T20 World Cup: తిట్టిన నోళ్లే మెచ్చుకునేలా మారిన పాండ్యా! ఏం చేశాడంటే?

Hardik Pandya, IND vs IRE, T20 World Cup 2024: ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్‌ కప్‌ 2024ను టీమిండియా విజయంతో మొదలుపెట్టింది. అయితే.. ఈ విజయంలో రోహిత్‌ శర్మతో పాటు మరో హీరో కూడా ఉన్నాడు. అతనే హార్ధిక్‌ పాండ్యా. మరి పాండ్యా ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

Hardik Pandya, IND vs IRE, T20 World Cup 2024: ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్‌ కప్‌ 2024ను టీమిండియా విజయంతో మొదలుపెట్టింది. అయితే.. ఈ విజయంలో రోహిత్‌ శర్మతో పాటు మరో హీరో కూడా ఉన్నాడు. అతనే హార్ధిక్‌ పాండ్యా. మరి పాండ్యా ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా పసికూన ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. బుధవారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ సేన ఏకంగా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రతిష్టాత్మకమైన టీ20 వరల్డ్‌ కప్‌ను విజయంతో మొదలుపెట్టడంతో భారత క్రికెట్‌ అభిమానులు హ్యాపీగా ఉన్నారు. పైగా ఈ ‍మ్యాచ్‌లో రోహిత్‌ శర్మతో కలిసి విరాట్‌ కోహ్లీ ఓపెనర్‌గా దిగి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టడంపై కూడా ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. కానీ, కోహ్లీ ఒక పరుగు మాత్రమే చేసి అవుటై కాస్త నిరాశపర్చాడు. మరోవైపు రోహిత్‌ శర్మ మాత్రం 97 పరుగుల ఛేజింగ్‌లోనూ హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. కానీ, ఈ మ్యాచ్‌లో టీమిండియాకు మరో హీరో కూడా ఉన్నాడు అతనే హార్ధిక్‌ పాండ్యా.

టీ20 వరల్డ్‌ కప్‌ కంటే ముందు అత్యంత దారుణంగా ట్రోలింగ్‌కు గురైన క్రికెటర్‌ ఎవరైనా ఉన్నారా అంటే అది హార్ధిక్‌ పాండ్యా ఒక్కడే. ఐపీఎల్‌ 2024 ప్రారంభం కంటే ముందు నుంచి పాపం పాండ్యా దారుణమైన ట్రోలింగ్‌కు గురి అయ్యాడు. రోహిత్‌ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. అతనిపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ మొదలైంది. తర్వాత.. రోహిత్‌ను బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌కు దింపడం, అలాగే ముంబై ఇండియన్స్‌ వరుస ఓటములు, ఆటగాడిగా హార్ధిక్‌ పాండ్యా విఫలం అవ్వడంతో అతనిపై ట్రోలింగ్‌ మరింత ఎక్కువైంది. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత వ్యక్తిగత జీవితంలో విభేదాలు కూడా పాండ్యాను ఇబ్బంది పెట్టాయి.

వీటన్నింటిని దాటుకుంటూ.. పాండ్యా దేశం కోసం ఆడుతున్నాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో తొలి మ్యాచ్‌లో టీమిండియా మంచి విజయం అందించడంలో తన వంతు పాత్ర పోషించాడు. వరల్డ్ కప్‌ టోర్నీలో బౌలింగ్‌ చేస్తాడా లేదా అనే అనుమానాల నేపథ్యంలో ఐర్లాండ్‌పై 4 ఓవర్ల కోటా పూర్తిగా వేయడమే కాకుండా ఏకంగా 3 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. 4 ఓవర్లలో కేవలం 27 రన్స్ ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇది టీమిండియా ఎంతో సానుకూల అంశం అనే చెప్పాలి. రాబోయే మ్యాచ్‌ల్లో పాండ్యా ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. టీమిండియా మరింత పటిష్టంగా అవుతుంది. మరి వరల్డ్‌ కప్‌ తొలి మ్యాచ్‌తోనే రోహిత్‌ శర్మతో పాటు హార్ధిక్‌ పాండ్యా ఫామ్‌లోకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments