వీడియో: బాలీవుడ్ హీరోయిన్​తో హార్దిక్ మాస్ స్టెప్స్.. ఇది మామూలు రచ్చ కాదు!

Hardik Pandya: అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ మ్యారేజ్ సెర్మనీలో టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా రచ్చ రచ్చ చేశాడు. ఓ బాలీవుడ్ బ్యూటీతో కలసి మాస్ స్టెప్స్ వేస్తూ అందర్నీ అలరించాడు.

Hardik Pandya: అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ మ్యారేజ్ సెర్మనీలో టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా రచ్చ రచ్చ చేశాడు. ఓ బాలీవుడ్ బ్యూటీతో కలసి మాస్ స్టెప్స్ వేస్తూ అందర్నీ అలరించాడు.

అపర కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ సెర్మనీ కోసం దేశవిదేశాల నుంచి రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు భారీగా విచ్చేస్తున్నారు. దీంతో ఈవెంట్​కు వేదికగా నిలిచిన ముంబైలోని జియో వరల్డ్ సెంటర్​ నిండిపోయింది. వాళ్లు, వీళ్లని కాదు.. చాలా మంది సెలెబ్రిటీలు ఈ ఈవెంట్​లో పాల్గొంటున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ కూడా అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో సందడి చేశారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్, లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని తదితరులు కూడా ఈ వివాహ వేడుకకు విచ్చేశారు. అయితే వాళ్లందరి కంటే స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా స్పెషల్ హైలైట్​గా నిలిచాడు.

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ మ్యారేజ్ సెర్మనీలో అందరి కంటే ఎక్కువగా హార్దిక్ పాండ్యా రచ్చ చేస్తున్నాడు. సాధారణంగా ఇలాంటి ఈవెంట్స్​లో ఫిల్మ్ సెలబ్రిటీస్ పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ, జోక్స్ వేస్తూ హల్​చల్ చేస్తుంటారు. అయితే పాండ్యా వాళ్లతో పోటీపడుతూ ఎంటర్​టైన్ చేస్తున్నాడు. మొన్న సల్మాన్ ఖాన్, రణ్​వీర్ సింగ్​తో హుషారైన స్టెప్స్ వేస్తూ అలరించిన హార్దిక్.. తాజాగా బాలీవుడ్ బ్యూటీ, ‘లైగర్’ ఫేమ్ అనన్య పాండేతో కలసి మాస్ డ్యాన్స్ చేశాడు. డీజే ప్లే చేసిన ఢోల్ బీట్స్​కు వాళ్లిద్దరూ రెచ్చిపోయి స్టెప్పులు వేశారు. అనన్య, హార్దిక్ ఒకరితో ఒకరు పోటీపడుతూ డ్యాన్స్ చేశారు. బీట్స్​కు తగ్గట్లు హ్యాండ్ మూమెంట్స్​ ఇస్తూ హార్దిక్ తనలోని డ్యాన్సింగ్ టాలెంట్​ను బయటకు తీశాడు.

హార్దిక్-అనన్య డ్యాన్స్​ను చుట్టూ ఉన్న ఇతర ప్రముఖులు, గెస్ట్​లు ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా పాండ్యా బీట్స్​కు తగ్గట్లుగా లీనమై స్టెప్స్ వేయడంతో వాళ్లు ఆశ్చర్యపోయారు. ఇది అతడిలోని హిడెన్ టాలెంట్ అని అంటున్నారు. ఇక, ఐపీఎల్-2024 టైమ్​లో కెప్టెన్సీ వివాదం కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు పాండ్యా. ముంబై ఇండియన్స్ సారథిగా, బ్యాటర్​గా, బౌలర్​గా ఫెయిల్ అవడంతో అతడి మీద ట్రోలింగ్ మరింత పెరిగింది. అయితే వాటిని సమర్థంగా ఎదుర్కొన్న హార్దిక్.. టీ20 వరల్డ్ కప్​లో సత్తా చాటాడు. భారత్ కప్పు అందుకోవడంలో కీలక పాత్ర పోషించి నయా హీరోగా అవతరించాడు.

Show comments