Hardik Pandya: కమ్ బ్యాక్ కోసం హార్దిక్ పాండ్యా కష్టాలు.. వైరలవుతున్న వీడియో!

టీమ్ లోకి కమ్ బ్యాక్ అవ్వడం కోసం స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కష్టాలు పడుతున్నాడు. అందులో భాగంగా జిమ్ లో చెమటలు చిందిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

టీమ్ లోకి కమ్ బ్యాక్ అవ్వడం కోసం స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కష్టాలు పడుతున్నాడు. అందులో భాగంగా జిమ్ లో చెమటలు చిందిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

హార్దిక్ పాండ్యా.. గత కొంతకాలంగా ప్రపంచ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిన పేరు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి భారీ మెుత్తంలో ముంబై ఇండియన్స్ అతడిని ఐపీఎల్ క్యాష్ ఆన్ ట్రేడింగ్ లో కొనుగోలు చేయడమైతే.. ఇంకోటి రోహిత్ శర్మను కాదని పాండ్యాకు ముంబై జట్టు పగ్గాలు అందివ్వడం. ఇదిలా ఉండగా.. వన్డే ప్రపంచ కప్ 2023 సందర్భంగా గాయపడ్డ పాండ్యా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ తో పాటుగా సౌతాఫ్రికా టూర్ కు దూరం అయ్యాడు. అయితే ఆఫ్గానిస్తాన్ తో టీ20 సిరీస్, టీ20 వరల్డ్ కప్ 2024 కోసం కమ్ బ్యాక్ అయ్యేందుకు కఠోర శ్రమ చేస్తున్నాడు ఈ స్టార్ ఆల్ రౌండర్. జిమ్ లో చమటలు చిందిస్తున్న పాండ్యా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

వన్డే ప్రపంచ కప్ 2023లో గాయపడ్డ టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. గత కొంతకాలంగా జట్టుకు దూరమైయ్యాడు. దీంతో చాలా మేజర్ టోర్నీలకు అందుబాటులో లేడు. ఇది టీమిండియాపై తీవ్ర ప్రభావం చూపింది. ఇక వచ్చే మెగాటోర్నీలకైనా అందుబాటులో ఉంటాడా? గాయం పూర్తిగా మానిందా? అన్న అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. కాగా.. ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ, తిరిగి జట్టులోకి రావడానికి కఠోరంగా శ్రమిస్తున్నాడు పాండ్యా. తాజాగా తాను జిమ్ లో చేస్తున్న వర్కౌట్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. టీమ్ లోకి కమ్ బ్యాక్ అవ్వడం కోసం కష్టపడుతున్నాడు.

ఈ క్రమంలోనే పాండ్యా జిమ్ లో తెగ బరువులు ఎత్తుతూ.. కసరత్తులు చేస్తున్నాడు. రోజురోజుకు ఫిట్ నెస్ సాధిస్తున్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చాడు ఈ స్టార్ ఆల్ రౌండర్. దీంతో తాను త్వరలోనే గ్రౌండ్ లోకి అడుగుపెట్టబోతున్నాను అంటూ అతిపెద్ద హింట్ ఇచ్చాడు.  ఆఫ్గాన్ సిరీస్ కు అందుబాటులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఏంటంటే? పాండ్యా గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాగానీ.. టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని అతడిని మరింత రెస్ట్ ఇవ్వొచ్చు టీమిండియా మేనేజ్ మెంట్. ఈ అవకాశాన్ని కొట్టిపారేయలేం అంటున్నారు క్రీడా పండితులు. మరి కమ్ బ్యాక్ కోసం ఇంతలా కష్టపడుతున్న పాండ్యాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments