SNP
Hardik Pandya, Team India, T20 World Cup 2024: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హర్ధిక్ పాండ్యా తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అతని పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఆ పోస్ట్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
Hardik Pandya, Team India, T20 World Cup 2024: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హర్ధిక్ పాండ్యా తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అతని పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఆ పోస్ట్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచిన తర్వాత.. రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో టీ20 ఫార్మాట్‌కు కొత్త కెప్టెన్‌ను నియమించాల్సిన టైమ్ వచ్చింది. జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‌కు శుబ్‌మన్ గిల్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించి యంగ్ టీమిండియాను పంపించారు. ఇప్పుడు శ్రీలంక పర్యటనకు వెళ్లే టీ20 సిరీస్‌కు ఎవర్ని కెప్టెన్‌గా నియమిస్తారనే దానిపై క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. మొన్నటి వరకు టీ20 టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా ఉన్న హార్ధిక్ పాండ్యానే కెప్టెన్ అవుతాడని అంతా భావించారు. కానీ, తాజాగా సూర్యకుమార్ యాదవ్ పేరు తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది.
హార్డ్ వర్క్ ఎప్పటికీ వృథా కాదంటూ ఆ పోస్టులో పేర్కొన్నాడు. పొట్టతో ఉన్న ఫొటోతో పాటు చాలా ఫిట్‌గా ఉన్న మరో పిక్‌ను దానికి జతచేశాడు. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు నుంచి పాండ్యాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌లోకి రావడంతో పాటు.. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్ నియామకం కావడంతో రోహిత్ ఫ్యాన్స్, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ పాండ్యాపై ట్రోలింగ్‌కు దిగారు. గ్రౌండ్‌లో బో అంటూ అరుస్తూ.. పాండ్యా పరువుతీశారు. ఇండియాలో ఒక ఇండియన్ క్రికెటర్‌ను ఈ రేంజ్‌లో ట్రోల్ చేయడం గతంలో ఎప్పుడూ జరగలేదు. ఈ విషయంపై పాండ్యా టీ20 వరల్డ్ కప్ తర్వాత స్పందించాడు కూడా. గత 6 నెలల కాలం ఎంతో కష్టంగా గడిచిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు.
తాజాగా అదే విషయంపై పరోక్షంగా రియాక్ట్ అవుతూ.. వన్డే వరల్డ్ కప్ 2023 మధ్యలో గాయం నుంచి టోర్నీకి దూరం అయిన తర్వాత నుంచి.. తిరిగి టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచే మధ్య కాలంలో చాలా జరిగిందని అన్నాడు. ఎంతో హార్డ్ వర్క్ చేసి.. ప్రస్తుతం ఈ స్థితిలో నిలిచినట్లు వెల్లడించాడు. తన కష్టానికి ఫలితం దక్కిందని పాండ్యా ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2024 గెలవడంతో పాండ్యా చాలా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు కెప్టెన్సీ దక్కుతుందనే ఆశతో ఉన్న క్రమంలోనే పాండ్యా ఈ ఎమోషనల్ పోస్ట్ చేయడంతో, తనకు కాకుండా ఇంకెవరికి కెప్టెన్సీ ఇస్తారనే ప్రశ్నను బీసీసీఐని పాండ్యా పరోక్షంగా అడిగినట్లు ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.