SNP
పాకిస్థాన్-ఆస్ట్రేలియా మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఓ ఆసక్తి కర రికార్డు నమోదైంది. పాకిస్థాన్ బౌలర్ హరీస్ రౌఫ్ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
పాకిస్థాన్-ఆస్ట్రేలియా మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఓ ఆసక్తి కర రికార్డు నమోదైంది. పాకిస్థాన్ బౌలర్ హరీస్ రౌఫ్ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ఈ వన్డే వరల్డ్ కప్‌లో తొలి సారి ఆస్ట్రేలియా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో దుమ్మురేపింది. బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ జట్టు.. ఈ మెగా టోర్నీలో తొలి సారి ఐదు సార్లు ఛాంఫియన్ టీమ్ ఎలా ఆడాలో అలా ఆడిందని చెప్పాలి. ఎందుకంటే వాళ్లి బ్యాటింగ్ విధ్వంసం అలా సాగింది. చివర్లో పాక్ బౌలర్లు ఆసీస్‌ను కాస్త నియంత్రించినా.. ఆరంభంలో ఆసీస్ ఓపెనర్లు ఆడిన తీరు చూస్తూ.. పాపం పాకిస్థాన్ అనాల్సిందే. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ అయితే.. పాక్ బౌలర్లపై విలయ తాండవం చేశాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిస్తూ.. సంచలన ఇన్నింగ్స్‌తో చాలా కాలం తర్వాత తన సత్తా ఏంటో చాటి చెప్పాడు. కేవలం 124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్సులతో 163 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
వార్నర్ ఆడిన వేగానికి ఈజీగా డబుల్ సెంచరీ చేస్తాడని అనిపించింది కానీ, భారీ షాట్ ఆడే క్రమంలో అవుట్ అయ్యాడు. అలాగే మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ సైతం సూపర్ బ్యాటింగ్‌తో తిరిగి తన ఫామ్‌ను అందుకున్నాడు. కేవలం 108 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సులతో 121 పరుగులు చేసి అదరగొట్టారు. వీరిద్దరు తొలి వికెట్‌కు ఏకంగా 259 పరుగులు భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. మార్ష్ అవుటైన తర్వాత ఆసీస్‌కు వెంటనే మరో షాక్ తగిలింది. భారీ స్కోర్ కోసం బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా వచ్చిన మ్యాక్స్‌వెల్ గోల్డెన్ డక్ రూపంలో అవుటై.. నిరాశపర్చాడు. ఆ తర్వాత వెంటవెంటనే ఆసీస్ వికెట్లు కోల్పోయి.. 400 మార్క్‌ను అయితే చేరుకోలేకపోయింది.
కాగా, అప్పటికే పాకిస్థాన్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్ హరీస్ రౌఫ్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. పాకిస్థాన్ టీమ్‌లోనే అత్యంత వేగంగా బౌలింగ్ వేసే.. మేటి బౌలర్‌గా, వికెట్ టేకింగ్ బౌలర్‌గా హరీస్ రౌఫ్‌కు మంచి పేరుంది. కానీ, అతన్నే ఆసీస్ ఓపెనర్లు టార్గెట్ చేసి మరీ కొట్టారు. తొలి మూడో ఓవర్లోనే రౌఫ్ ఏకంగా 47 పరుగులు సమర్పించుకున్నాడు. నాలుగు ఓవర్లు పూర్తి అయ్యేసరికీ ఏకంగా 59 రన్స్ ఇచ్చాడు. దీంతో.. కేవలం 21 బంతుల్లోనే 50 పరుగులు సమర్పించుకుని.. అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మొత్తం మీద ఈ మ్యాచ్‌లో 8 ఓవర్లు వేసిన రౌఫ్ 83 పరుగులు సమర్పించుకున్నాడు. 10.40 ఎకానమీ నమోదు చేశాడు. తన తొలి ఓవర్‌లోనే రౌఫ్ ఏకంగా 24 పరుగులు సమర్పించుకోవాడం గమనార్హం. అలాగే రౌఫ్ వన్డే కెరీర్‌లో ఇదే అత్యంత చెత్త ప్రదర్శన.
అయితే.. వార్నర్‌ను అవుట్ చేయడంతో పాటు మరో రెండు వికెట్లు తీసుకొని.. మూడు వికెట్లతో తన బ్యాడ్ రికార్డును కాస్త కప్పిపుచ్చుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగుల భారీ స్కోర్ చేసింది. మరి ఈ టార్గెట్‌ను పాకిస్థాన్ ఛేజ్ చేస్తుందో లేదో చూడాలి. ఒక వేళ ఈ టార్గెట్‌న్ పాకిస్థాన్ ఛేదిస్తే.. వరల్డ్ కప్ హిస్టరీలో ఇదే వారి అత్యధిక ఛేజింగ్ స్కోర్ అవుతుంది. ఇదే వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్థాన్, శ్రీలంకపై 345 పరుగుల టార్గెట్‌ను ఛేదించి గెలిచిన విషయం తెలిసిందే. మరి ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటింగ్‌తో పాటు.. హరీస్ రౌఫ్ భారీగా పరుగులు సమర్పించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
An excellent comeback from Haris Rauf after a rough start to his spell.
He dismissed David Warner, Josh Inglis and Marnus Labuschagne.#CWC23 | #AUSvPAK | #IsBaarUsPaar pic.twitter.com/WDq8JYusbP
— Grassroots Cricket (@grassrootscric) October 20, 2023
Haris Rauf belted for 0/47 in just 3 overs.
Crazy hitting by Warner and Marsh! pic.twitter.com/rPvjHrJ3rV
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 20, 2023
ఇదీ చదవండి: కోహ్లీ సెంచరీపై బంగ్లాదేశ్ ఏడుపు! అంపైర్‌పై షాకింగ్ కామెంట్స్