Hardik Pandya: వీడియో: స్టన్నింగ్‌ షాట్స్‌తో రెచ్చిపోయిన హార్ధిక్‌ పాండ్యా! పగతో కొడుతున్నాడా?

Hardik Pandya: వీడియో: స్టన్నింగ్‌ షాట్స్‌తో రెచ్చిపోయిన హార్ధిక్‌ పాండ్యా! పగతో కొడుతున్నాడా?

Hardik Pandya, IND vs SL, Wanindu Hasaranga, Matheesha Pathirana: టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా లంకపై అద్బుతమైన షాట్లతో విరుచుకుపడ్డాడు. ఆ షాట్ల విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Hardik Pandya, IND vs SL, Wanindu Hasaranga, Matheesha Pathirana: టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా లంకపై అద్బుతమైన షాట్లతో విరుచుకుపడ్డాడు. ఆ షాట్ల విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా.. ఆదివారం పల్లెకలె వేదికగా జరిగిన రెండో టీ20లో.. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అద్భుతంగా రాణించిన.. యంగ్‌ టీమిండియా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరి టీ20 మ్యాచ్‌ మంగళవారం ఇదే గ్రౌండ్‌లో జరగనుంది. అయితే.. రెండో టీ20లో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన పాండ్యా.. బ్యాటింగ్‌లో 9 బంతుల్లోనే 22 పరుగులతో దుమ్మురేపాడు.

అయితే.. ఈ మ్యాచ్‌లో పాండ్యా కొట్టిన షాట్లు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచాయి. ముఖ్యంగా శ్రీలంక స్టార్‌ స్పిన్నర్‌ వనిందు హసరంగా వేసిన ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌లో చివరి బాల్‌కు పాండ్యా కొట్టిన సిక్స్‌ సూపర్‌ అని చెప్పాలి. డీప్‌ మిడ్‌ వికెట్‌ పైనుంచి.. అద్భుతంగా సిక్స్‌ కొట్టాడు పాండ్యా. ఆ షాట్‌ ఆడిన తర్వాత.. తన బ్యాట్‌ను పాండ్యా ఆశ్చర్యపోతూ చూసున్నాడు. ఆ షాట్‌లో సూపర్‌ పవర్‌ జనరేట్‌ అయింది. బాల్‌ చాలా దూరం వెళ్లి పడింది. ఆ వెంటనే పతిరానా వేసిన 7వ ఓవర్‌ రెండో బంతికి మిడ్‌ ఆఫ్‌ దిశగా సూపర్‌ షాట్‌తో బౌండరీ రాబట్టాడు. ఇది కూడా బంపర్‌ షాట్‌. పాండ్యా కొట్టిన దెబ్బకు బాల్‌ బుల్లెట్‌లా దూసుకెళ్లింది. మిడ్‌ ఆఫ్‌లో ఉన్న ఫీల్డర్‌ గాల్లోకి దూకినా.. బాల్‌ అందలేదు. ఆ తర్వాత బాల్‌కు కూడా బౌండరీ కొట్టి మ్యాచ్‌ ముగించాడు పాండ్యా. మొత్తంగా 9 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 22 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు. పాండ్యా కొట్టిన ఈ షాట్లు చూసి.. కెప్టెన్సీ దక్కలేదనే కోపంతోనే ఇలా కసిగా బాల్‌ను కొడుతున్నాడంటూ సోషల్‌ మీడియాలో క్రికెట్‌ అభిమానులు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. వర్షం కారణంగా మ్యాచ్‌ ఆలస్యంగా మొదలైంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కుసల్‌ పెరీరా 34 బంతుల్లో 53, పథుమ్‌ నిస్సంకా 32, కమిందు మెండిస్‌ 26 పరుగులు చేసి రాణించారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్‌ 3, అర్షదీప్‌, అక్షర్‌ పటేల్‌, హార్ధిక్‌ పాండ్యా రెండేసి వికెట్లు పడగొట్టారు. శ్రీలంక ఇన్నింగ్స్‌ ముగిసి.. టీమిండియా ఛేజింగ్‌ ఆరంభించి మూడు బంతులు అయిన తర్వాత మళ్లీ వర్షం అంతరాయం కలిగించింది. అంపైర్లు టీమిండియా టార్గెట్‌ను 8 ఓవర్లలో 78 పరుగులకు కుదించారు. ఈ టార్గెట్‌ను టీమిండియా 6.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఊదిపారేసింది. జైస్వాల్‌ 30, సూర్యకుమార్‌ యాదవ్‌ 26 పరుగులు చేసి రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో పాండ్యా ఆడిన షాట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments