However, it wasn’t enough as Welsh Fire chased down 159 with 8 wickets in hand.#CricketTwitter pic.twitter.com/XM9hyWQj2m
— Sportskeeda (@Sportskeeda) August 23, 2023
ఇదికూడా చదవండి: Video: పాకిస్థాన్ ఫీల్డింగ్‌లో ఇంత మార్పా? నమ్మశక్యం కానీ క్యాచ్ అందుకున్న ఫీల్డర్!