Nidhan
పాకిస్థాన్ నయా కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌కు టీమిండియా లెజెండ్ హర్భజన్ సింగ్ కీలక సూచన చేశాడు. కిర్‌స్టెన్ పాక్‌ను వదిలేసి.. ఆ టీమ్‌లోకి వెళ్లాలని అన్నాడు.
పాకిస్థాన్ నయా కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌కు టీమిండియా లెజెండ్ హర్భజన్ సింగ్ కీలక సూచన చేశాడు. కిర్‌స్టెన్ పాక్‌ను వదిలేసి.. ఆ టీమ్‌లోకి వెళ్లాలని అన్నాడు.
Nidhan
పాకిస్థాన్ టీమ్ ఇప్పుడు కాంట్రవర్సీలకు అడ్డాగా మారింది. ఒకప్పుడు క్రికెట్లో తమ పేస్ బౌలింగ్‌తో డామినేట్ చేస్తూ పలు ఐసీసీ టైటిల్స్ దక్కించుకున్న ఆ జట్టు.. ఇప్పుడు మునుపటి ప్రభ కోల్పోయింది. పసికూన జట్ల చేతుల్లోనూ ఓడిపోయే స్థితికి దిగజారింది. గత వన్డే వరల్డ్ కప్-2023లో గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టిన బాబర్ సేన.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌లోనూ లీగ్ స్టేజ్‌లోనే వెనుదిరిగింది. ఫేవరెట్ టీమిండియాతో పాటు ఆతిథ్య యూఎస్ఏ చేతుల్లో ఓడింది. దీంతో అందరూ ఆ టీమ్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇంత చెత్త ఆటతీరు ఎప్పుడూ చూడలేదని సొంత అభిమానులే పాక్ ప్లేయర్లను విమర్శిస్తున్నారు. ఆ జట్టు పనైపోయిందని మాజీ క్రికెటర్లు కూడా దుయ్యబడుతున్నారు. అంతెందుకు ఆ టీమ్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ కూడా ఆటగాళ్ల ప్రదర్శనపై సీరియస్ అయ్యాడు.
పాకిస్థాన్‌పై కిర్‌స్టెన్ విమర్శలు గుప్పించాడు. జట్టులో ఐకమత్యం లేదని.. అసలు ఇది టీమే కాదన్నాడు. ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో చాలా జట్లకు ట్రెయినింగ్ ఇచ్చానని.. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ చూడలేదని కిర్‌స్టెన్ చెప్పినట్లు పాకిస్థాన్ మీడియాలో కథనాలు వచ్చాయి. టీమిండియాతో మ్యాచ్‌లో గెలిచే పరిస్థితిలో ఉండి కూడా ఓడిపోవడం దారుణమని.. తాను తీవ్ర నిరాశకు గురైనట్లు కిర్‌స్టన్ వాపోయాడని ఆ కథనం పేర్కొంది. ఇంటర్నేషనల్ లెవల్లో ఎన్నో సక్సెస్‌లు చూశాడు కిర్‌స్టన్. టీమిండియాకు కోచ్‌గా ఉంటూ 2011 వన్డే వరల్డ్ కప్ అందించాడు. అలాంటోడు ఇప్పుడు పాక్‌కు కోచ్‌గా వెళ్లాడు. కానీ పొట్టి కప్పులో ఆ టీమ్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కిర్‌స్టెన్ పాక్ టీమ్‌ను వదిలేయాలని అతడు సూచించాడు.
పాకిస్థాన్ జట్టును కిర్‌స్టన్ వీడటం మంచిదని, అక్కడ ఉండి టైమ్ వేస్ట్ చేసుకోవద్దని భజ్జీ అన్నాడు. పాక్‌ను వీడి టీమిండియాకు కోచ్‌గా రావాలని సూచించాడు. ‘గ్యారీ.. నీ టైమ్ వేస్ట్ చేసుకోకు. పాకిస్థాన్ జట్టును వదిలెయ్. టీమిండియాలో జాయిన్ అవ్వు. భారత టీమ్‌కు కోచింగ్ ఇవ్వడానికి తిరిగొచ్చేయ్’ అని హర్భజన్ చెప్పాడు. కిర్‌స్టన్ సూపర్ కోచ్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు. అతడు గొప్ప మెంటార్ అని, అలాంటోడు టీమ్‌తో ఉంటే చాలా బెనిఫిట్ అని పేర్కొన్నాడు భజ్జీ. ప్రపంచ కప్-2011 గెలిచిన తమ టీమ్‌కు కిర్‌స్టెన్ మంచి ఫ్రెండ్ అన్నాడు. అతడు ఉండాల్సింది పాక్ టీమ్‌తో కాదు.. భారత్‌తో అంటూ హర్భజన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇది చూసిన నెటిజన్స్.. అవును, కిర్‌స్టెన్ టీమిండియాలోకి తిరిగొచ్చేయ్ అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం భారత జట్టుకు నయా కోచ్‌గా గంభీర్ వస్తే బెటర్ అని.. కిర్‌స్టన్ అక్కర్లేదని అంటున్నారు. మరి.. కిర్‌స్టెన్ టీమిండియాలోకి రావాలంటూ హర్భజన్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Don’t waste ur time there Gary .. Come back to Coach Team INDIA .. Gary Kirsten One of the rare 💎.. A Great Coach ,Mentor, Honest nd very dear friend to all in the our 2011 Team .. our winning coach of 2011 worldcup . Special man Gary ❤️ @Gary_Kirsten https://t.co/q2vAZQbWC4
— Harbhajan Turbanator (@harbhajan_singh) June 17, 2024