iDreamPost
android-app
ios-app

MI vs SRH: దిగ్గజ క్రికెటర్‌ మలింగాను కోపంగా నెట్టేసిన పాండ్యా! వీడియో వైరల్‌

  • Published Mar 28, 2024 | 12:41 PM Updated Updated Mar 28, 2024 | 12:41 PM

Hardik Pandya, Lasith Malinga: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఓటమి తర్వాత హార్ధిక్‌ పాండ్యా, ముంబై ఇండియన్స్‌ బౌలింగ్‌ కోచ్‌ లసిత్‌ మలింగాతో ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకీ పాండ్యా ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

Hardik Pandya, Lasith Malinga: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఓటమి తర్వాత హార్ధిక్‌ పాండ్యా, ముంబై ఇండియన్స్‌ బౌలింగ్‌ కోచ్‌ లసిత్‌ మలింగాతో ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకీ పాండ్యా ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 28, 2024 | 12:41 PMUpdated Mar 28, 2024 | 12:41 PM
MI vs SRH: దిగ్గజ క్రికెటర్‌ మలింగాను కోపంగా నెట్టేసిన పాండ్యా! వీడియో వైరల్‌

ముంబై ఇండియన్స్ వర్సెస్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక రన్స్‌ నమోదు అయిన మ్యాచ్‌గా నిలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 277 పరుగుల అతి భారీ స్కోర్‌ చేస్తే.. ముంబై ఇండియన్స్‌ సైతం 246 పరుగులు చేసింది. ఇలా రెండు జట్లు కలిసి 40 ఓవర్లలో 523 పరుగులు చేశారు. ఒక టీ20 మ్యాచ్‌లో ఇన్ని పరుగులు నమోదు కావడం గతంలో ఎప్పుడూ జరగలేదు. అయితే.. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ముంబైకి ఇది వరుసగా రెండో ఓటమి. ఈ ఓటమితో ఆ జట్టు కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యాపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కెప్టెన్‌గా పాండ్యా ఫెల్యూర్‌తోనే ముంబై ఓడిపోతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇన్ని విమర్శల మధ్యలో కూడా పాండ్యా మరింత దురుసుగా ప్రవర్తిస్తున్నాడు.

ముంబై ఇండియన్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఉన్న దిగ్గజ క్రికెటర్‌ లసిత్‌ మలింగాను చాలా చిరగ్గా నెట్టేశాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ ముగిసి.. అంతా షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకుంటున్న క్రమంలో.. మలింగా తమ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యాను హాగ్‌ చేసుకోబోయాడు. అయితే.. పాండ్యా మాత్రం ఒక సీనియర్‌ క్రికెటర్‌, టీమ్‌ బౌలింగ్‌ కోచ్‌ అనే కనీస మర్యాద లేకుండా మలింగాను పక్కకు చాలా చిరగ్గా ముఖం పెట్టి తోసేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దృశ్యాలు చూసిన క్రికెట్‌ అభిమానులు పాండ్యాకు ఇంత అహంకారమా? దిగ్గజ క్రికెటర్‌ పట్ల ఇలాగే ప్రవర్తించేది అంటూ మండిపడుతున్నారు.

ఇప్పటికే రోహిత్‌ శర్మ విషయంలో పాండ్యాపై క్రికెట్‌ అభిమానులు చాలా కోపంగా ఉన్నారు. రోహిత్‌ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ అయిన పాండ్యా.. గుజరాత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్‌ను బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌కు పంపి తీవ్ర విమర్శల పాలయ్యాడు. ఈ ఘటనపై యావత్‌ క్రికెట్‌ లోకం పాండ్యాపై మండిపడింది. జట్టుకు ఐదు ట్రోఫీలు అందించిన కెప్టెన్‌, ఒక సీనియర్‌ ప్లేయర్‌ను కావాలనే ఇలా ఫీల్డింగ్‌కు పెట్టి తన ఇగోను చూపిస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కూడా పాండ్యాలో ఏ మార్పు రాలేదు. తొలి మ్యాచ్‌లో రోహిత్‌ శర్మను అవమానించిన పాండ్యా.. రెండో మ్యాచ్‌లో మలింగాను దారుణంగా అవమానించారు. డకౌట్‌లో కూర్చి కోసం కూడా మలింగాను లేపి పంపించాడు. ఇంత అహంకారం ఎందుకంటూ క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.