Hardik Pandya: వీడియో: వాంఖడేలో హార్దిక్ నామస్మరణ.. ఛీకొట్టినోళ్లతో హీరో అనిపించుకున్నాడు!

వరల్డ్ కప్​తో స్వదేశంలో ల్యాండ్ అయిపోయింది భారత జట్టు. కప్పుతో ప్రధాని మోడీని కలసిన ఆటగాళ్లు ఇప్పుడు ముంబైకి చేరుకున్నారు. వాంఖడే మైదానంలో వాళ్లకు సన్మానం చేయనుంది బీసీసీఐ.

వరల్డ్ కప్​తో స్వదేశంలో ల్యాండ్ అయిపోయింది భారత జట్టు. కప్పుతో ప్రధాని మోడీని కలసిన ఆటగాళ్లు ఇప్పుడు ముంబైకి చేరుకున్నారు. వాంఖడే మైదానంలో వాళ్లకు సన్మానం చేయనుంది బీసీసీఐ.

వరల్డ్ కప్​తో స్వదేశంలో ల్యాండ్ అయిపోయింది భారత జట్టు. కప్పుతో ప్రధాని నరేంద్ర మోడీని కలసిన ఆటగాళ్లు.. ఆయనతో కలసి బ్రేక్​ఫాస్ట్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి ముంబైకి పయనమయ్యారు. ముంబైలో దిగిన ఆటగాళ్లు వాంఖడే స్టేడియానికి బయల్దేరారు. మరికొద్ది సేపట్లో ఓపెన్ బస్​లో టీమిండియా విక్టరీ పరేడ్ మొదలవనుంది. దీంతో ముంబై వీధులు, రోడ్లు జనాలతో స్తంభించిపోయాయి. రోహిత్ సేనను చూసేందుకు దేశంలోని నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన అభిమానులతో ముంబై రోడ్లు కిక్కిరిసిపోయాయి. మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్లు ఫ్యాన్స్​తో నిండిపోయాయి. వాంఖడే స్టేడియానికి వెళ్లే రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. విపరీతమైన ట్రాఫిక్ కారణంగా భారత జట్టు ఆటగాళ్లను తీసుకెళ్లే బస్సు కూడా చిక్కుకుపోయింది.

ఒకవైపు ముంబైలో రోడ్లన్నీ బ్లాక్ కాగా.. భారత ఆటగాళ్లకు సన్మానం జరగనున్న వాంఖడే స్టేడియం పరిసరాల్లో భారీగా వర్షం పడుతోంది. అయితే ఎంత వాన పడినా అభిమానులు మాత్రం స్టేడియంలో నుంచి కదిలేది లేదని కూర్చున్నారు. వరల్డ్ కప్​ పట్టుకొని తమ ఫేవరెట్ ప్లేయర్లు గ్రౌండ్​లో వస్తే మురిసిపోదామని ఎదురు చూస్తున్నారు. వాంఖడేలో ఇప్పుడు రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యా పేరును ఎక్కువగా నినదిస్తున్నారు ఫ్యాన్స్. హార్దిక్.. హార్దిక్.. అంటూ అతడి నామస్మరణ చేస్తున్నారు. ఐపీఎల్-2024 సమయంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వివాదం కారణంగా అభిమానులు పాండ్యాను ఎగతాళి చేశారు. బూ.. అంటూ అతడ్ని అవమానించారు.

ఈ సీజన్ ఐపీఎల్​లో బ్యాటింగ్, బౌలింగ్​తో పాటు కెప్టెన్సీలోనూ హార్దిక్ ఫెయిల్ అవడంతో అతడిపై విమర్శలు మరింత పెరిగాయి. అతడ్ని వరల్డ్ కప్ టీమ్​లోకి తీసుకోవద్దు అంటూ భారీగా డిమాండ్లు వచ్చాయి. అయినా పాండ్యాపై నమ్మకం ఉంచిన బీసీసీఐ అతడ్ని సెలెక్ట్ చేయడమే గాక వైస్ కెప్టెన్​గానూ ప్రమోషన్ ఇచ్చింది. ఆ విశ్వాసాన్ని అతడు వమ్ము చేయలేదు. తన ఆల్​రౌండర్ ప్రదర్శనతో టీమిండియా ప్రపంచ కప్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో హార్దిక్​ను విమర్శించిన వాళ్లే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. తాజాగా వాంఖడేలోనూ ఇదే జరిగింది. ఐపీఎల్ టైమ్​లో అతడ్ని బూ.. అంటూ ఎగతాళి చేసిన వారే ఇప్పుడు హార్దిక్ నామస్మరణతో స్టేడియాన్ని షేక్ చేశారు. మరి.. వాంఖడేలో హార్దిక్ నామస్మరణపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments