Nidhan
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. పొట్టి ప్రపంచ కప్‌లో అదరగొట్టిన పాండ్యా.. ప్రస్తుతం జరుగుతున్న లంక సిరీస్‌లోనూ దుమ్మురేపుతున్నాడు.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. పొట్టి ప్రపంచ కప్‌లో అదరగొట్టిన పాండ్యా.. ప్రస్తుతం జరుగుతున్న లంక సిరీస్‌లోనూ దుమ్మురేపుతున్నాడు.
Nidhan
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. పొట్టి ప్రపంచ కప్‌లో అదరగొట్టిన పాండ్యా.. ప్రస్తుత లంక సిరీస్‌లోనూ దుమ్మురేపుతున్నాడు. ఈ సిరీస్‌లోని తొలి టీ20లో అంతగా రాణించని పాండ్యా.. రెండో మ్యాచ్‌లో మాత్రం చెలరేగిపోయాడు. 2 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్ టైమ్‌లో ఆఖర్లో వచ్చి 9 బంతుల్లో 22 పరుగులతో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. చివరి టీ20లో కూడా ఇదే రీతిలో ఆడాలని అనుకుంటున్నాడు. సిరీస్ ముగిసిన తర్వాత ఫిట్‌నెస్‌పై మరింత ఫోకస్ పెట్టాలని భావిస్తున్నాడు పాండ్యా. వన్డేల్లో ప్లేస్ దక్కాలంటే ఫిట్నెస్ తప్పనిసరి అని టీమ్ మేనేజ్మెంట్ స్పష్టం చేయడంతో దానిపై దృష్టి సారిస్తున్నాడు.
వన్డే టీమ్‌లో చోటు దక్కాలంటే దులీప్ ట్రోఫీలో ఆడి బౌలింగ్ ఫిట్నెస్ నిరూపించుకోమని హార్దిక్‌కు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది. కనీసం 8 ఓవర్లు బౌలింగ్ చేయగలిగితేనే టీమ్‌లోకి తీసుకుంటామని ఇండికేషన్స్ పంపారట. అందుకే తన సత్తా చాటేందుకు అతడు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడని తెలుస్తోంది. ఈ తరుణంలో లెజెండరీ పేసర్ ఆశిష్ నెహ్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హార్దిక్ పనైపోయిందని.. అతడు ఇక ఆడలేడన్నాడు. పాండ్యా ఫిట్‌గా లేడని, అతడు ఎక్కువ కాలం క్రికెట్ ఆడటం కష్టమేనని చెప్పాడు. కెరీర్‌ను సుదీర్ఘ కాలం పొడిగించుకోవాలంటే హార్దిక్ తీవ్రంగా కష్టపడక తప్పదని.. లేకపోతే అంతే సంగతులు అని హెచ్చరించాడు నెహ్రా.
‘హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్‌గా లేడు. అతడు ఎక్కువ కాలం క్రికెట్ ఆడలేడు. ప్రస్తుతం ఉన్న ఫిట్నెస్తో అతడు కేవలం టీ20ల్లో మాత్రమే ఆడగలడు. అందుకే అతడ్ని వన్డే టీమ్‌లోకి తీసుకోలేదు. అయితే ఇండియా టీమ్ సెటప్ నుంచి చూస్తే పాండ్యా ఎంతో కీలకమైన ఆటగాడు. ముఖ్యంగా వైట్‌బాల్ క్రికెట్లో అతడు జట్టులో ఉండటం చాలా తప్పనిసరి. ఇది జరగాలంటే పాండ్యా ముందు ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి’ అని నెహ్రా సూచించాడు. ఇక, హార్దిక్‌తో కలసి గతంలో పని చేశాడు నెహ్రా. గుజరాత్ టైటాన్స్‌కు పాండ్యా కెప్టెన్‌గా ఉన్న టైమ్‌లో కోచ్‌గా ఉన్న నెహ్రాతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అయితే హార్దిక్ జీటీని వీడి ముంబైకి వెళ్లిపోయాడు. ఇప్పుడు నెహ్రా కూడా ఆ జట్టులో నుంచి బయటకు రావడం ఖాయమని వినిపిస్తోంది. మరి.. హార్దిక్ ఎక్కువ రోజులు ఆడలేడనే వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ashish Nehra “Hardik Pandya is not that fit,he doesn’t play many matches, he plays just one format,this can be one of the reasons.But Hardik Pandya is a very important player in the Indian setup when you talk about white-ball cricket and when he is fit.”pic.twitter.com/82boXlgnzC
— Sujeet Suman (@sujeetsuman1991) July 30, 2024