iDreamPost
android-app
ios-app

Pandya Brother Arrest: హార్దిక్ పాండ్యా సోదరుడు అరెస్ట్! అసలేం జరిగిందంటే?

  • Published Apr 11, 2024 | 11:26 AM Updated Updated Apr 11, 2024 | 11:33 AM

హార్దిక్ పాండ్యా సోదరుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

హార్దిక్ పాండ్యా సోదరుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Apr 11, 2024 | 11:26 AMUpdated Apr 11, 2024 | 11:33 AM
Pandya Brother Arrest: హార్దిక్ పాండ్యా సోదరుడు అరెస్ట్! అసలేం జరిగిందంటే?

టీమిండియా స్టార్ క్రికెటర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సోదరుడు(సవతి తల్లి కొడుకు) వైభవ్ పాండ్యా అరెస్ట్ అయ్యాడు. ముంబై పోలీసులు ఈ హై ప్రొఫైల్ కేసులో వైభవ్ ను అరెస్ట్ చేశారు. దీంతో ఈ విషయం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. అసలు పాండ్యా సోదరుడు వైభవ్ చేసిన తప్పేంటి? పాండ్యా బ్రదర్స్ నే ఇంతలా మోసం చేశాడా? పూర్తి వివరాల్లోకి వెళితే..

పాండ్యా సోదరులకు ఊహించని షాకిచ్చాడు వారి సోదరుడు(సవతి తల్లి కొడుకు) వైభవ్ పాండ్యా. అతడు చేసిన మోసం బయటపడటంతో.. తమ సోదరుడిపై చీటింగ్, ఫోర్జరీ కేసు పెట్టారు పాండ్యా బ్రదర్స్. దీంతో ముంబై పోలీసులు వైభవ్ ను అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే? 2021లో పాండ్యా సోదరులతో పాటుగా వైభవ్ ని భాగస్వామిగా చేర్చుకుని పాలిమర్  బిజినెస్ స్టార్ట్ చేశారు. అందులో వైభవ్ కు 20 శాతం వాటా ఉంది. కాగా.. పాండ్యా సోదరులకు 40 శాతం వాటాలు ఉన్నాయి.

అయితే అతడు పాండ్యా సోదరులకు తెలియకుండా.. సొంతంగా ఒక్కడే ఇలాంటి మరో బిజినెస్ నే స్టార్ట్ చేశాడు. ప్రారంభించడమే కాకుండా.. పాత వ్యాపారం నుంచి కొత్త బిజినెస్ కోసం రూ. 4.3 కోట్ల నిధులను మళ్లించాడట. ఈ విషయం కాస్త పాండ్యా సోదరులకు తెలియడంతో.. వైభవ్ పై చీటింగ్, ఫోర్జరీ కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి హార్దిక్ పాండ్యా సోదరుడి అరెస్ట్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet