SNP
Hardik Pandya, Kusal Perera, IND vs SL: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా.. తన మార్క్ సెలబ్రేషన్స్‌తో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్‌గా మారాడు. ఆ సెలబ్రేషన్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Hardik Pandya, Kusal Perera, IND vs SL: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా.. తన మార్క్ సెలబ్రేషన్స్‌తో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్‌గా మారాడు. ఆ సెలబ్రేషన్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
క్రికెట్‌లో బౌలర్ వికెట్ తీసిన తర్వాత సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా కామన్. కానీ, కొంతమంది బౌలర్లు చాలా వింతగా, డిఫరెంట్‌గా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు వారి సెలబ్రేషన్స్ మ్యాచ్‌కే హైలెట అవుతూ ఉంటాయి. అలాంటి సెలబ్రేషన్స్ తాజాగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా చేసుకున్నాడు. పల్లెకలె వేదికగా ఆదివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఈ సెలబ్రేషన్స్ చోటు చేసుకున్నాయి. శ్రీలంకతో జరిగిన రెండో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించినా.. మన విజయం ఆగలేదు. ఈ మ్యాచ్‌లో పాండ్యా బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించాడు.
బౌలర్‌గా రెండు వికెట్లు పడగొట్టిన పాండ్యా.. బ్యాటింగ్ చేస్తూ కేవలం 9 బంతుల్లోనే 22 పరుగులు చేసి అదరగొట్టాడు. పైగా పాండ్యా ఆడిన షాట్స్ సూపర్. ఇవన్నీ కాకుండా.. ఈ మ్యాచ్‌లో కుసల్ పెరీరాను అవుట్ చేసిన తర్వాత పాండ్యా చేసుకున్న కామ్ అండ్ కోల్డ్ సెలబ్రేషన్స్ మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. సెలబ్రేషన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీ20 వరల్డ్ కప్ 2024లోనూ పాండ్యా ఇలాంటి వెరైటీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అప్పుడ కూడా ఆ సెలబ్రేషన్స్ వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి తన మార్క్ సెలబ్రేషన్స్‌తో రచ్చ చేశాడు పాండ్యా.
అయితే.. కుసల్ పెరీరాను అవుట్ చేసే ముందు బాల్‌కు పాండ్యా భారీ సిక్స్ కొట్టించుకున్నాడు. ఆ తర్వాత రెండు వైడ్లు వేసిన హార్ధిక్ పాండ్యా.. ఆ ఓవర్ చివరి బాల్‌ను షార్ట్ బాల్‌గా వేసి పెరీరాను బోల్తా కొట్టించాడు. పాండ్యా ప్లాన్ ప్రకారం పెరీరా బాల్‌ను గాల్లోకి ఆడాడు. దీప్ స్క్వేర్ లెగ్ వద్ద రింకూ సింగ్ ముందుకు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో.. పాండ్యా పెరీరాపై ప్రతీకారం తీర్చుకున్నాడు. పెరీర్‌ను అవుట్ చేసిన తర్వాత.. పాండ్యా అలాగే నిలబడి.. కామ్‌గా పెరీర్ వైపు చూశాడు. పాండ్యా చూసిన ఆ లుక్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి ఈ వెరైటీ సెలబ్రేషన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Yet again, #TeamIndia managed to shut down the Sri Lankan innings cheaply after a promising start 🤯
Watch the action from #SLvIND LIVE now on Sony Sports Ten 1, Sony Sports Ten 3, Sony Sports Ten 4 & Sony Sports Ten 5 🙌 🔥#SonySportsNetwork pic.twitter.com/7Vfd50meYp
— Sony Sports Network (@SonySportsNetwk) July 28, 2024