SNP
Hardik Pandya, MI vs RR, IPL 2024: రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి కారణం తానేనంటూ హార్ధిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్ చేశాడు. హైయెస్ట్ స్కోరర్‌గా నిలిచినా కూడా పాండ్యా ఇలాంటి కామెంట్స్‌చేయడం ఆసక్తికరంగా మారింది. మరి అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు చూద్దాం..
Hardik Pandya, MI vs RR, IPL 2024: రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి కారణం తానేనంటూ హార్ధిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్ చేశాడు. హైయెస్ట్ స్కోరర్‌గా నిలిచినా కూడా పాండ్యా ఇలాంటి కామెంట్స్‌చేయడం ఆసక్తికరంగా మారింది. మరి అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు విజయం అనేది లేకి ఏకైక టీమ్‌గా ఉన్న ముంబై ఇండియన్స్.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. సోమవారం ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఐ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. కానీ, ఆ టీమ్ సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అవ్వడంతో పాటు.. వన్ డౌన్‌లో వచ్చిన నమన్ ధీర్‌తో పాటు తర్వాత వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ సైతం గోల్డెన్ డక్‌గా వెనుదిరిగారు. దీంతో ముంబై కేవలం 14 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది.
కొద్ది సేపటికే ఇషాన్ కిషన్ సైతం అవుట్ కావడంతో 20 పరుగుల వద్ద ముంబై 4వ వికెట్ కోల్పోయింది. దీంతో.. ఎంఐ కనీసం వంద పరుగులైనా చేస్తుందా? అనే డౌట్ వచ్చింది. కానీ, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మతో కలిసి ఓ మంచి పార్ట్నర్‌షిప్ నెలకొల్పాడు. తిలక్ వర్మ 29 బంతుల్లో 2 సిక్సులతో 32, హార్దిక్ పాండ్యా 21 బంతుల్లో 6 ఫోర్లతో 34 రన్స్ చేసి ముంబైకి కాస్త గౌరవప్రదమైన స్కోర్ అందించారు. మిగతా బ్యాటర్లు విఫలమైన చోట హార్ధిక్ పాండ్యా మాత్రం చక్కటి బ్యాటింగ్ చేసి.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. క్రీజ్‌లోకి రావడం రావడమే ఫోర్లతో విరుచుకుపడ్డాడు. అయితే.. అప్పుడే ఇన్నింగ్స్ గాడిలో పడుతుంది అనుకున్న టైమ్‌లో ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగ్ ఆన్‌లో రోవ్‌మన్ పావెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కీలకమైన పాండ్యా వికెట్ తీసి.. చాహల్ రాజస్థాన్‌కు మంచి బ్రేక్‌త్రూ అందించాడు.
అయితే.. ఇదే ముంబై ఇండియన్స్ ఓటమికి కారణమైందని పాండ్యా అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్‌లో తాను మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సిందని అన్నాడు. మా ప్లాన్‌కు తగ్గట్లు మేం బ్యాటింగ్ చేయలేకపోయాం. సరైన స్టార్ట్ లభించలేదు. ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురిచేసింది. ఓ దశలో మేం పటిష్ట స్థితిలో నిలిచాం. ఈజీగా 150 నుంచి 160 పరుగులు చేస్తామని అనుకున్నాం. కానీ, నా వికెట్ మ్యాచ్‌ను టర్న్ చేసిందని పాండ్యా పేర్కొన్నాడు. పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని అనుకున్నాం కానీ, మరీ ఇంతలా బౌలర్లకు సహకరిస్తుందని ఊహించలేదని అభిప్రాయపడ్డాడు. మరి ఓటమికి తాను అవుట్ అవ్వడమే కారణం అని పాండ్యా పేర్కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Not giving up, but not our night. #MumbaiMeriJaan #MumbaiIndians #MIvRR pic.twitter.com/ubARBcelx9
— Mumbai Indians (@mipaltan) April 1, 2024