Hardik Pandya: ఆ వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధించాయి.. పాండ్యా షాకింగ్ పోస్ట్!

మరోసారి వార్తల్లో నిలిచాడు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. ఆ వ్యాఖ్యలు నన్ను ఎంతో బాధించాయి అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు పాండ్యా.

మరోసారి వార్తల్లో నిలిచాడు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. ఆ వ్యాఖ్యలు నన్ను ఎంతో బాధించాయి అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు పాండ్యా.

హార్దిక్ పాండ్యా.. గాయం కారణంగా గత కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఇక ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఎంపికైన తర్వాత అతడిపై రోహిత్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ప్రస్తుతం అతడు టీమిండియాలోకి రిఎంట్రీ ఇవ్వాలని తెగ కష్టపడుతున్నాడు. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో.. ఆఫ్గానిస్తాన్ తో జరిగే మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ కు కూడా దూరం అయ్యాడు పాండ్యా. ఇదిలా ఉండగా.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు ఈ స్టార్ ఆల్ రౌండర్. ఆ వ్యాఖ్యలు నన్ను ఎంతో బాధించాయి అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు.

టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మాల్దీవుల వివాదంపై స్పందించాడు. భారతదేశ పర్యటక రంగాన్ని కించపరిచేలా మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారతదేశ పర్యటక రంగాన్ని తక్కువ, చులకన చేస్తూ రమీజ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి తెరలేపాయి. దీంతో అతడిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు భారతీయులు. ఈ క్రమంలోనే మాల్దీవులు ఎంపీ జహీద్ రమీజ్ వ్యాఖ్యలపై ట్విట్టర్ ద్వారా స్పందించాడు పాండ్యా. “మాల్దీవులు ఎంపీ జహీద్ భారతదేశం గురించి అలా అవమానకరంగా మాట్లాడ్డం నాకు చాలా బాధకలిగించింది. అతడి వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధించాయి. అద్భుతమైన సముద్రరం, అంతకంటే అద్భుతమైన తీర ప్రాంతం కలిగిన లక్షదీవులను ఒక్కసారైనా కచ్చితంగా చూడాలి. నేను నెక్ట్స్ హాలిడేస్ కు ఇక్కడికే వెళ్తాను” అంటూ రాసుకొచ్చాడు పాండ్యా. దేశం సత్తాచాటుదాం, మన పర్యటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందాం అంటూ పాండ్యా పేర్కొన్నాడు.

కాగా.. మాల్దీవులు అందించినంత పరిశుభ్రతను భారతదేశ పర్యటక రంగం అందించలేదని, భారతదేశ గదులు దుర్వాసనను వెదజల్లుతాయని జహీద్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. దీంతో మాల్దీవులకు వెళ్లకూడదని, తమ బుకింగ్స్ ను క్యాన్సిల్ చేసుకున్న కొందరు అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై, పాండ్యా స్పందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments