iDreamPost
android-app
ios-app

సీనియర్స్‌పై పాండ్యా చిన్న చూపు! మలింగా, పొలార్డ్‌ని పైకి లేపి!

  • Published Mar 28, 2024 | 4:03 PM Updated Updated Mar 28, 2024 | 4:03 PM

Hardik Pandya, Lasith Malinga: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌ సందర్భంగా ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా.. లసిత్‌ మలింగా, కీరన్‌ పొలార్డ్‌ లాంటి సీనియర్‌ స్టార్‌ ఆటగాళ్లను అవమానించాడు. దాని గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం..

Hardik Pandya, Lasith Malinga: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌ సందర్భంగా ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా.. లసిత్‌ మలింగా, కీరన్‌ పొలార్డ్‌ లాంటి సీనియర్‌ స్టార్‌ ఆటగాళ్లను అవమానించాడు. దాని గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 28, 2024 | 4:03 PMUpdated Mar 28, 2024 | 4:03 PM
సీనియర్స్‌పై పాండ్యా చిన్న చూపు! మలింగా, పొలార్డ్‌ని పైకి లేపి!

వరుస ఓటములు హార్ధిక్‌ పాండ్యాను మానసికంగా ఇబ్బంది పెడుతున్నట్లు ఉన్నాయి. అందుకే ఎవరితో ఎలా ప్రవర్తించాలో కూడా మర్చిపోయి పాండ్యా అతి చేస్తున్నాడని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. తనకంటే చాలా సీనియర్లు, పైగా టీమ్‌లో ఒక్కో విభాగానికి కోచ్‌లుగా ఉన్నారు. అలాంటి పొజిషన్‌లో ఉన్న వారిని, సీనియర్‌ క్రికెటర్లను పాండ్యా దారుణంగా అవమానించాడు. ముంబై ఇండియన్స్‌ బౌలింగ్‌ లసిత్‌ మలింగా, అలాగే బ్యాటింగ్‌ కోచ్‌గా ఉన్న కీరన్‌ పొలార్డ్‌లతో హార్ధిక్‌ పాండ్యా వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకీ పాండ్యా వారిద్దరిని ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

బుధవారం హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ ఆడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఐపీఎల్‌ చరిత్రలో కనివినీ ఎరుగని విధంగా అత్యంత భారీ స్కోర్‌ నమోదు చేసింది. 20 ఓవర్లలో ఏకంగా 277 పరుగులు సాధించింది. అయితే.. ఈ స్కోర్‌ చూసే ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌పై ఆశలు వదులుకున్నట్లు కనిపించింది. అయితే.. భారీ స్కోర్‌ వల్ల వచ్చిన ఒత్తిడో ఏమో కాని ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా కాస్త అసహనానికి లోనయ్యాడు. డగౌట్‌లో బ్యాటింగ్‌కు వచ్చే ముందు ప్యాడ్లు అన్ని కట్టుకుని సిద్ధంగా ఉన్న సమయంలో.. అక్కడే కూర్చున్న మలింగా, పొలార్డ్‌లలో ఒకరి నుంచి కూర్చి కావాలని అడిగాడు.

నిజానికి వాళ్లిద్దరూ సీనియర్‌ ప్లేయర్స్‌, ప్రస్తుతం కోచ్‌లుగా ఉన్నారు. అలాంటి వారిని లేపి పాండ్యా కూర్చి కావాలని కోరాడు. దాంతో పొలార్డ్‌ లేచి కూర్చి ఇవ్వబోతుంటే.. మలింగా పొలార్డ్‌ను ఆపి, తన కూర్చిలోంచి లేచి వెళ్లిపోయాడు. అది మలింగాకు చాలా అవమానంగా అనిపించినట్లు ఉండి. అయితే.. తనకు కూర్చి కావాలంటే వెళ్లి తెచ్చుకోవాలి, లేదా అక్కడున్న సిబ్బందితో తెప్పించుకోవాలి కానీ, తన కంటే సీనియర్‌ ప్లేయర్స్‌ను లేపి కూర్చి లాక్కొవడం ఏంటంటూ క్రికెట్‌ అభిమానులు పాండ్యాపై మండిపడుతున్నారు. ఇప్పటికే రోహిత్‌ శర్మ విషయంలో దారుణమైన ట్రోలింగ్‌కు గురవుతున్న పాండ్యా.. అది సరిపోదన్నట్లు.. ఇప్పుడు సీనియర్‌ ప్లేయర్లను అవమానించి మరింత విమర్శల పాలవుతున్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.