SNP
ముంబై ఇండియన్స్‌లో ఉన్న గ్రూప్ తగాదాలు మెల్లమెల్లగా బయటికి వస్తున్నట్లు కనిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత పాండ్యా చేసిన కామెంట్స్ అందుకు సూచనగా కనిపిస్తున్నాయి. అతను ఏం అన్నాడో ఇప్పుడు చూద్దాం..
ముంబై ఇండియన్స్‌లో ఉన్న గ్రూప్ తగాదాలు మెల్లమెల్లగా బయటికి వస్తున్నట్లు కనిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత పాండ్యా చేసిన కామెంట్స్ అందుకు సూచనగా కనిపిస్తున్నాయి. అతను ఏం అన్నాడో ఇప్పుడు చూద్దాం..
SNP
ముంబై ఇండియన్స్‌లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన పటిష్టమైన టీమ్.. ఈ సీజన్‌లో హ్యాట్రిక్ ఓటములను నమోదు చేసింది. జట్టు కెప్టెన్‌ను మార్చడం దగ్గర మొదలైన చర్చ.. ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. రోహిత్ శర్మ ప్లేస్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యాను నియమించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఐదు సార్లు టీమ్‌ను ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌ను అలా ఎలా తీసేస్తారంటూ రోహిత్ శర్మ అభిమానులు ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డారు. ఆ కోపాన్ని హార్ధిక్ పాండ్యాపై కూడా చూపించారు. తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మను బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్‌కు పంపడం కూడా రోహిత్ ఫ్యాన్స్‌కు పాండ్యాపై కోపాన్ని పెంచేసింది. అప్పటి నుంచి పాండ్యాను ట్రోల్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్‌లో రెండు గ్రూపులు ఉన్నాయి. రోహిత్ శర్మ అండర్‌లో ఒక గ్రూప్, హార్ధిక్ పాండ్యా అండర్‌లో ఒక గ్రూప్ నడుస్తుందని టాక్ బయటికొచ్చింది. బుమ్రాతో పాటు మరికొంతమంది ఆటగాళ్లు రోహిత్‌కు మద్దతుగా ఉంటే.. ఇషాన్ కిషన్ లాంటి వాళ్లు పాండ్యా వెంట ఉన్నారు. ఇలా రెండు గ్రూపులుగా టీమ్ విడిపోయి.. కలిసి కట్టుగానే ఆడకపోవడం, గేమ్ ప్లాన్‌ను రూపొందించుకోకుండా గుడ్డిగా బరిలోకి దిగడంతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలవుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీమ్‌లో డిసిప్లిన్ లేదని, గెలవాలనే కసి కూడా కొరవడిందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా రాజస్థాన్‌తో మ్యాచ్‌లో తాను అవుట్ అవ్వడం ముంబై ఇండియన్స్‌పై తీవ్ర ప్రభావం చూపిందని అక్కడే మ్యాచ్ టర్న్ అయిందని పాండ్యా పేర్కొన్నాడు. అలాగే తమకు మంచి స్టార్ట్ లభించలేదని రోహిత్ శర్మను పరోక్షంగా ప్రస్తావిస్తూ మాట్లాడాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌట్ అయిన విషయం తెలిసిందే. రోహిత్‌తో పాటు వన్‌డౌన్‌లో వచ్చిన నమన్ ధీర్, తర్వాత వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ కూడా గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఇలా టీమ్ చెత్త ప్రదర్శనతో విసిగిపోయిన పాండ్యా.. ఎట్టకేలకు టీమ్‌లో క్రమశిక్షన లేదని షాకింగ్ కామెంట్ చేశాడు. మరి పాండ్యా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Not giving up, but not our night. #MumbaiMeriJaan #MumbaiIndians #MIvRR pic.twitter.com/ubARBcelx9
— Mumbai Indians (@mipaltan) April 1, 2024