Somesekhar
టీ20 వరల్డ్ కప్ 2024లో దారుణంగా విఫలం అవుతున్న టీమిండియా రన్ మెషిన్ కు అండగా నిలిచాడు హర్భజన్ సింగ్. విరాట్ విఫలం అవ్వడంతో అతడి తప్పేం లేదని షాకింగ్ రీజన్ వెల్లడించాడు. ఆ వివరాల్లోకి వెళితే..
టీ20 వరల్డ్ కప్ 2024లో దారుణంగా విఫలం అవుతున్న టీమిండియా రన్ మెషిన్ కు అండగా నిలిచాడు హర్భజన్ సింగ్. విరాట్ విఫలం అవ్వడంతో అతడి తప్పేం లేదని షాకింగ్ రీజన్ వెల్లడించాడు. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ లో హాట్ టాపిక్ గా మారిన ప్లేయర్. ఐపీఎల్ 2024లో పరుగుల వరదపారించిన ఈ రన్ మెషిన్, మెగాటోర్నీలో మాత్రం దారుణంగా విఫలం అవుతున్నాడు. గ్రూప్ స్టేజ్ లో ఆడిన మూడు మ్యాచ్ ల్లో దారుణంగా విఫలం అయ్యాడు. మూడు మ్యాచ్ ల్లో కలిపి కేవలం 5 రన్స్ మాత్రమే చేసి.. విమర్శల పాలవుతున్నాడు. కోహ్లీ ఫామ్ పై మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కోహ్లీకి అండగా నిలిచాడు. కోహ్లీ విఫలం అవ్వడంతో తప్పు అతడిది లేదని స్పష్టం చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం జరుగుతున్న పొట్టి ప్రపంచ కప్ లో పరుగుల సునామీ సృష్టిస్తాడనుకున్న టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ.. ఊహించని విధంగా విఫలం అవుతున్నాడు. దాంతో కొందరు పాక్ మాజీలు కోహ్లీపై విమర్శల బాణాలు సంధిస్తున్నారు. అయితే ఈ విషయంలో విరాట్ కు మద్ధతు తెలిపేవారు సైతం ఉన్నారు. ఆ జాబితాలోకి తాజాగా చేరాడు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. కోహ్లీ ఫామ్ పై భజ్జీ ఈ విధంగా మాట్లాడాడు..
“న్యూయార్క్ లోని నసౌవ్ కౌంటీ క్రికెట్ స్టేడియం బ్యాటర్లకు చుక్కలు చూపించింది. ఇలాంటి పిచ్ లపై బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. ప్రస్తుతం కోహ్లీ పరుగులు చేయకపోవడానికి ఈ పిచే కారణం. అంతేగానీ.. తప్పు విరాట్ కోహ్లీది కానే కాదు. ఇలాంటి పిచ్ లపై రాణించని బ్యాటర్లను తప్పుపట్టడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. అయితే ఓపెనర్ గా వస్తున్నాడు కాబట్టి కోహ్లీపై కొద్దిగా ఒత్తిడి ఉండటం సహజమే. దాన్ని అధిగమించి అతడు రాణించాలి. ఇక పవర్ ప్లేలో రోహిత్, విరాట్ మంచి ఆరంభాన్ని ఇస్తే.. నెక్ట్స్ బ్యాటింగ్ వచ్చే పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే వారిపని వారు చేసుకుపోతారు” అని స్టార్ స్పోర్ట్స్ తో భజ్జీ చెప్పుకొచ్చాడు. మరి హర్భజన్ అన్నట్లుగా విఫలం కావడం విరాట్ కోహ్లీ తప్పు కాదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.