Nidhan
క్లబ్, ఫ్రాంచైజీ క్రికెట్లో అనూహ్య నిర్ణయాలు తీసుకోవడం కామన్ అని ముంబై ఇండియన్స్ మరోమారు ప్రూవ్ చేసింది. తమ టీమ్ కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను నియమించింది. అయితే ఎంఐకి ఫ్యాన్స్ ఊహించని షాక్ ఇచ్చారు.
క్లబ్, ఫ్రాంచైజీ క్రికెట్లో అనూహ్య నిర్ణయాలు తీసుకోవడం కామన్ అని ముంబై ఇండియన్స్ మరోమారు ప్రూవ్ చేసింది. తమ టీమ్ కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను నియమించింది. అయితే ఎంఐకి ఫ్యాన్స్ ఊహించని షాక్ ఇచ్చారు.
Nidhan
ఐపీఎల్లో పాపులర్ ఫ్రాంచైజీల్లో ఒకటైన ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టు కెప్టెన్సీ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పజెప్పింది. ఇటీవల జరిగిన ప్లేయర్ల రిటెన్షన్ టైమ్ నుంచే ముంబై కెప్టెన్సీ అంశం చర్చనీయాంశంగా మారింది. రిటెన్షన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యాను భారీ మొత్తం వెచ్చించి మరీ దక్కించుకుంది ముంబై. అయితే కెప్టెన్సీ ఇచ్చి తనను ఇంతగా ప్రోత్సహించిన గుజరాత్‌ను హార్దిక్ ఎందుకు వీడాడో ఎవరికీ అర్థం కాలేదు. అదే టైమ్‌లో టీమ్‌కు ఒకసారి టైటిల్ అందించి, మరోమారు ఫైనల్స్‌కు చేర్చిన పాండ్యాను టైటాన్స్ ఎందుకు వదులుకుందో కూడా మిస్టరీగా మారింది. దీనిపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. హార్దిక్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పే ఉద్దేశంతోనే ముంబై ఇంత రిస్క్ తీసుకుందని తేలిపోయింది. అయితే ఎంఐకి ఫ్యాన్స్ గట్టి షాక్ ఇచ్చారు.
హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించిందో లేదో ముంబై ఇండియన్స్‌కు అభిమానులు షాక్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఈ ఫ్రాంచైజీకి ఫ్యాన్స్ నుంచి ఊహించని స్థాయిలో నిరసన సెగ తగిలింది. హార్దిక్‌ను సారథిగా నియమిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ట్విట్టర్లో 4 లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షల మందికి పైగా ముంబైని అన్‌ఫాలో చేశారు. ఈ దెబ్బతో ఎంఐ షాకవ్వగా.. ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఐపీఎల్ ఫ్రాంచైజీగా చెన్నై సూపర్ కింగ్స్ (13 మిలియన్లు) అవతరించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఫ్యాన్స్ నుంచి ఎంఐకి ఊహించని విధంగా వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా రోహిత్ శర్మ అభిమానులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. కెప్టెన్సీ మార్పును వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు హిట్‌మ్యాన్ అభిమానులైతే ముంబై జెర్సీలను తగులబెట్టారు. జెర్సీలను తగులబెట్టిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రోహిత్ శర్మ 2013 నుంచి 2023 వరకు ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. అతడి సారథ్యంలోనే టీమ్ 5 సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. అంతకుముందు సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్, రికీ పాంటింగ్ లాంటి గ్రేట్ క్రికెటర్స్ కెప్టెన్స్‌గా ఉన్నప్పటికీ ముంబైకి కప్పు అందించలేకపోయారు. కానీ హిట్‌మ్యాన్ ఏకంగా ఐదుసార్లు టీమ్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. అలాంటి రోహిత్‌ను ఇలా హఠాత్తుగా కెప్టెన్సీ నుంచి తీసేయడం, తమ టీమ్ తమ ఇష్టం అన్నట్లుగా వ్యవహరించడాన్ని అభిమానులు సహించలేకపోతున్నారు. ఇది రోహిత్‌ను అవమానించడమేనని సీరియస్ అవుతున్నారు. ముంబై ఇండియన్స్ అకౌంట్స్‌ను చాలా మంది అన్‌ఫాలో చేస్తున్నారు. రోహిత్ ఫ్యాన్స్ నుంచి అసంతృప్తిని ఎక్స్పెక్ట్ చేసినా.. ఇంత స్థాయిలో వ్యతిరేకతను మాత్రం ముంబై ఊహించి ఉండకపోవచ్చు. మరి.. ముంబైకి ఫ్యాన్స్ షాక్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Suryakumar Yadav: వీడియో: పేసర్ అర్ష్‌దీప్‌కు వార్నింగ్ ఇచ్చిన సూర్యకుమార్.. వేలు చూపిస్తూ..!
A Rohit Sharma fan burns the Mumbai Indians jersey. pic.twitter.com/WItos5hL4H
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 16, 2023
Mumbai Indians have lost more than 4 lakh active followers since last night.
Rohit Sharma’s fans on every platform, have started unfollowing the account. pic.twitter.com/pCTrTfKUHf
— Vishal. (@SPORTYVISHAL) December 16, 2023
A Rohit Sharma fan burns the Mumbai Indians’ cap. pic.twitter.com/FtlTI20VvY
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 15, 2023