అభిమానితో గొడవ.. అసలేం జరిగిందో చెప్పిన పాక్‌ క్రికెటర్‌!

Haris Rauf, Viral Video: పాకిస్థాన్‌ క్రికెటర్‌ హరీస్‌ రౌఫ్‌ ఓ అభిమానితో గొడవకు దిగిన వీడియా వైరల్‌ అయింది. అసలు ఆ గొడవకు కారణం ఏంటో తాజాగా రౌఫ్‌ వివరించాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Haris Rauf, Viral Video: పాకిస్థాన్‌ క్రికెటర్‌ హరీస్‌ రౌఫ్‌ ఓ అభిమానితో గొడవకు దిగిన వీడియా వైరల్‌ అయింది. అసలు ఆ గొడవకు కారణం ఏంటో తాజాగా రౌఫ్‌ వివరించాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పాకిస్థాన్‌ స్టార్‌ బౌలర్‌ హరీస్‌ రౌఫ్‌ తాజాగా ఓ అభిమానిని కొట్టేందుకు అతనిపైకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఆ గొడవకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది. ఒక అంతర్జాతీయ క్రికెటర్‌ అయి ఉండి.. అభిమాని పైకి అలా గొడవకు వెళ్తావా అంటూ కొంతమంది రౌఫ్‌పై విమర్శలు గుప్పించారు. అసలు ఆ అభిమాని, రౌఫ్‌ మధ్య ఏం గొడవ జరిగిందో కూడా ఎవరికీ స్పష్టమైన క్లారిటీ లేదు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో పాకిస్థాన్‌ గ్రూప్‌ స్టేజ్‌లోనే ఇంటి బాట పట్టడంతో పాక్‌ క్రికెట్‌ అభిమానులు కోపంగా ఉన్నారు.

ఈ క్రమంలోనే అమెరికాలో హరీస్‌ రౌఫ్‌ ఓ అమ్మాయితో వీధిలో వెళ్తున్న సమయంలో ఓ పాకిస్థాన్‌ అభిమాని వారిని ఏదో అన్నాడు. దాంతో హరీస్‌ రౌఫ్‌ అతనిపైకి వేగంగా ఉరికాడు. అక్కడే ఉన్న మరికొంత మంది రౌఫ్‌ను అడ్డుకున్నారు. లేదంటే రౌఫ్‌ అతనిపై చేయి చేసుకునేలా కనిపించాడు. రౌఫ్‌కు అంత కోపం వచ్చేలా ఆ అభిమాని ఏమన్నాడో అని కూడా నెటిజన్లు కామెంట్‌ చేశారు. అయితే.. ఈ ఘటనపై తాజాగా హరీస్‌ రౌఫ్‌ సోషల్‌ మీడియా వేదికగా రియాక్ట్‌ అయ్యాడు.

‘ఈ విషయంపై స్పందించాలని అనుకోలేదు. కానీ, ఘటనకు సంబంధించిన వీడియో బయటికి రావడంతో అసలు ఏం జరిగిందో చెప్పాలని అనుకున్నాను. పబ్లిక్‌ ఫిగర్‌గా ఉన్న తాము.. పబ్లిక్‌ నుంచి ఎలాంటి ఫీడ్‌బ్యాక్‌ అయినా స్వీకరిస్తాము. అలాగే వాళ్ల సపోర్ట్‌తో పాటు విమర్శలు కూడా తీసుకుంటాం. కానీ, తల్లిదండ్రులు, కుటుంబం జోలికి వస్తే మాత్రం.. వాళ్లు ఎలా రియాక్ట్‌ అయ్యారో అలాగే రియాక్ట్‌ అవ్వడానికి మాత్రం పెద్ద ఆలోచించను. ఎవరు ఏ రంగంలో ఉన్నా.. కనీసం మనుషులుగా వారికి ఇవ్వాల్సిన గౌరవం వారికి, వారి కుటుంబాలకు ఇవ్వడం ముఖ్యం’ అని రౌఫ్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పేర్కొన్నాడు. జట్టు ప్రదర్శన బాగా లేకుంటే అభిమానుల్లో కోపం ఉండటం సహజం కానీ, హద్దు మీరి తల్లిదండ్రులను తిడితే సరికాదని నెటిజన్లు హరీస్‌ రౌఫ్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments