iDreamPost

IND vs PAK: రిజర్వ్‌ డేలో బరిలోకి దిగని హరీస్‌ రౌఫ్‌! కారణమేంటి?

  • Published Sep 11, 2023 | 5:55 PMUpdated Sep 11, 2023 | 5:55 PM
  • Published Sep 11, 2023 | 5:55 PMUpdated Sep 11, 2023 | 5:55 PM
IND vs PAK: రిజర్వ్‌ డేలో బరిలోకి దిగని హరీస్‌ రౌఫ్‌! కారణమేంటి?

ఆసియా కప్‌ 2023లో భాగంగా భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ రిజర్వ్‌ డేలో జరుగుతుంది. ఆదివారం జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. కీలకమైన సూపర్‌ 4 మ్యాచ్‌ కావడంతో రిజర్వ్‌ డే కేటాయించారు. దీంతో ఇవాళ మ్యాచ్‌ కాస్త ఆలస్యంగా ఆరంభం అయింది. ఆదివారం 24.1 ఓవర్లు ఆడి 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి టీమిండియా.. ఈ రోజు అక్కడి నుంచే మ్యాచ్‌ను మొదలుపెట్టింది.

అయితే.. పాకిస్థాన్‌ జట్టు ఒక మార్పుతో రిజర్వ్‌ డేలో బరిలోకి దిగింది. పాకిస్థాన్‌ స్టార్‌ బౌలర్‌ హరీస్‌ రౌఫ్‌ ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. ఆదివారం ఓ ఐదు ఓవర్లు బౌలింగ్‌ వేసిన రౌఫ్‌.. ఈ రోజు మాత్రం గ్రౌండ్‌లోకి అడుగుపెట్టలేదు. టీమిండియా అద్భుత బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో రౌఫ్‌ లాంటి వికెట్‌ టేకింగ్‌ బౌలర్‌ను పాక్‌ ఎందుకు ఆడించడం లేదని క్రికెట్‌ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు రౌఫ్‌ ఎందుకని మ్యాచ్‌లో లేడు అంటూ సోషల్‌ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

అయితే.. గాయం కారణంగా రౌఫ్‌ ఈ మ్యాచ్‌తో పాటు ఆసియా కప్‌లో మిగిలిన మ్యాచ్‌లకు సైతం రౌఫ్‌ దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ప్రారంభం కానున్న నేపథ్యంలో రౌఫ్‌కు రెస్ట్‌ ఇచ్చినట్లు తెలుస్తుంది. పక్కటెముకల కండరాలు పట్టేసినట్లు తెలుస్తోంది. మరి రౌఫ్‌ వేయాల్సిన మిగిలిన 5 ఓవర్లు ఏ బౌలర్‌ వేస్తాడో చూడాలి. రౌఫ్‌ కోటాను పార్టటైమ్‌ బౌలర్లతో పూర్తిచేయాల్సి వస్తే.. అది టీమిండియాకు ప్లస్‌ పాయింట్‌గానే మారనుంది. మరి రౌఫ్‌ ఆసియా కప్‌కు దూరం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: సాంట్నర్ స్టన్నింగ్ క్యాచ్.. అమాంతం గాల్లోకి ఎగిరి..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి