రోహిత్‌ వారసుడు అతడే! టీ20 కెప్టెన్‌ను BCCI డిసైడ్‌ చేసేసిందా?

Rohit Sharma, Hardik Pandya, Team India, Captain: రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌తో టీ20 కెప్టెన్సీ పోస్టు ఖాళీ అయింది. మరి ఆ పోస్టులోకి వచ్చే క్రికెటర్‌ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే.. బీసీసీఐ ఇప్పటికే ఓ ప్లేయర్‌ను కెప్టెన్‌గా ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. మరి ఆ ప్లేయర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma, Hardik Pandya, Team India, Captain: రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌తో టీ20 కెప్టెన్సీ పోస్టు ఖాళీ అయింది. మరి ఆ పోస్టులోకి వచ్చే క్రికెటర్‌ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే.. బీసీసీఐ ఇప్పటికే ఓ ప్లేయర్‌ను కెప్టెన్‌గా ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. మరి ఆ ప్లేయర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

భారత క్రికెట్‌ అభిమానులంతా ప్రస్తుతం టీ20 వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ మూడ్‌లోనే ఉన్నారు. జూన్‌ 29న వెస్టిండీస్‌లోని బార్బోడోస్‌లో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో గెలిచి.. పొట్టి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న భారత్‌ జట్టు.. ఈ రోజు స్వదేశానికి తిరిగి వచ్చింది. కప్పుతో తిరిగొచ్చిన రోహిత్‌ సేనకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించి​ంది. ఆ తర్వాత భారత జట్టు ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఆ తర్వాత.. ఢిల్లీ నుంచి ముంబైలో ఏర్పాటు చేసిన విక్టరీ పరేడ్‌లో పాల్గొనేందుకు వచ్చింది. ఈ పరేడ్‌ కోసం క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియాకు కాబోయే టీ20 కెప్టెన్‌పై కూడా బీసీసీఐ ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 సాధించిన తర్వాత.. రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో.. టీ20 టీమ్‌ కెప్టెన్సీ పోస్టు ఖాళీ అయింది. మరి రోహిత్‌ వారుసుడిగా బీసీసీఐ ఎవర్ని టీ20 కెప్టెన్‌గా నియమిస్తుందో అని క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీసీఐ టీ20 టీమ్‌కు రెగ్యులర్‌ కెప్టెన్‌ను డిసైడ్‌ చేసినట్లు, నేడో రేపో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. టీమిండియా టీ20 కెప్టెన్‌గా హార్ధిక్‌ పాండ్యాను నియమించేందుకు బీసీసీఐ ఫిక్స్‌ అయినట్లు సమాచారం.

ప్రస్తుతం హార్ధిక్‌ పాండ్యా భారత టీ20 జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. దీంతో.. అతనికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని బోర్డు పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా కెప్టెన్‌గా ఐపీఎల్‌లో పాండ్యా తనని తాను నిరూపించుకున్నాడు. ఐపీఎల్‌ 2022లో గుజరాత్‌ టైటాన్స్‌ను తన కెప్టెన్సీలో ఛాంపియన్‌గా నిలిపాడు. అలాగే ఐపీఎల్‌ 2023లో జీటీ రన్నరప్‌గా నిలిచింది. కానీ, ఐపీఎల్‌ 2024లో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన పాండ్యా ఆశించిన స్థాయిలో రాణించలేదు. కానీ, టీ20 వరల్డ్‌ కప్‌లో ఆల్‌రౌండర్‌గా మంచి ప్రదర్శన కనబర్చి.. కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే.. పాండ్యా పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకునే వరకు శుబ్‌మన్‌ గిల్‌కు టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 6 నుంచి జింబాబ్వేతో ప్రారంభం కానున్న ఐదు టీ20ల సిరీస్‌కు గిల్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. మరి టీ20 జట్టుకు పాండ్యా కెప్టెన్‌ అయితే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments