iDreamPost
android-app
ios-app

IND vs PAK: గ్రౌండ్‌లోనే హార్దిక్ పాండ్యా పూజలు! వెంటనే అవుట్!

  • Published Oct 14, 2023 | 3:59 PM Updated Updated Oct 14, 2023 | 5:19 PM
  • Published Oct 14, 2023 | 3:59 PMUpdated Oct 14, 2023 | 5:19 PM
IND vs PAK: గ్రౌండ్‌లోనే హార్దిక్ పాండ్యా పూజలు! వెంటనే అవుట్!

వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా ఇండియా-పాకిస్థాన్‌ జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో ఈ హైఓల్టేజ్‌ మ్యాచ్‌ షురువైంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. మొత్తానికి ఆ క్షణాలు రానే వచ్చాయి. అయితే.. ఈ మ్యాచ్‌ లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. అయితే.. ఈ మ్యాచ్‌ లో టీమిండియా కేవలం ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. ఇషాన్‌ కిషన్‌ స్థానంలో శుబ్‌మన్‌ గిల్‌ టీమ్‌ లోకి వచ్చాడు. కాగా.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ కు దిగిన పాకిస్థాన్‌ మంచి స్టార్ట్‌ నే అందుకుంది.

పాక్‌ ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్‌, ఇమామ్‌ ఉల్‌ హక్‌.. బుమ్రాను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడినా.. సిరాజ్‌ బౌలింగ్ లో సునాయసంగానే ఆడారు. ముఖ్యంగా సిరాజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ లో ఇమామ్‌ ఏకంగా మూడు ఫోర్లు బాది.. వేగం పెంచాడు. సిరాజ్‌ ఆరంభంలో పరుగులు ఇచ్చినా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అతనిపై నమ్మకం ఉంచి.. స్పెల్‌ కొనసాగించడం టీమిండియాకు కలిసొచ్చింది. ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ లో సిరాజ్‌ పాక్‌ ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్‌ ను అవుట్‌ చేసి.. టీమిండియాకు తొలి వికెట్‌ అందించాడు. ఆ తర్వాత.. మళ్లీ పాకిస్థాన్‌ బ్యాటర్లు భాగస్వామ్యం నెలకొల్పేందుకు ప్రయత్నించారు.

41 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన పాక్‌.. మరో 4 నాలుగు ఓవర్ల పాటు కంఫర్ట్‌బుల్‌ గానే ఆడింది. ఇక టీమిండియా రెండో వికెట్‌ ను స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా అందించాడు. పాండ్యా వేసిన ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో పాక్‌ ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్.. వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. దీంతో 73 పరుగుల వద్ద పాకిస్థాన్‌ మరో వికెట్‌ కోల్పోయింది. అయితే.. ఈ వికెట్‌ పడే ముందు హార్దిక్‌ పాండ్యా చేసిన పని క్రికెట్‌ అభిమానులను షాక్‌ కి గురి చేసింది. ఆ బాల్‌ వేసే ముందు పాండ్యా ఏవో మంత్రాలు చదివి.. బాల్‌ గాలి ఊది.. బౌలింగ్‌ వేశాడు. అదే బాల్‌ కు ఇమామ్‌ అవుట్‌ అయ్యాడు. దీంతో.. పాండ్యా చేసిన పని వైరల్‌ గా మారింది.

పాండ్యా మంత్రాలు చదివి బౌలింగ్‌ వేసి వికెట్‌ తీశాడంటూ సోషల్‌ మీడియాలో క్రికెట్‌ అభిమానులు సరదాగా పేర్కొంటున్నారు. అయితే.. పాండ్యా ఆ టైమ్‌ లో ఏ దేవుడిని ప్రార్ధించాడో మాత్రం అతనికే తెలియాలి. ఏ దేవుడికి మొక్కితే ఏంటి.. టీమిండియాకు మాత్రం రెండో వికెట్‌ అందించాడంటూ చాలా మంది భారత క్రికెట్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పాండ్యా అలా మంత్రం చదివి వికెట్‌ తీసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది. క్రికెట్‌ ఫ్యాన్సే కాకుండా.. నెటిజన్లు సైతం వీడియోను తెగ షేర్‌ చేస్తున్నారు. మరి పాండ్యా మంత్రం చదివి వికెట్‌ తీయడంపై, అలాగే కిందున్న ఆ వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఇండియా-పాక్ మ్యాచ్.. తొలి ఓవర్ లోనే రికార్డు బ్రేక్!