iDreamPost

Big Bash League: వీడియో: ప్యాడ్స్ లేకుండానే క్రీజ్ లోకి పాక్ క్రికెటర్! కారణం ఏంటంటే?

మెల్బోర్న్ స్టార్స్ వర్సెస్ సిడ్నీ థండర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాక్ ఆటగాడు హారిస్ రౌఫ్ కాళ్లకు ప్యాడ్స్ లేకుండానే బ్యాటింగ్ కు దిగి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.

మెల్బోర్న్ స్టార్స్ వర్సెస్ సిడ్నీ థండర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాక్ ఆటగాడు హారిస్ రౌఫ్ కాళ్లకు ప్యాడ్స్ లేకుండానే బ్యాటింగ్ కు దిగి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.

Big Bash League: వీడియో: ప్యాడ్స్ లేకుండానే క్రీజ్ లోకి పాక్ క్రికెటర్! కారణం ఏంటంటే?

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ల్లో కొన్ని చిత్ర, విచిత్రమైన సంఘటనలు నమోదు అవుతూ ఉంటాయి. కొన్ని మ్యాచ్ ల్లో ఆటగాళ్ల మధ్య గొడవలు జరిగితే.. మరికొన్ని మ్యాచ్ ల్లో ప్లేయర్ల మధ్య సరదా సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాయి. ఇక మెరుపు ఫీల్డింగ్స్, తుఫాన్ బ్యాటింగ్ లు సరేసరి. కాగా.. తాజాగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో ఓ విచిత్రమైన సన్నివేశం నమోదైంది. మెల్బోర్న్ స్టార్స్ వర్సెస్ సిడ్నీ థండర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మెల్బోర్న్ స్టార్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న పాక్ ఆటగాడు హారిస్ రౌఫ్ కాళ్లకు ప్యాడ్స్ లేకుండానే బ్యాటింగ్ కు దిగి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. మరి రౌఫ్ అలా క్రీజ్ లోకి రావడానికి కారణాలు ఏంటి? ఆ వివరాలు..

ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో ఓ విచిత్రమైన సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ లీగ్ లో భాగంగా మెల్బోర్న్ స్టార్స్ వర్సెస్ సిడ్నీ థండర్స్ మధ్య తాజాగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మెల్బోర్న్ స్టార్స్ టీమ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు పాక్ స్టార్ పేసర్ హారిస్ రౌఫ్. అయితే అతడు బ్యాటింగ్ కు ప్యాడ్స్ లేకుండానే బరిలోకి దిగాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అతడు ఫ్యాడ్స్ లేకుండా క్రీజ్ లోకి ఎందుకొచ్చాడంటే? ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ ను సిడ్నీ థండర్స్ బౌలర్ డానియల్ సామ్స్ వేయడానికి వచ్చాడు. ఈ ఓవర్ లో అతడు రెచ్చిపోయి బౌలింగ్ చేశాడు. మూడో బంతికి బ్యూ వెబ్ స్టర్ ను పెవిలియన్ కు పంపిన అతడు.. ఈ తర్వాత బంతికే ఉసామా మిర్ ను క్యాచ్ ఔట్ చేశాడు. ఇక ఐదో బాల్ కు మార్క్ స్టెకెటీ(0)ను రనౌట్ చేశాడు సామ్స్. చివరి బంతికి లియామ్ డాసన్(2)ను క్లీన్ బౌల్డ్ చేయడంతో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు.

అయితే మూడో రనౌట్ కావడంతో హ్యాట్రిక్ మిస్ అయ్యాడు డానియల్ సామ్స్. కాగా.. వెంటవెంటనే వికెట్లు పడటంతో.. మెల్బోర్న్ బ్యాటర్ హారిస్ రౌఫ్ ప్యాడ్స్ కట్టుకోకుండానే మైదానంలోకి పరిగెత్తుకొచ్చాడు. టైమ్డ్ అవుట్ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు టైమ్ వేస్ట్ చేయకుండా బ్యాటింగ్ కు దిగాడు. కానీ అతడు ఒక్క బాల్ కూడా ఎదుర్కొలేదు అది వేరే విషయం అనుకోండి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో వెబ్ స్టర్ 59 రన్స్ తో రాణించాడు. అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ థండర్స్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి