iDreamPost
android-app
ios-app

MI vs KKR: మా ఓటమికి కారణం అదే..! రోహిత్‌పై నెట్టేసిన హార్ధిక్‌ పాండ్యా?

  • Published May 04, 2024 | 9:23 AM Updated Updated May 04, 2024 | 9:23 AM

Hardik Pandya, Rohit Sharma: కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎదురైన ఘోర ఓటమికి కారణం గురించి మాట్లాడిన పాండ్యా హార్ధిక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాండ్యా చెప్పిన కారణంతో రోహిత్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Hardik Pandya, Rohit Sharma: కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎదురైన ఘోర ఓటమికి కారణం గురించి మాట్లాడిన పాండ్యా హార్ధిక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాండ్యా చెప్పిన కారణంతో రోహిత్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published May 04, 2024 | 9:23 AMUpdated May 04, 2024 | 9:23 AM
MI vs KKR: మా ఓటమికి కారణం అదే..! రోహిత్‌పై నెట్టేసిన హార్ధిక్‌ పాండ్యా?

కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌పై ఎదురైన ఓటమిని రోహిత్‌ శర్మపై నెట్టేసే ప్రయత్నం చేశాడు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా. శుక్రవారం ముంబైలోకి వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 24 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌లో ఓటమికి కారణం గురించి మాట్టాడిన పాండ్యా.. బ్యాటింగ్‌లో తాము మంచి పార్ట్నర్‌షిప్‌లు నెలకొల్పలేకపోయాం అదే మా ఓటమికి ప్రధాన కారణం అని తాను భావిస్తున్నట్లు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా అన్నాడు. దీంతో.. పాండ్యా పరోక్షంగా ఓటమిని రోహిత్ శర్మపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నాడంటూ.. సోషల్‌ మీడియాలో క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు.

170 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ 18.5 ఓవర్లలో కేవలం 145 పరుగులకే కుప్పకూలింది. సూర్యకుమార్‌ యాదవ్‌ 56, టిమ్‌ డేవిడ్‌ 24 పరుగులతో రాణించినా.. ముంబై ఇండియన్స్‌ను గెలిపించలేకపోయారు. వీరిద్దరు తప్పితే.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలం అయ్యారు. రోహిత్‌ శర్మ 11, ఇషాన్‌ 13, నమన్‌ ధీర్‌ 11, తిలక్‌ వర్మ 4, హార్ధిక్‌ పాండ్యా ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో.. ముంబై ఇండియన్స్‌ సొంత గడ్డపై 24 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. కానీ, పాండ్యా మాత్రం భాగస్వామ్యాలు నమోదు చేయలేకపోయాం అంటూ ఓటమికి బాధ్యత తీసుకోకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పరోక్షంగా ఆ ఓటమికి కారణం.. రోహిత్‌ శర్మ అనే ఉద్దేశంతో మాట్లాడినట్లు క్రికెట్‌ ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.

ఇక సీనియర్‌ ప్లేయర్‌గా, ఓపెనర్‌గా ఉన్న రోహిత్‌ శర్మ.. యువ క్రికెటర్‌ ఇషాన్ కిషన్‌తో కలిసి మంచి స్టార్ట్‌ అందివ్వాలి, అలాగే జట్టు వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో పార్ట్నర్‌షిప్‌లు నెలకొల్పి, ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించకుండా.. నిర్లక్ష్యంగా ఆడి అవుట్‌ అయ్యాడని.. ఆ విషయాన్ని డైరెక్ట్‌గా చెప్పకుండా.. ఇలా పార్ట్నర్‌షిప్‌లు నమోదు చేయలేకపోయాం అందుకే ఓడిపోయాం అంటూ పాండ్యా వెల్లడించాడు. అయితే.. కెప్టెన్‌గా హార్ధిక్‌ పాండ్యా చేసిన పొరపాట్లతోనే కేకేఆర్‌ అంత స్కోర్‌ చేసిందని.. లేదంటే.. ఒక 120కే పరిమితం అయ్యేదని, నమన్‌ ధీర్‌కు వరుసగా మూడు ఓవర్లు ఇచ్చి, వెంకటేశ్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే మధ్య పార్ట్నర్‌షిప్‌ నమోదు అయ్యేలా చేశాడని ముంబై ఇండియన్స్‌ ఫ్యాన్స్‌ పాండ్యాపై మండిపడుతున్నారు. తాను చేసిన తప్పులను పట్టించుకోకుండా.. వేరే ఆటగాళ్లపై ఓటమి నెట్టేయడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు. మరి కేకేఆర్‌పై ఓటమి తర్వాత పాండ్యా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.